గువాహతి: బ్రహ్మపుత్ర, బరాక్ నదులు పొంగిపొర్లుతుండటంతో అస్సాంలో వరద ఉధృతి కొనసాగుతోంది. గత 24 గంటల్లో సంభవించిన మరో పది మరణాలతో కలిపి మొత్తం మృతుల సంఖ్య 118కి చేరుకుందని అధికారులు తెలిపారు.
అస్సాంలో వరద బీభత్సం ఇంకా కొనసాగుతూనే ఉంది. వందేళ్లలో ఈ ప్రాంతంలో ఇంత దారుణమైన పరిస్థితులు ఇదే ప్రథమంగా కనిపిస్తున్నాయి. చాలా ప్రాంతాల్లో మనుషులు మునిగిపోయేంత మేర వరద నీరు ఇంకా పేరుకుపోయే ఉంది. వరద ప్రభావం తీవ్రంగా ఉన్న చచార్ జిల్లాలోని సిల్చార్ చాలా భాగం వరద నీటిలోనే ఉంది.
బాధితుల కోసం ఐఏఎఫ్, ఎన్‌డీఆర్‌ఎఫ్ బృందాలు ఆహార పొట్లాలు, మంచినీటి ప్యాకెట్లు అందజేస్తున్నాయి. రెండు కంపెనీల సీఆర్‌పీఎఫ్ బలగాలను కూడా రంగంలోకి దించారని అధికారులు తెలిపారు. సిల్చార్‌లో 3 లక్షల మంది నీరు, ఆహారం, అవసరమైన మందుల కొరతతో ఇబ్బందులు పడుతున్నారు.
#AidToCivilAdministration
— Indian Air Force (@IAF_MCC) June 24, 2022
In response to extensive floods in Assam & Meghalaya,#IAF heptr & transport aircraft have been deployed across the region to deliver relief material & provide succour to the locals. During the floods, 13 tons of relief material has been airlifted so far. pic.twitter.com/ylOgSOTGsz
Comments
Please login to add a commentAdd a comment