బాలికపై మైనర్ బాలుర సామూహిక అత్యాచారం
గౌహతి రాష్ట్రంలో ఓ మైనర్ బాలికపై ఐదుగురు మైనర్ బాలురు సామూహిక అత్యాచారం జరిపిన సంఘటన చాలా అలస్యంగా వెలుగులోకి వచ్చింది. రాష్ట్రంలోని హటిగన్ ప్రాంతంలో ఆదివారం రాత్రి 12 ఏళ్ల చిన్నారిపై ఆమె నివాసంలో తోటి వయస్సు గల ఐదుగురు బాలురు సామూహిక అత్యాచారం జరిపారని పోలీసు ఉన్నతాధికారి మంగళవారం వెల్లడించారు. కాగా ఆ ఐదుగురు బాలురిని అరెస్ట్ చేసినట్లు చెప్పారు. వారిని బుధవారం జువైనల్ కోర్టులో ప్రవేశపెడతామన్నారు.
ఆ బాలిక తల్లి దినసరి కూలీ చేసుకుని జీవనం సాగిస్తారని, ఆమె పనికి వెళ్లగా ఆ బాలికపై తోటి స్నేహితులు అత్యాచారం చేశారని పోలీసులు వివరించారు. పని నుంచి ఇంటికి తిరిగి వచ్చిన తల్లికి ఆ బాలిక జరిగిన విషయాన్ని తెలిపింది. దాంతో తల్లి వశిష్ట పోలీసులను ఆశ్రయించింది. దాంతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ఐదుగురు బాలురిని పోలీసులు అదుపులోకి తీసుకుని స్టేషన్కు తరలించినట్లు చెప్పారు. కాగా అత్యాచారానికి గురైన బాలికను ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి వైద్య పరీక్షలు నిర్వహించామని చెప్పారు. అనంతరం స్టేట్ హోంకు తరలించినట్లు తెలిపారు.