assam floods
-
అసోంలో భారీ వర్షాలు.. 11 జిల్లాలను ముంచెత్తిన వరదలు..
వర్షాకాలం పూర్తిగా మొదలు కాకముందే అసోం రాష్ట్రాన్ని భారీ వర్షాలు వణికిస్తున్నాయి. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలు 11 జిల్లాలను ముంచెత్తాయి. దీని కారణంగా 34 వేల మంది ప్రభావితులయ్యారు. నదులు పొంగి ప్రవహిస్తుండటంతో అసోంలో ఈ ఏడాది తొలి వరదలు నమోదయ్యాయి. అసోం స్టేట్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీ(ASDMA) ప్రకారం బ్రహ్మపుత్రతోపాటు పలు నదులు నీటిమట్టం పెరుగుతుండటంతో వరద నీరు వందలాది గ్రామాలను ముంచెత్తింది. అయితే ఏ నది ప్రమాదకర స్థాయికి మించి ప్రవహించడం లేదని పేర్కొంది. అసోం అంతటా 209.67 హెక్టార్ల పంట ప్రాంతాలు దెబ్బతిన్నాయని తెలిపింది. వరదల వల్ల బిశ్వనాథ్, దర్రాంగ్, ధేమాజీ, దిబ్రూగఢ్, లఖింపూర్, తముల్పూర్, ఉదల్గురి జిల్లాలు ప్రభావితమయ్యాయయని.. 34 వేలమందిని సురక్షిత ప్రాంతాలకు తరలించినట్లు అధికారులు తెలిపారు. వీరిలో 4, 675 మంది మహిళలు, 3,787 మంది చిన్నారులు ఉన్నట్లు పేర్కొన్నారు. చదవండి: బీజేపీ శవపేటికకు చివరి మేకు అదే..కేంద్రానికి స్టాలిన్ హెచ్చరికలు.. లఖింపూర్‌లో అత్యధికంగా 23,516 మంది ప్రభావితమయ్యారు, దిబ్రూగర్‌లో 3,857 మంది, దర్రాంగ్‌లో 2231 మంది, బిశ్వనాథ్‌లో 2231 మంది, ధేమాజీలో 1,085 మంది ఉన్నారు. వరదల బారిన పడిన లఖింపూర్‌లో ఎనిమిది, ఉదల్గురిలో రెండు మొత్తం 11 సహాయ పంపిణీ కేంద్రాలను ఏర్పాటు చేశారు. మొత్తంగా 77 గ్రామాలు వరదల వల్ల ప్రభావితమయ్యాయి. లఖింపూర్, ఉదల్గురిలో రెండు చొప్పున నాలుగు చెరువుల కట్టలు తెగిపోయాయి. బిస్వనాథ్, బొంగైగావ్, దిబ్రూఘర్, గోలాఘాట్, జోర్హాట్, కర్బీ అంగ్లాంగ్ వెస్ట్, లఖింపూర్, మోరిగావ్, నల్బరీ, సోనిత్పూర్, తముల్పూర్ ఉదల్గురి జిల్లాల్లో రోడ్లు భారీ కోతకు గురయ్యాయని ఏఎస్డీఎమ్ఏ తెలిపింది. భారీ వర్షాల కారణంగా దిమా హసావో కమ్రూప్ జిల్లాల్లోని కొన్ని ప్రాంతాలలో కూడా కొండచరియలు విరిగిపడినట్లు పేర్కొంది. కాగా భారతదేశంలో ఎక్కువగా వరదలకు గురయ్యే రాష్ట్రాల్లో అస్సాం ఒకటి. ఈ రాష్ట్రానికి వరద సమస్య వార్షిక విపత్తుగా మారింది. అత్యధిక జనాభా కలిగిన ఈ ఈశాన్య రాష్ట్ర ప్రజలు భారీ వర్షాలు, వరదలతో ప్రతి వర్షాకాలం ప్రభావితం అవుతుంటారు. వేలాది మంది ప్రజలను నిరాశ్రయులవుతారు. అనేక జంతువులు ప్రాణాలు కోల్పోతాయి. కోట్లాది రూపాయల ఖరీదైన పంటలకు తీవ్ర నష్టం తెచ్చిపెడుతోంది. ఇక ఆస్తి నష్టం కూడా అదే రేంజ్లో వాటిల్లుతోంది. 