
గవాహటి: టీమిండియా-శ్రీలంక జట్ల మధ్య ఆదివారం జరగాల్సిన తొలి టీ20 మ్యాచ్ వర్షంతో రద్దయ్యింది. సాయంత్రం టాస్ పడిన తర్వాత భారీ వర్షం కురవడంతో మైదానం పూర్తిగా తడిసిపోగా, కవర్లు కప్పి ఉంచినా వర్షపు నీరు గ్రౌండ్‌లోకి వచ్చింది. దీనిపై విమర్శలు వచ్చాయి. పిచ్‌ను కవర్లతో కప్పి ఉంచినా వికెట్‌పైకి వర్షం నీరు రావడానికి నాసిరకం కవర్లు వాడటమే కారణమంటూ పలువురు విమర్శించారు. ఇదిలా ఉంచితే, పిచ్‌ను నిర్ణీత సమయానికి సిద్ధం చేయకపోవడతో రాత్రి గం.9.54 ని.లు రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు. చివరగా అంపైర్లు, మ్యాచ్ రిఫరీ డేవిడ్ బూన్ వికెట్‌ను పరిశీలించి మ్యాచ్‌ను రద్దు చేస్తున్నట్లు వెల్లడించారు. దాంతో అభిమానులు తీవ్ర నిరాశకు లోనయ్యారు. కాగా, మ్యాచ్‌ను రద్దు చేస్తున్నట్లు ప్రకటించకముందే క్రికెటర్లలో చాలా మంది స్టేడియం నుంచి వెళ్లిపోయినట్లు అసోం క్రికెట్ అసోసియేషన్(ఏసీఏ) కార్యదర్శి దేవజీత్ స్పష్టం చేయడమే కాకుండా ఆశ్చర్యం వ్యక్తం చేశారు.(ఇక్కడ చదవండి: ఇది బీసీసీఐకే షేమ్..!)
‘భారత్-శ్రీలంక మధ్య ఆదివారం గువాహటిలో జరగాల్సిన మ్యాచ్‌కు సాయం త్రం 6.45 నుంచి గంటపాటు కురిసిన భారీ వర్షంతో మైదానం మొత్తం తడిసిపోగా..కవర్లు కప్పిఉంచినా పిచ్‌కూడా చిత్తడిగా మారింది. దాంతో 7.45 తర్వాత ఒకసారి, 9.30కు మరోసారి అంపైర్లు, మ్యాచ్ రెఫరీ డేవిడ్ బూన్ వికెట్‌ను పరిశీలించారు. అర్ధగంట సస్పెన్స్ తర్వాత అంటే రాత్రి 9.54కి మ్యాచ్ రద్దు చేస్తున్నట్టు ప్రకటించారు. అయితే మ్యాచ్‌ను రద్దు చేయడానికి అరగంట ముందే క్రికెటర్లలో చాలామంది స్టేడియం నుంచి వెళ్లిపోయారు.రాత్రి గం. 9.30 ని.లకు పిచ్ పరిశీలిస్తే, చాలామంది ఆటగాళ్లు 9 గంటలకే స్టేడియాన్ని వీడారు. మ్యాచ్ రద్దు కాకముందే ఆటగాళ్లు మైదానాన్ని వీడటం కొత్తగా అనిపించడమే కాకుండా మిస్టరీగా కూడా ఉంది.
అభిమానులు గొడవ చేయకుండా ఉండేందుకు అలా ప్రకటించారేమో. కానీ క్రికెటర్లు ముందుగానే వెళ్లిపోవడం మాత్రం నిజం’ అని సైకియా చెప్పాడు. రాత్రి గం,. 8.45 నిమిషాలకల్లా గ్రౌండ్‌ను సిద్ధం చేయకుంటే మ్యాచ్‌ను రద్దు చేయక తప్పదని గ్రౌండ్స్‌మెన్‌కు మ్యాచ్ అధికారులు స్పష్టంజేసినట్టు కూడా ఆయన వెల్లడించాడు. మైదానాన్ని సిద్ధం చేసేందుకు గ్రౌండ్స్‌మెన్‌కు 57 నిమిషాల సమయమే ఇచ్చారు. మరికొంత సమయం ఇచ్చుంటే మైదానాన్ని రెడీ చేసేవాళ్లం. రివర్స్ ఆస్మోసిస్ విధానం వల్ల పిచ్ చిత్తడిగా మారింది’ అని దేవ్‌జీత్ అన్నాడు. (ఇక్కడ చదవండి: టీ20 మ్యాచ్: గువాహటి.. యూ బ్యూటీ!)
Comments
Please login to add a commentAdd a comment