ఐపీఎల్-2024 ప్లే ఆఫ్స్ ఆశలను సజీవం చేసుకున్న గుజరాత్ టైటాన్స్‌కు భారీ ఎదురుదెబ్బ తగిలింది. శతక వీరుడు కెప్టెన్ శుబ్‌మన్ గిల్‌తో పాటు తుదిజట్టులో ఉన్న ఆటగాళ్లందరికీ ఐపీఎల్ నిర్వాహకులు భారీ జరిమానా విధించారు.
కాగా అహ్మదాబాద్ వేదికగా చెన్నై సూపర్ కింగ్స్‌తో మ్యాచ్‌లో గుజరాత్ టైటాన్స్ 35 పరుగుల తేడాతో గెలుపొందింది. ఓపెనర్లు సాయి సుదర్శన్(103), శుబ్‌మన్ గిల్(104) సునామీ శతకాలతో చెలరేగగా.. 231 పరుగులు స్కోరు చేసింది.
అనంతరం లక్ష్య ఛేదనలో చెన్నైని 196 పరుగులకే కట్టడి చేసి.. ఈ సీజన్‌లో ఐదో విజయం సాధించింది. తద్వారా ప్లే ఆఫ్స్ రేసులో నిలవగలిగింది. దీంతో ఫుల్ జోష్‌లో ఉన్న గుజరాత్ టైటాన్స్‌కు జరిమానా రూపంలో భారీ షాక్ తగిలింది.
నిర్ణీత సమయంలో బౌలింగ్ కోటా పూర్తి చేయనందున కెప్టెన్ శుబ్‌మన్ గిల్‌కు రూ.24 లక్షలు, ఇంపాక్ట్ ప్లేయర్ సహా తుదిజట్టులోని ఆటగాళ్ల ఫీజులో 25 శాతం మేర బీసీసీఐ కోత విధించింది. స్లో ఓవర్ రేటు మెయింటెన్ చేసిన కారణంగా ఈ మేరకు నిర్ణయం తీసుకుంది.
ఈ ఎడిషన్‌లో గుజరాత్ టైటాన్స్ రెండోసారి ఈ తప్పిదానికి పాల్పడినందుకు కెప్టెన్‌కు రూ. 24 లక్షలు, తుదిజట్టులోని ఆటగాళ్లకు రూ. 6 లక్షలు లేదా మ్యాచ్ ఫీజులో 25 శాతం కోత(ఏది తక్కువగా ఉంటే అది) ఫైన్ వేస్తున్నట్లు ప్రకటన విడుదల చేసింది.
గుజరాత్ వర్సెస్ చెన్నై స్కోర్లు
👉వేదిక: అహ్మదాబాద్.. నరేంద్ర మోదీ స్టేడియం
👉టాస్: చెన్నై.. బౌలింగ్
👉గుజరాత్ స్కోరు: 231/3 (20)
👉చెన్నై స్కోరు: 196/8 (20)
👉ఫలితం: 35 పరుగుల తేడాతో చెన్నైపై గుజరాత్ విజయం
👉ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్: శుబ్‌మన్ గిల్
చదవండి: Rohit Sharma: అది నా ఇల్లు.. కానీ ఇదే లాస్ట్: రోహిత్ శర్మ కామెంట్స్ వైరల్
A record-breaking opening partnership followed by an effective bowling display to earn 2️⃣ points 🙌
Recap the #GTvCSK clash 🎥 #TATAIPL pic.twitter.com/f9RI6iP8eL— IndianPremierLeague (@IPL) May 11, 2024
Comments
Please login to add a commentAdd a comment