34,000 people affected as #AssamFlood worsens and incessant rain continues Total 34,189 people, comprising 14, 675 women & 3,787 children reeling under the impact of the deluge#Assam #Flood #AssamRain #FloodUpdate #AssamFloods #Guwahati #GuwahatiFlood pic.twitter.com/oOKd4cg2L1 — Ritam English (@EnglishRitam) June 17, 2023 -
Assam Floods 2022: స్త్రీ శక్తి: సలాం... రైఫిల్ ఉమెన్
అస్సాంలోని కొన్ని జిల్లాలు వరదల బారిన పడి చిగురుటాకులా వణికిపోయాయి. ‘ఎప్పుడైనా, ఎక్కడైనా’ అన్నట్లుగా ఉంది మృత్యువు రాకడ. అలాంటి సమయంలో ‘రైఫిల్ ఉమెన్’ రంగంలోకి దిగింది. ఎంతోమందిని రక్షించింది... చిరునవ్వుతో పలకరించిన నేస్తంలా మురిపించిన చినుకులు, సమయం గడిచేకొద్దీ మృత్యుపాశాలుగా మారుతున్నాయి. కుండపోత వర్షం. కపిలి, బేకి, బరక్, ఖుషి నదులు ఉగ్రరూపం దాల్చుతున్నాయి. అస్సాంలో ఎన్నో జిల్లాలు వరదల బారిన పడ్డాయి. ముఖ్యంగా కచర్ జిల్లా వరదల దెబ్బతో అల్లకల్లోలమైంది. ఆ కల్లోలంలో ‘బతికి ఉంటే బలుసాకు తిని బతకవచ్చు’ అనే బతుకు ఆశ తప్ప‘మన గురించి కాదు ఇతరుల గురించి ఆలోచించాలి’ అనే ఆలోచన రాని సమయం అది. అలాంటి కఠిన సమయంలో ‘మేము ఉన్నాం’ అంటూ ముందుకు వచ్చారు వారు. వాగు దాటి అవతలి ప్రాంతానికి వెళదామని ప్రయత్నించి ఒకాయన వరదల్లో పడి కొట్టుకుపోతున్నాడు. ఎక్కడో ఒకచోట విరిగిపడిన కొమ్మలు, చెట్ల మధ్య ఇరుక్కుపోయాడు. వరద ఎక్కువైతే, ఆలస్యం అయితే అతని చిరునామా కూడా తెలిసేది కాదు. విషయం తెలిసిన మహిళల బృందం రంగంలోకి దిగింది. అతడిని రక్షించింది. ఒక వృద్ధురాలిని వరద చుట్టుముట్టింది. దాని నుంచి బయటపడే శక్తి ఆమెకు లేదు. ఆ వృద్ధురాలిని పట్టించుకోకుండా ఎవరి దారి వారు చూసుకుంటున్నారు. ఈలోపు అక్కడికి పరుగెత్తుకు వచ్చిన ఒక యువతి ఆ వృద్ధురాలిని రెండు చేతులతో ఎత్తుకొని సురక్షిత ప్రాంతానికి చేర్చింది. కొన్ని ఇండ్లను పూర్తిగా వరద నీళ్లు