కరోనా నేపథ్యంలో గత మూడు సీజన్‌లు పలు ఆంక్షల మధ్య జరిగిన ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) టి20 క్రికెట్ టోర్నీకి మళ్లీ పూర్వ వైభవం వచ్చింది. ఈసారి ఎలాంటి ఆంక్షలు లేకుండా అభిమానులకు పూర్తిస్థాయిలో వేసవిలో పరుగుల విందు అందించడానికి ఐపీఎల్ జట్లు సిద్ధమయ్యాయి.
శుక్రవారం అహ్మదాబాద్‌లో డిఫెండింగ్ చాంపియన్ గుజరాత్ టైటాన్స్, నాలుగుసార్లు విజేత చెన్నై సూపర్ కింగ్స్ మధ్య తొలి మ్యాచ్‌తో ఐపీఎల్ 16వ సీజన్‌కు తెర లేవనుంది. మొత్తం 10 జట్ల మధ్య 12 నగరాల్లో 74 మ్యాచ్‌లు జరగనున్నాయి. లీగ్ దశలో 70 మ్యాచ్‌లు ఉండగా... ప్లే ఆఫ్ దశలో నాలుగు మ్యాచ్‌లతో (క్వాలిఫయర్–1, ఎలిమినేటర్, క్వాలిఫయర్–2, ఫైనల్) టోర్నీ ముగుస్తుంది.
రాజస్తాన్ రాయల్స్ జట్టు జైపూర్‌తోపాటు గువాహటిలో... పంజాబ్ కింగ్స్ జట్టు మొహాలితోపాటు ధర్మశాలలో కూడా మ్యాచ్‌లు ఆడతాయి. కరోనా కంటే ముందు ఐపీఎల్‌లో ఇంటా, బయటా పద్ధతిలో ఆయా ఫ్రాంచైజీల మధ్య మ్యాచ్‌లు జరిగేవి. కరోనా కారణంగా ఈ పద్ధతికి విరామం ఇచ్చారు. ఇప్పుడు అంతా బాగుండటంతో నిర్వాహకులు మళ్లీ పాత పద్ధతిలో ఐపీఎల్‌ను నిర్వహించనున్నారు.
నోట్: ప్లే ఆఫ్ (క్వాలిఫయర్–1, ఎలిమినేటర్, క్వాలిఫయర్–2) మూడు మ్యాచ్‌ల తేదీలను, వేదికలను తర్వాత ప్రకటిస్తారు. ఫైనల్ మ్యాచ్ మే 28న జరుగుతుంది. ఫైనల్ మ్యాచ్ వేదికను కూడా తర్వాత ప్రకటిస్తారు.
మ్యాచ్‌లన్నీ స్టార్ స్పోర్ట్స్ చానెల్స్‌లో, జియో సినిమా యాప్‌లో ప్రత్యక్ష ప్రసారం చేస్తారు.
Comments
Please login to add a commentAdd a comment