CSK Vs GT: సెంచరీలతో చెలరేగిన గిల్, సాయి.. సీఎస్‌కే ముందు భారీ టార్గెట్‌ | IPL 2024 CSK Vs GT: Shubman Gill And Sai Sudharsan Take Gujarat Titans To 231/3 Vs CSK | Sakshi
Sakshi News home page

CSK vs GT: సెంచరీలతో చెలరేగిన గిల్, సాయి.. సీఎస్‌కే ముందు భారీ టార్గెట్‌

Published Fri, May 10 2024 9:29 PM | Last Updated on Sat, May 11 2024 12:00 PM

Gill-Sudharsan take Gujarat Titans to 231/3 vs CSK

ఐపీఎల్‌-2024లో భాగంగా అహ్మ‌దాబాద్ వేదిక‌గా చెన్నై సూప‌ర్ కింగ్స్‌తో మ్యాచ్‌లో గుజరాత్‌ ఓపెనర్లు శుబ్‌మన్‌ గిల్‌, సాయిసుదర్శన్‌ విధ్వంసం సృష్టించారు. కీలక మ్యాచ్‌లో గిల్‌, సాయి సుదర్శన్‌ అద్బుతమైన సెంచరీలతో చెలరేగారు. సీఎస్‌కే బౌలర్లను వీరిద్దరూ ఓ ఆట ఆడుకున్నారు.

51 బంతుల్లో సాయి సుదర్శన్‌ 5 ఫోర్లు, 7 సిక్స్‌లతో 103 పరుగులు చేయగా.. గిల్‌ 55 బంతుల్లో 9 ఫోర్లు, 6 సిక్స్‌లతో 104 పరుగులు చేశాడు.  తొలి వికెట్‌కు వీరిద్దరూ 210 పరుగుల భారీ భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. 

దీంతో తొలుత బ్యాటింగ్‌ చేసిన గుజరాత్‌ నిర్ణీత 20 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 231 పరుగుల భారీ స్కోర్‌ చేసింది. 

సీఎస్‌కే బౌలర్లలో ఒక్క తుషార్‌ దేశ్‌పాండే మినహా మిగితా బౌలర్లంతా దారుణంగా విఫలమయ్యారు. దేశ్‌ పాండే రెండు వికెట్లు పడగొట్టాడు. కాగా సా​‍యిసుదర్శన్‌కు ఇదే తొలి ఐపీఎల్ సెంచరీ కావడం విశేషం.

 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement