గువాహటి: గువాహటి(అస్సాం)–న్యూజల్పాయ్‌గురి(పశ్చిమబెంగాల్) వందేభారత్ ఎక్స్‌ప్రెస్‌ను సోమవారం ప్రధాని మోదీ వర్చువల్‌గా జెండా ఊపి ప్రారంభించారు. ఈశాన్య రాష్ట్రాల్లోనే మొట్టమొదటి ఈ వందేభారత్ రైలుతో ఈ ప్రాంతంలో పర్యాటక రంగం అభివృద్ధి చెందుతుందని ప్రధాని ఈ సందర్భంగా పేర్కొన్నారు. ఈ వారంతో తొమ్మిదేళ్లు పూర్తి చేసుకున్న ఎన్‌డీఏ ప్రభుత్వంలో దేశం అభివృద్ధి దిశగా అద్భుతమైన ప్రయాణం సాగించిందన్నారు.
2014కు పూర్వం ఊహించని అనేక విజయాలను ప్రభుత్వం సాధించిందని తెలిపారు. గువాహటిలో ఈ రైలు ప్రారంభ కార్యక్రమంలో రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్, అస్సాం గవర్నర్ గులాబ్ చంద్ కటారియా, సీఎం హిమాంత బిశ్వ శర్మ పాల్గొన్నారు. గువాహటి– న్యూజల్పాయ్‌గురి మధ్య రైలు ప్రయాణ సమయం ప్రస్తుతమున్న 6.30 గంటల నుంచి వందేభారత్ ఎక్స్‌ప్రెస్ రాకతో 5.30 గంటలకు తగ్గనుంది.
Comments
Please login to add a commentAdd a comment