
గువాహటి: హోరాహోరీగా సాగిన మ్యాచ్‌లో కీలకదశలో పాయింట్లు గెలిచిన దొడ్డవరపు అచ్యుతాదిత్య రావు–వెంకట హర్షవర్ధన్ (భారత్) జోడీ... గువాహటి ఓపెన్ మాస్టర్స్ వరల్డ్ టూర్ సూపర్–100 బ్యాడ్మింటన్ టోరీ్నలో క్వార్టర్ ఫైనల్లోకి దూసుకెళ్లింది.
గురువారం జరిగిన పురుషుల డబుల్స్ ప్రిక్వార్టర్ ఫైనల్లో తెలంగాణకు చెందిన అచ్యుతాదిత్య, ఆంధ్రప్రదేశ్‌కు చెందిన హర్షవర్ధన్ ద్వయం 24–22, 23–21తో నాలుగో సీడ్ వె చున్ వె–వు గువాన్ జున్ (చైనీస్ తైపీ) జంటను బోల్తా కొట్టించింది.
మహిళల సింగిల్స్ ప్రిక్వార్టర్ ఫైనల్లో హైదరాబాద్ అమ్మాయి సామియా 15–21, 21–18, 13–21తో రెండో సీడ్ వెన్ చి సు (చైనీస్ తైపీ) చేతిలో పోరాడి ఓడిపోయింది. మిక్స్‌డ్ డబుల్స్ ప్రిక్వార్టర్ ఫైనల్లో సిక్కి రెడ్డి–సుమీత్ రెడ్డి (భారత్) జోడీ 21–13, 19–21, 17–21తో చూంగ్ హోన్ జియాన్–గో పె కీ (మలేసియా) జంట చేతిలో పరాజయం పాలైంది.
Comments
Please login to add a commentAdd a comment