గువహటి: ఈశాన్య రాష్ట్రమైన అసోంలో ఘోర రోడ్డు ప్రమాద ఘటన చోటుచేసుకుంది. ఎదురుగా వస్తున్న వ్యాన్‌ను కారు ఢీకొన్న ఘటనలో ఏడుగురు విద్యార్థులు అక్కడికక్కడే మృతిచెందారు. ఈ ప్రమాదంలో మరో ఆరుగురు తీవ్రంగా గాయపడ్డారు.
వివరాల ప్రకారం.. గువాహటిలోని జలూక్‌బరీ ప్రాంతంలో ఓ కారు(01 GC 8829) ఎదురుగా వస్తున్న వ్యాన్‌ను ఢీకొట్టింది. ఈ ఘటనలో ఏడుగురు విద్యార్థులు అక్కడికికక్కడే మృతిచెందగా.. మరో ఆరుగురికి గాయాలయ్యాయి. వీరంతా గువాహటిలోని ఓ ఇంజినీరింగ్ కళాశాలలో చదువుతున్నట్లు తెలిసింది. క్షతగాత్రులను సమీపంలోని జీఎంసీహెచ్ ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని పరిశీలించారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. ఈ ప్రమాదానికి అతివేగమే కారణంగా తెలుస్తోంది. కారు.. వ్యాన్‌ను ఢీకొనే ముందు డివైడర్‌ను ఢీకొట్టినట్టు పోలీసులు గుర్తించారు.
ఈ ప్రమాదంలో మృతిచెందిన వారు..
- అరిందమ్ భల్లాల్
- నియోర్ దేకా
- కౌశిక్ మోహన్
- ఉపాంగ్షు శర్మ
- రాజ్‌కిరణ్ భుయాన్
- ఎమోన్ గయాన్
- కౌశిక్ బారుహ్
తీవ్రంగా గాయపడిన వారు..
- అర్పాన్ భుయాన్
- అర్నాబ్ చక్రవర్తి బొంగైగావ్
- మృన్మోయ్ బోరా.
ఇది కూడా చదవండి: ప్రకాశం జిల్లాలో తీవ్ర విషాదం..
Comments
Please login to add a commentAdd a comment