బస్సు లోయలో పడి ఆరుగురు మృతి | Six dies after Bus falls into ditch in Assam | Sakshi
Sakshi News home page

బస్సు లోయలో పడి ఆరుగురు మృతి

Published Tue, Feb 4 2020 4:50 PM | Last Updated on Tue, Feb 4 2020 4:52 PM

Six dies after Bus falls into ditch in Assam - Sakshi

గువాహటి : అసోంలో మంగళవారం ఘోర రోడ్డుప్రమాదం జరిగింది. గోల్‌పారా జిల్లాలోని రాంగ్‌జూలీ సమీపంలో బస్సు అదుపుతప్పి లోయలో పడిపోయింది. ఈ ప్రమాదంలో ఆరుగురు ప్రయాణికులు ప్రాణాలు కోల్పోగా, మరో 30 మంది తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రుల్లో కొందరి పరిస్థితి విషమంగా ఉంది. దుబ్రి నుంచి గువాహటి వెళ్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ప్రమాదస్థలికి చేరుకున్న పోలీసులు సహాయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం సమీప ఆస్పత్రికి తరలించారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement