
అనారోగ్యంతో బాధపడుతున్న తల్లి, కుమారుడిని పరామర్శించేందుకు...
గువాహటి: తనను జైల్లోనే ఉంచేందుకు ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ కుట్రలు సాగిస్తున్నారని, ఈ విషయంలో జాతీయ దర్యాప్తు సంస్థ(ఎన్‌ఐఏ)పై ఒత్తిడి పెంచుతున్నారని అస్సాం స్వతంత్ర ఎమ్మెల్యే, రాయ్‌జోర్ దళ్ అధ్యక్షుడు అఖిల్ గొగోయ్ ఆరోపించారు. అనారోగ్యంతో బాధపడుతున్న తల్లి, కుమారుడిని పరామర్శించేందుకు అఖిల్‌కు ఎన్‌ఐఏ కోర్టు రెండు రోజుల పాటు పెరోల్ మంజూరు చేసింది. ఆయన శనివారం జోర్హాట్ జిల్లాలోని సలేన్‌ఘాట్ గ్రామంలో తన ఇంట్లో మీడియాతో మాట్లాడారు.
తనకు వ్యతిరేకంగా జరుగుతున్న కుట్రలన్నీ తెలుసని అన్నారు. ఉత్తరప్రదేశ్ తరహా రాజకీయాలు అస్సాంలో చేయొద్దని ముఖ్యమంత్రికి హితవు పలికారు. ప్రజాస్వామ్య నిబంధనలు పాటించాలని సూచించారు. సీఎం శర్మ నిజంగా ప్రజాస్వామ్య వ్యవస్థను నమ్మే నాయకుడే అయితే తాను ఎమ్మెల్యేగా ఎన్నిక కాగానే తన విడుదల కోసం కేబినెట్ నిర్ణయం తీసుకునేదన్నారు. పౌరసత్వ చట్ట సవరణకు వ్యతిరేకంగా ఉద్యమించిన అఖిల్ గొగోయ్‌ను 2019 డిసెంబర్ 12న జోర్హాట్‌లో పోలీసులు అరెస్టు చేశారు. అప్పటినుంచి జైల్లోనే ఉంటున్నారు. అఖిల్ జైల్లో నుంచి అసెంబ్లీ ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి, గెలుపొందారు.
చదవండి:
వైరల్: టూర్ బోటుతో 400 డాల్ఫిన్ల పోటీ.. 95 మిలియన్ల వ్యూస్!
మిషన్ 2022పై కమలదళం కసరత్తు