IND VS SA: Rohit Sharma And Co Reaches Guwahati - Sakshi
Sakshi News home page

IND vs SA: దక్షిణాఫ్రికాతో రెండో టీ20.. గౌహతికి చేరుకున్న టీమిండియా

Published Fri, Sep 30 2022 2:00 PM | Last Updated on Fri, Sep 30 2022 3:33 PM

IND vs SA: Rohit Sharma And Co reaches Guwahati - Sakshi

దక్షిణాఫ్రికాతో తొలి టీ20లో ఘన విజయం సాధించిన టీమిండియా.. ఇప్పుడు రెండో టీ20లో ఆడేందుకు సిద్దమైంది. భారత్‌, ప్రోటీస్‌ జట్ల మధ్య రెండో టీ20 గౌహతి వేదికగా ఆదివారం(ఆక్టోబర్‌ 2)న జరగనుంది. ఈ క్రమంలో ఇరు జట్ల ఆటగాళ్లు గురువారం గౌహతిలో అడుగుపెట్టారు.

తొలి టీ20 జరిగిన తిరువనంతపురం నుంచి నేరుగా గౌహతికి ఇరు జట్ల ఆటగాళ్లు చేరుకున్నారు. గౌహతి ఎయిర్‌ పోర్ట్‌ నుంచి బయటకు వస్తున్న భారత ఆటగాళ్ల ఫోటోలు, వీడియోలు ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి. మరోవైపు క్రికెట్‌ సౌతాఫ్రికా కూడా గౌహతికి చేరిన తమ జట్టు ఆటగాళ్ల ఫోటోలను ట్విటర్‌లో షేర్‌ చేసింది.

ఇక భారత జట్టు శుక్రవారం బర్సపరా స్టేడియంలో ప్రాక్టీస్‌ సెషన్‌లో పాల్గోనుంది. మరోవైపు టీమిండియా స్టార్‌ పేసర్‌ జస్ప్రీత్‌ బుమ్రా వెన్ను నొప్పి కారణంగా ఈ సిరీస్‌లో మిగిలిన రెండు మ్యాచ్‌లకు దూరమయ్యాడు. బుమ్రా ప్రస్తుతం బెంగళూరులోని నేషనల్‌ క్రికెట్‌ ఆకాడిమీలో ఉన్నాడు. దీంతో బుమ్రా స్దానంలో మహ్మద్‌ సిరాజ్‌ భారత జట్టుతో చేరనున్నాడు.


చదవండి: 'అతడికి టీ20ల్లో కూడా రాణించే సత్తా ఉంది.. అవకాశం ఇవ్వండి'

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement