గువహటి: అసోం రాజధాని గువహటిలో ఓ చిరుత బావిలో పడిపోయింది. అటవీ ప్రాంతం నుంచి నివాస ప్రాంతాల్లోకి వచ్చిన చిరుతపులి స్థానిక గోకుల్ నగర్‌లోని సూమారు 30 అడుగుల లోతు ఉన్న బావిలో పడిపోయింది. బావిలో పడిన చిరుత అరుపులు విని స్థానికులు అటవీ శాఖ అధికారులకు సమాచారం అందించారు. చిరుతను బయటకు తీసుకొచ్చేందుకు అధికారులు సుమారు రెండు గంటల పాటు కష్టపడ్డారు.
బావిలో పడిన చిరుతను చూడటానికి స్థానికులు భారీగా గుమిగూడారు. రెస్క్యూ అనంతరం చిరుతను అధికారులు రాష్ట్ర జంతు సంరక్షణ కేంద్రానికి తరలించి వైద్య పరీక్షలు నిర్వహించారు. కాగా, ఇటీవల చిరుతలు జనావాసాల్లోకి ఎక్కువగా వస్తున్నాయని స్థానికులు తెలిపారు. ఈ నెలలోనే నివాస ప్రాంతాల్లోకి వచ్చిన చిరుత ఓ మహిళపై దాడి చేసిందని తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment