WC- Ind vs Eng: టీమిండియా అభిమానులకు బ్యాడ్‌న్యూస్‌! | Ind vs Eng Warm Up Match WC 2023 In Guwahati Abandoned Due To Rain | Sakshi
Sakshi News home page

WC 2023- Ind vs Eng: టీమిండియా అభిమానులకు బ్యాడ్‌న్యూస్‌! మ్యాచ్‌ రద్దు

Published Sat, Sep 30 2023 5:58 PM | Last Updated on Sat, Sep 30 2023 6:27 PM

Ind vs Eng Warm Up Match WC 2023 In Guwahati Abandoned Due To Rain - Sakshi

ICC Cricket World Cup Warm-up Matches 2023- India vs England: వన్డే ప్రపంచకప్‌-2023 సన్నాహక మ్యాచ్‌ కోసం ఆశగా ఎదురుచూసిన టీమిండియా అభిమానులకు వరణుడు షాకిచ్చాడు. గువాహటిలో ఎడతెరిపిలేని వర్షం కారణంగా ఇంగ్లండ్‌తో శనివారం జరగాల్సిన వామప్‌ మ్యాచ్‌ రద్దైపోయింది. కాగా అసోంలోని బర్సపరా స్టేడియంలో రోహిత్‌ సేన.. జోస్‌ బట్లర్‌ బృందంతో తమ తొలి వామప్‌ మ్యాచ్‌ ఆడేందుకు సిద్ధమైంది.

ఈ మ్యాచ్‌లో టాస్‌ గెలిచిన భారత జట్టు తొలుత బ్యాటింగ్‌ ఎంచుకుంది. అయితే, టాస్‌ అనంతరం వర్షం మొదలుకావడంతో ఆలస్యంగానైనా ఆట మొదలవుతుందని అభిమానులు ఆశించారు. కానీ వరణుడు వాళ్ల ఆశలపై నీళ్లు చల్లాడు. వర్షం తగ్గే సూచనలు కనిపించకపోవడంతో అంపైర్లు టీమిండియా- ఇంగ్లండ్‌ వామప్‌ మ్యాచ్‌ను రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు.  

వన్డే వరల్డ్‌కప్‌-2023 వామప్‌ మ్యాచ్‌
టీమిండియా (బ్యాటింగ్‌ ఎలెవన్‌, ఫీల్డింగ్‌ ఎలెవన్‌): 
రోహిత్ శర్మ(కెప్టెన్‌), శుభ్‌మన్ గిల్, విరాట్ కోహ్లి, ఇషాన్ కిషన్, శ్రేయస్ అయ్యర్, కేఎల్ రాహుల్(వికెట్‌ కీపర్‌), సూర్యకుమార్ యాదవ్, హార్దిక్ పాండ్యా, రవీంద్ర జడేజా, రవిచంద్రన్ అశ్విన్, కుల్దీప్ యాదవ్, శార్దూల్ ఠాకూర్ , జస్ప్రీత్ బుమ్రా, మహ్మద్ సిరాజ్, మహ్మద్ షమీ.

ఇంగ్లండ్ (బ్యాటింగ్‌ ఎలెవన్‌, ఫీల్డింగ్‌ ఎలెవన్‌): 
డేవిడ్ మలన్, జానీ బెయిర్‌స్టో, జో రూట్, హ్యారీ బ్రూక్, జోస్ బట్లర్(కెప్టెన్‌), లియామ్ లివింగ్‌స్టోన్, బెన్ స్టోక్స్, మొయిన్ అలీ, క్రిస్ వోక్స్, సామ్ కరన్, డేవిడ్ విల్లీ, ఆదిల్ రషీద్, గుస్ అట్కిన్సన్, రీస్ టోప్లీ, మార్క్ వుడ్.

చదవండి: సచిన్‌, కోహ్లి కాదు! అతడికి బౌలింగ్‌ చేయడం చాలా కష్టం: డేల్‌ స్టెయిన్‌

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement