ఈపీఎల్ బ్రాండ్ అంబాసిడర్‌గా ధోని | mahendra singh Dhoni to promote English Premier League in India | Sakshi
Sakshi News home page

ఈపీఎల్ బ్రాండ్ అంబాసిడర్‌గా ధోని

Published Fri, Aug 9 2013 1:21 AM | Last Updated on Fri, Sep 1 2017 9:44 PM

ఈపీఎల్ బ్రాండ్ అంబాసిడర్‌గా ధోని

ఈపీఎల్ బ్రాండ్ అంబాసిడర్‌గా ధోని

 న్యూఢిల్లీ: భారత క్రికెట్ కెప్టెన్ మహేంద్రసింగ్ ధోని... భారత్‌లో ఫుట్‌బాల్‌ను ప్రమోట్ చేయనున్నాడు. ఇంగ్లీష్ ప్రీమియర్ లీగ్‌ను భారత్‌లో ప్రమోట్ చేసేందుకు స్టార్‌స్పోర్ట్స్ సంస్థ ధోనితో ఒప్పందం చేసుకుంది. ఈ లీగ్ కోసం చానెల్‌కు మహీ బ్రాండ్ అంబాసిడర్‌గా పనిచేస్తాడు.
 
  వ్యక్తిగతంగా ధోని ఫుట్‌బాల్‌కు వీరాభిమాని. ఈపీఎల్‌లో మాంచెస్టర్ యునెటైడ్ జట్టును ఇష్టపడతాడు. ‘క్రికెట్ లేకపోతే వారాంతాల్లో బీపీఎల్ చూసేందుకు టీవీకి అతుక్కుపోతాను. దేశంలో క్రికెట్‌కు అభిమానులు ఎక్కువ. అదే సమయంలో ఇతర క్రీడలను కూడా ప్రోత్సహించాలి. స్కూల్‌లో ఉన్నప్పుడు ఫుట్‌బాల్‌లో నేను గోల్‌కీపర్‌ని’ అని ధోని చెప్పాడు. ఈ సీజన్ నుంచి స్టార్‌స్పోర్ట్స్ ఈపీఎల్‌కు హిందీ కామెంటరీ కూడా అందించనుంది.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement