ఫిబ్రవరి 6 నుంచి దక్షిణాసియా క్రీడలు | South Asian Games to held from February 6-16 in Guwahati, Shillong | Sakshi
Sakshi News home page

ఫిబ్రవరి 6 నుంచి దక్షిణాసియా క్రీడలు

Published Mon, Oct 26 2015 2:21 AM | Last Updated on Sun, Sep 3 2017 11:28 AM

South Asian Games to held from February 6-16 in Guwahati, Shillong

గువహటి, షిల్లాంగ్ ఆతిథ్యం
గువహటి: దక్షిణాసియా క్రీడలు వచ్చే ఏడాది ఫిబ్రవరి 6 నుంచి 16 వరకు జరగనున్నాయి. గువహటి, షిల్లాంగ్ నగరాలు ఈ క్రీడలకు ఆతిథ్యమివ్వనున్నాయి. భారత్‌తో పాటు అఫ్ఘానిస్తాన్, బంగ్లాదేశ్, భుటాన్, మాల్దీవులు, నేపాల్, పాకిస్తాన్, శ్రీలంక దేశాలు ఇందులో పాల్గొంటాయి. మొత్తం 25 క్రీడాంశాల్లో పోటీలు జరుగుతాయని ఆదివారం జరిగిన సమావేశంలో అస్సాం ముఖ్యమంత్రి తరుణ్ గొగొయ్ తెలిపారు. అథ్లెట్లు, అధికారులతో కలిపి మొత్తం 4 వేల మంది ఈ పోటీలకు వస్తారన్నారు.

కేంద్ర ప్రభుత్వం, ఇతర భాగస్వాములతో కలిసి క్రీడలను అద్భుతంగా నిర్వహించేందుకు ప్రయత్నిస్తామన్నారు. 17 క్రీడాంశాలకు గుహవటి, 8 క్రీడాంశాలకు షిల్లాంగ్ వేదిక కానుంది. ఈసారి టెన్నిస్‌కు కూడా దక్షిణాసియా క్రీడల్లో స్థానం కల్పించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement