అతివేగంగా వెళ్తున్న వాహనం అదుపుతప్పి లోయలో పడిన ఘటనలో ఆరుగురు మృతిచెందారు. ఈ సంఘటన అసోంలోని జాలుక్‌బరీలో సోమవారం చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో కారు డ్రైవర్‌తో పాటు అందులో ఉన్న ఆరుగురు ప్రయాణికులు అక్కడికక్కడే మృతిచెందారు. మృతుల్లో ఇద్దరు చిన్నారులు ఉన్నారు. గోలపరా నుంచి గువాహటి వెళ్తున్న సమయంలో ఈ ప్రమాదం జరిగింది. విషయం తెలుసుకున్న పోలీసులు, అధికారులు అక్కడికి చేరుకొని సహాయక చర్యలు చేపడుతున్నారు.