Team India Test Captain: ‘‘ఈ ప్రశ్నకు నా దగ్గర సమాధానం లేదు. సెలక్టర్ల మైండ్‌సెట్ ఎలా ఉంటుందో మనం అంచనా వేయలేం కదా! నిజానికి డబ్ల్యూటీసీ తాజా సైకిల్ ఆరంభం కానున్న నేపథ్యంలో సెలక్టర్లు ప్రతి విషయంలో పూర్తి స్పష్టతతో ఉండాలి. అజింక్య రహానే వైస్ కెప్టెన్‌గా పునరాగమనం చేసినపుడు మరి విరాట్ కోహ్లి ఎందుకు తిరిగి కెప్టెన్ కాకూడదు? మరోసారి కెప్టెన్సీ చేపట్టే విషయంలో కోహ్లి ఆలోచనా ధోరణి ఎలా ఉందో నాకు తెలియదు.
ఒకవేళ రోహిత్ తర్వాత కెప్టెన్ ఎవరన్న అంశంపై సెలక్టర్లు చర్చిస్తూ ఉంటే కచ్చితంగా విరాట్ రూపంలో వాళ్ల ముందు గొప్ప ఆప్షన్ ఉంది’’ అని టీమిండియా మాజీ చీఫ్ సెలక్టర్ ఎమ్‌ఎస్‌కే ప్రసాద్ అన్నాడు. టెస్టు సారథిగా టీమిండియాకు ఎన్నో చిరస్మరణీయ విజయాలు అందించిన కోహ్లిని తిరిగి కెప్టెన్ చేస్తే బాగుంటుందని అభిప్రాయపడ్డాడు.
కాగా ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్-2023 ఫైనల్ తర్వాత రోహిత్ కెప్టెన్సీపై విమర్శలు వెల్లువెత్తుతున్న విషయం తెలిసిందే. ద్వైపాక్షిక సిరీస్‌లలో భారత్‌కు విజయాలు అందించిన 36 ఏళ్ల రోహిత్.. ఐసీసీ ఈవెంట్లలో విఫలం కావడం, వయసు పైబడటం కూడా అతడిని సారథిగా తొలగించాలనే డిమాండ్లకు కారణం.
ఈ నేపథ్యంలో తదుపరి కెప్టెన్ ఎవరన్న అంశంపై చర్చ నడుస్తున్న తరుణంలో ఎమ్‌ఎస్‌కే ప్రసాద్ ఖేల్ నౌతో మాట్లాడుతూ ఈ మేరకు వ్యాఖ్యలు చేశాడు. కోహ్లి తిరిగి టెస్టు పగ్గాలు చేపడితే బాగుంటుందన్న ప్రసాద్.. కోహ్లి ఈ విషయం పట్ల సుముఖంగా లేకుంటే శుబ్‌మన్ గిల్ కూడా మంచి ఆప్షన్ అని పేర్కొన్నాడు. అయితే, ఈ యువ బ్యాటర్‌పై ఇప్పుడే భారం మోపడం సరికాదని అభిప్రాయపడ్డాడు.
కాగా ఐపీఎల్-2023లో అదరగొట్టిన రహానే.. డబ్ల్యూటీసీ ఫైనల్-2023తో టెస్టు జట్టులో పునరాగమనం చేశాడు. కీలక మ్యాచ్‌లో మెరుగైన ప్రదర్శనతో ఆకట్టుకున్న ఈ వెటరన్ బ్యాటర్.. వెస్టిండీస్‌తో టెస్టు జట్టుకు వైస్ కెప్టెన్‌గా నియమితుడయ్యాడు. కాగా జూలై 12 నుంచి టీమిండియా- విండీస్ మధ్య తొలి టెస్టు ఆరంభం కానుంది.
చదవండి: Ind Vs WI: షెడ్యూల్, మ్యాచ్ ఆరంభ సమయం, జట్లు.. పూర్తి వివరాలివే
Ind Vs WI: ద్రవిడ్ సెంచరీ.. కోహ్లి 19 పరుగులు! విరాట్ ట్వీట్ వైరల్
Comments
Please login to add a commentAdd a comment