Juvenile Court
-
అమ్నీషియా పబ్ కేసులో నలుగురికి బెయిల్
సాక్షి, హైదరాబాద్: దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన జూబ్లీహిల్స్ మైనర్ సామూహిక అత్యాచార కేసులో అనూహ్య పరిణామం చోటు చేసుకుంది. సుమారు 48 రోజుల తర్వాత.. అమ్నీషియా పబ్ కేసులో నలుగురు మైనర్లకు బెయిల్ మంజూరు చేసింది జువైనల్ జస్టిస్ బోర్డు. జూబ్లీ హిల్స్ గ్యాంగ్ రేప్ కేసులో నలుగురు మైనర్లకు మంగళవారం బెయిల్ మంజూరు చేసింది జువైనల్ జస్టిస్ బోర్డు. ఇదిలా ఉంటే.. మైనర్ల బెయిల్ పిటిషన్లను రెండుసార్లు తిరస్కరించింది జువైనల్ బోర్డు. అయితే.. ఈసారి మాత్రం షరతులతో బెయిల్ మంజూరు చేసింది. ఒక్కో మైనర్‌ను రూ. 5 వేల పూచీకత్తుపై బెయిల్ ఇస్తున్నట్లు తెలిపింది. అంతేకాదు కేసులో విచారణకు సహకరించాలని, హైదరాబాద్ డీపీవో ముందు ప్రతి నెల హాజరు కావాలని జువైనల్ జస్టిస్ బోర్డు ఆదేశించింది. ఎమ్మెల్యే కొడుకు ఇంకా.. అయితే ఈ కేసులో A1గా ఉన్న సాదుద్ధీన్ మాలిక్‌కు మాత్రం బెయిల్ విషయంలో నిరాశే ఎదురైంది. ఇక ఈ కేసులో మరో మైనర్ అయిన ఎమ్మెల్యే కొడుక్కి ఇంకా బెయిల్ దొరకలేదు. మొదట జువెనైల్ బోర్డు బెయిల్‌కు నిరాకరించడంతో.. హైకోర్టులో బెయిల్ కోసం అప్పీల్ చేసుకున్నాడు. అయితే.. అది ఇంకా పెండింగ్‌లో ఉండడంతో.. ఇంకా జువైనల్ హోంలోనే ఉండాల్సి వచ్చింది. -
మైనర్ రేప్ కేసులో ఏడుగంటల్లోనే తీర్పు
ఉజ్జయిని(మధ్యప్రదేశ్): మైనర్ బాలికను 14 ఏళ్ల పిల్లాడు రేప్ చేసిన కేసులో ఉజ్జయినిలోని జువైనల్ కోర్టు రికార్డుస్థాయిలో కేవలం ఏడుగంటల్లో తుది తీర్పు వెలువరించింది. నిందితుడిని దోషి గా తేల్చి అతనికి రెండేళ్ల శిక్ష విధిస్తూ తీర్పు చెప్పింది. ఆగస్టు 15న రేప్ ఘటన చోటుచేసుకోగా కేసు నమోదు, దర్యాప్తు, నిందితుడి అరె స్టు, హాజరు, జువైనల్ కోర్టులో కేసు వాదోపవాదనలు ఇలా మొత్తం ప్రక్రియ అంతా కేవలం ఐదు రోజుల్లో పూర్తి అయ్యింది. కేసు డైరీని సోమవారం ఉదయం గం.10.45కు జువైనల్ జస్టిస్ బోర్డు న్యాయమూర్తి తృప్తి పాండే ముం దు పోలీసులు సమర్పించగా సాయంత్రం ఆరుకల్లా తుది తీర్పు చెప్పేశారని ప్రభుత్వ న్యాయ వాది దీపేంద్ర మలూ మంగళవారం మీడియాకు చెప్పారు. సివనీ జిల్లాలోని ఘటియా గ్రామంలో మైనర్‌బాలుడి ఇంట్లో ఆడుకుంటున్న బాలికను ఆ పిల్లాడు రేప్ చేసి పారిపోయి రాజస్తాన్‌లోని బంధువుల ఇంట్లో దాక్కున్నాడు. రేప్ విషయం తెల్సి బాలిక తల్లిదండ్రులు ఇచ్చిన ఫిర్యాదుతో ఉజ్జయిని ఎస్పీ సచిన్ అతుల్కర్ నేతృత్వంలోని బృందం ఆ పిల్లాడిని అరెస్టుచేశారు. -
బాలికపై మైనర్ బాలుర సామూహిక అత్యాచారం
గౌహతి రాష్ట్రంలో ఓ మైనర్ బాలికపై ఐదుగురు మైనర్ బాలురు సామూహిక అత్యాచారం జరిపిన సంఘటన చాలా అలస్యంగా వెలుగులోకి వచ్చింది. రాష్ట్రంలోని హటిగన్ ప్రాంతంలో ఆదివారం రాత్రి 12 ఏళ్ల చిన్నారిపై ఆమె నివాసంలో తోటి వయస్సు గల ఐదుగురు బాలురు సామూహిక అత్యాచారం జరిపారని పోలీసు ఉన్నతాధికారి మంగళవారం వెల్లడించారు. కాగా ఆ ఐదుగురు బాలురిని అరెస్ట్ చేసినట్లు చెప్పారు. వారిని బుధవారం జువైనల్ కోర్టులో ప్రవేశపెడతామన్నారు. ఆ బాలిక తల్లి దినసరి కూలీ చేసుకుని జీవనం సాగిస్తారని, ఆమె పనికి వెళ్లగా ఆ బాలికపై తోటి స్నేహితులు అత్యాచారం చేశారని పోలీసులు వివరించారు. పని నుంచి ఇంటికి తిరిగి వచ్చిన తల్లికి ఆ బాలిక జరిగిన విషయాన్ని తెలిపింది. దాంతో తల్లి వశిష్ట పోలీసులను ఆశ్రయించింది. దాంతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ఐదుగురు బాలురిని పోలీసులు అదుపులోకి తీసుకుని స్టేషన్‌కు తరలించినట్లు చెప్పారు. కాగా అత్యాచారానికి గురైన బాలికను ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి వైద్య పరీక్షలు నిర్వహించామని చెప్పారు. అనంతరం స్టేట్ హోంకు తరలించినట్లు తెలిపారు.