
బస్సులో మంటలు చెలరేగడంతో డ్రైవర్ చాకచక్యంగా వ్యవహరించి 40 మంది ప్రయాణీకుల ప్రాణాలు కాపాడారు.
గువాహటి: అసోం రాజధాని గౌహతి శివార్లలో గురువారం రాత్రి 40 మంది ప్రయాణికులతో వెళుతున్న ప్రైవేట్ బస్సు మంటల్లో చిక్కుకుంది. అసోంలోని జోర్హాత్‌కు వెళుతున్న బస్సులో మంటలు చెలరేగడం గమనించిన డ్రైవర్ చాకచక్యంగా వ్యవహరించి బస్సును నిలిపివేసి ప్రయాణికులను అప్రమత్తం చేయడంతో వారు బయటకు పరుగులు తీశారు. ప్రయాణికులు దిగిన వెంటనే డ్రైవర్ కూడా వాహనం నుంచి కిందకు దూకడంతో పెనుప్రమాదం తప్పింది. ప్రమాద ఘటనపై స్ధానికులు సమాచారం అందించగా పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్ధలానికి చేరుకున్నారు. షార్ట్‌సర్య్కూట్ వల్లే బస్సులో మంటలు చెలరేగాయని పోలీసులు తెలిపారు.