సారీ బ్రో .. ఇట్స్‌ వెరీ బ్యాడ్‌ ! | warner say sorry to on twitter because of his spelling mistake on guwahati | Sakshi
Sakshi News home page

సారీ బ్రో .. ఇట్స్‌ వెరీ బ్యాడ్‌ ! : వార్నర్‌

Published Tue, Oct 10 2017 1:59 PM | Last Updated on Tue, Oct 10 2017 4:46 PM

 warner say sorry to on twitter because of his spelling mistake on guwahati

సాక్షి : భారత్‌ , ఆస్ట్రేలియా జట్ల మధ్య రెండో టి20 మ్యాచ్‌ ఈ రోజు(మంగళవారం) గువాహటిలో జరగనుంది. ఈ సందర్భంగా ఆస్ట్రేలియా ఆటగాడు డేవిడ్‌ వార్నర్‌ తన ట్విట్టర్‌లో వెల్‌కమ్‌ టు గుహవాటి అని పోస్టు చేశాడు. దీనిని గమనించిన ఆశిశ్‌ ప్రతాప్‌ సింగ్‌ అనే అతను  గుహవాటి కాదు బ్రదర్‌.. అది గువాహటి అని రీ ట్విట్‌ చేశాడు.

తన తప్పు సరిదిద్దుకున్నా వార్నర్‌..  సారీ బ్రో .. నా స్పెల్లింగ్‌ వెరీ బ్యాడ్‌ అని ట్విట్‌ చేశాడు. గువాహటిలో కొత్తగా నిర్మించిన బర్సపర స్టేడియంలో ఇదే తొలి అంతర్జాతీయ మ్యాచ్‌. గతంలో ఇక్కడి నెహ్రూ స్టేడియం 16 వన్డేలకు అతిథ్యం ఇచ్చింది. ఇందులో ఇండియా 14 గెలవగా, రెండు మ్యాచ్‌లు వర్షం కారణంగా రద్దయ్యాయి. మరో 38 పరుగులు విరాట్‌ కోహ్లీ చేస్తే అంతర్జాతీయ టీ20లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాళ్ల జాబితాలో రెండో స్థానంలో నిలుస్తాడు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement