![దిగబడిన విమానం.. ప్రయాణీకులు సేఫ్](/styles/webp/s3/article_images/2017/09/19/81505277130_625x300.jpg.webp?itok=kw0A1rmk)
దిగబడిన విమానం.. ప్రయాణీకులు సేఫ్
గువాహటి : ఓ జెట్ లైట్ విమానం తృటిలో ప్రమాదం నుంచి బయటపడింది. గువాహటి నుంచి జోర్హాట్‌కు బయలుదేరిన విమానం ల్యాండ్ అవుతుండగా ట్యాక్సీ వేలోకి దూసుకెళ్లి దిగబడిపోయింది. ఆ సమయంలో విమానంలో 90 మంది ప్రయాణీకులు ఉన్నారు. జెట్ ఎయిర్‌వేస్ తెలిపిన వివరాల ప్రకారం బెంగళూరుకు చెందిన ఈ విమానం గువాహటి గుండా జోర్హాట్‌కు వెళ్లింది. తిరిగి అక్కడి నుంచి ఢిల్లీకి బయల్దేరాల్సి ఉండగా సరిగ్గా ల్యాండ్ అయ్యే సమయంలో ఈ ఘటన జరిగింది.
విమానంలోని ఒక వీల్ కాస్త మట్టిలోకి దిగిపోవడంతో అక్కడే విమానం ఆపేసి ప్రయాణీకులను సురక్షితంగా తరలించారు. ప్రయాణీకులు అంతా సురక్షితమే అంటూ జెట్ ఎయిర్‌వేస్ ట్వీట్ చేయగా దీనికి స్పందించిన కాంగ్రెస్ నేత గౌరవ్ గొగోయ్ ఈ వ్యవహారాన్ని పౌర విమానయాన శాఖ సహాయమంత్రి జయంత్ సిన్హా పరిశీలించాలని కోరారు. ఇందుకు స్పందించిన ఆయన ఈ ఘటనను జాగ్రత్తగా దర్యాప్తు చేయిస్తామని హామీ ఇచ్చారు.