
తూర్పు, ఈశాన్య భారతంలో భూకంపం
న్యూఢిల్లీ: తూర్పు, ఈశాన్య భారతాన్ని భూప్రకంపనలు వణికించాయి. అరుణాచల్ ప్రదేశ్, మణిపూర్, నాగాలాండ్, త్రిపుర, అసోం, బిహార్, పశ్చిమబెంగాల్, పట్నా, కోల్కతాలోని పలు ప్రాంతాల్లో బుధవారం భూమి కంపించింది. భూమి ఒక్కసారిగా కంపించడంతో ప్రజలు భయంతో ఇళ్లు, కార్యాలయాల నుంచి బయటకు పరుగులు తీశారు. భూప్రకంపనలతో కోల్కతాలో మెట్రో సర్వీసులను తాత్కాలికంగా నిలిపివేశారు. అనంతరం సర్వీసులను పునరుద్దరించారు. మరోవైపు విశాఖపట్నంలోనూ భూమి కంపించింది. దీంతో జనాలు భయంతో పరుగులు తీశారు.
ఇక మయన్మార్లో పెను భూకంపం సంభవించింది. భూకంప తీవ్రత రిక్టర్ స్కేలుపై 6.8గా నమోదు అయింది. అయితే ప్రాణ, ఆస్తినష్టం గురించి ఎలాంటి సమాచారం లేదు. ఇందుకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.