ఐపీఎల్-2024లో గుజరాత్ టైటాన్స్ తమ ప్లే ఆఫ్ ఆశలను సజీవంగా ఉంచుకుంది. ప్లే ఆఫ్ ఆశలు నిలవాలంటే తప్పక గెలవాల్సిన మ్యాచ్‌లో గుజరాత్ అద్భుత విజయం సాధించింది. అహ్మదాబాద్ వేదికగా చెన్నై సూపర్ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 35 పరుగుల తేడాతో గుజరాత్ విజయ భేరి మ్రోగించింది.
232 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన సీఎస్‌కే నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 196 పరుగులు మాత్రమే చేసింది. సీఎస్‌కే బ్యాటర్లలో డారిల్ మిచెల్(63), మొయిన్ అలీ(56) పరుగులతో రాణించినప్పటికి మిగితా బ్యాటర్ల నుంచి పెద్దగా సహకారం లభించకపోవడంతో సీఎస్‌కే ఓటమి పాలైంది.
గుజరాత్ బౌలర్లలో మొహిత్ శర్మ మూడు వికెట్లు, రషీద్ ఖాన్ రెండు, సందీప్ వారియర్, ఉమేశ్ యాదవ్ తలా వికెట్ సాధించారు.
సాయి, గిల్ విధ్వంసం..
అంతకముందు బ్యాటింగ్ చేసిన గుజరాత్ టైటాన్స్ నిర్ణీత 20 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 231 పరుగుల భారీ స్కోర్ చేసింది. గుజరాత్ ఓపెనర్లు శుబ్‌మన్ గిల్, సాయిసుదర్శన్ విధ్వంసకర సెంచరీలతో చెలరేగారు.
51 బంతుల్లో సాయి సుదర్శన్ 5 ఫోర్లు, 7 సిక్స్‌లతో 103 పరుగులు చేయగా.. గిల్ 55 బంతుల్లో 9 ఫోర్లు, 6 సిక్స్‌లతో 104 పరుగులు చేశాడు. సీఎస్‌కే బౌలర్లలో ఒక్క తుషార్ దేశ్‌పాండే మినహా మిగితా బౌలర్లంతా దారుణంగా విఫలమయ్యారు. దేశ్ పాండే రెండు వికెట్లు పడగొట్టాడు.
Comments
Please login to add a commentAdd a comment