ఐపీఎల్-2024లో అహ్మదాబాద్ వేదికగా చెన్నై సూపర్ కింగ్స్‌తో మ్యాచ్‌లో గుజరాత్ టైటాన్స్ ఓపెనర్లు శుబ్‌మన్ గిల్, సాయిసుదర్శన్ సెంచరీల మోత మోగించారు. ఈ మ్యాచ్‌లో సుదర్శన్ ,గిల్ ఆకాశమే హద్దుగా చెలరేగిపోయారు. సీఎస్‌కే బౌలర్లను ఉతికారేశారు.
51 బంతుల్లో సాయి సుదర్శన్ 5 ఫోర్లు, 7 సిక్స్‌లతో 103 పరుగులు చేయగా.. గిల్ 55 బంతుల్లో 9 ఫోర్లు, 6 సిక్స్‌లతో 104 పరుగులు చేశాడు. కాగా తొలి వికెట్‌కు వీరిద్దరూ 210 పరుగుల భారీ భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. తద్వారా ఐపీఎల్‌లో లక్నో ఆటగాళ్లు డికాక్, కేఎల్ రాహుల్ పేరిట ఉన్న 210 పరుగుల ఓపెనింగ్ భాగస్వామ్య రికార్డును గిల్, సుదర్శన్ జోడీ సమం చేసింది.
ఐపీఎల్-2022 సీజన్‌లో కేకేఆర్‌పై డికాక్, కేఎల్ రాహుల్ తొలి వికెట్ సరిగ్గా 210 పరుగుల పార్టనర్ షిష్ నమోదు చేశారు. అదే విధంగా ఈ క్యాష్‌రిచ్ లీగ్ చరిత్రలో ఏ వికెట్‌కైనా అత్యధిక భాగస్వామ్యం నెలకొల్పిన నాలుగో జోడీ వీరిద్దరూ నిలిచారు.
ఈ జాబితాలో ఏబీ డివిలియర్స్, విరాట్ కోహ్లి జోడి ఉంది. వీరిద్దరూ 2016 ఐపీఎల్ సీజన్‌లో విరాట్, ఏబీడీ జోడీ రెండో వికెట్‌కు 229 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు.
Comments
Please login to add a commentAdd a comment