చుట్టుముట్టాయి. బయటికి రాలేని పరిస్థితి. అలా అని ఇంట్లో ఉండలేని పరిస్థితి. అవి పాత ఇండ్లు. వర్షంతో గోడలు నానిపోయి ఉన్నాయి. ఏ నిమిషంలో ఇండ్లు కూలిపోతాయో తెలియదు. అలాంటి ఇండ్లలో నుంచి వృద్ధులు మొదలు పసిపిల్లల వరకు బయటికి తీసుకువచ్చి వారి ప్రాణాలు రక్షించారు వారు. ‘రెండు చేతులెత్తి మొక్కడం తప్ప వారి రుణం ఎలా తీర్చుకోగలం’ అని కళ్లనీళ్లపర్యంతం అయింది ఒక గృహిణి. ఇంతకీ వారు ఎవరు? ‘రైఫిల్ ఉమెన్’ బృందాలు. ‘రైఫిల్ ఉమెన్’ బృందాలకు అస్సాంలో మంచిపేరు ఉంది. అస్సాం రైఫిల్స్‌లో భాగమైన రైఫిల్ ఉమెన్ బృందాలు ప్రాణాలను పణంగా పెట్టి సాహసాలు, సహాయ కార్యక్రమాలు చేయడంలో పేరు తెచ్చుకున్నాయి. ‘ఆ వృద్ధురాలిని రక్షించిన తరువాత ఆమె కళ్లలో కనిపించిన కృతజ్ఞతాభావాన్ని ఎప్పుడూ మరచిపోలేను. నిండు మనసుతో నన్ను ఆశీర్వదించింది. రైఫిల్ ఉమెన్ బృందంలో పనిచేస్తున్నందుకు నిజంగా గర్వపడుతున్నాను’ అంటుంది 22 సంవత్సరాల మంతిదాస్. అస్సాంలోని దుర్బీ ప్రాంతానికి చెందిన మంతిదాస్ సైన్యంలో చేరడం వారి ఇంట్లో వాళ్లకు బొత్తిగా ఇష్టం లేదు. ‘శిక్షణ సమయంలో చాలా కష్టంగా అనిపించింది. రోజూ ఉదయం 22 కేజీల బరువు పట్టుకుని 25 కిలోమీటర్ల దూరం పరుగెత్తాల్సి వచ్చేది. ఇంకా ఇలాంటివి ఎన్నో ఉండేవి. ఒకానొక సమయంలో అయితే ఇక నావల్ల కాదేమో అనుకున్నాను. కాని ఇప్పుడు ఆలోచిస్తే ఆ శిక్షణలోని గొప్పదనం ఏమిటో తెలుస్తుంది. ఆ శిక్షణ వల్లే సహాయకార్యక్రమాల్లో చురుగ్గా, ధైర్యంగా పాల్గోగలిగాను’ అంటుంది మంతిదాస్. ‘తమ పిల్లలను సైన్యంలోకి పంపడానికి తల్లిదండ్రులు భయపడుతుంటారు. మా తల్లిదండ్రులు మాత్రం నన్ను బాగా ప్రోత్సహించారు. ఈ విషయంలో నేను అదృష్టవంతురాలిని. సహాయకార్యక్రమాల్లో మేము పాల్గొన్న ఫోటోలను పేపర్లో చూసి మా తల్లిదండ్రులు ఎంతో గర్వపడ్డారు’ అంటుంది యతిర్. మంతిదాస్, యతిర్‌లు మాత్రమే కాదు ‘రైఫిల్ వుమెన్’ బృందాలలోని ఎంతోమంది మహిళా సైనికులు అసాధారణమైన సాహసాలు ప్రదర్శించారు. ఆపదలో ఉన్నవారిని ఆదుకున్నారు. జనం చేత నీరాజనాలు అందుకున్నారు. -
Assam Floods: తగ్గని వరద.. ఒక్కరోజులోనే పది మంది మృతి
గువాహతి: బ్రహ్మపుత్ర, బరాక్ నదులు పొంగిపొర్లుతుండటంతో అస్సాంలో వరద ఉధృతి కొనసాగుతోంది. గత 24 గంటల్లో సంభవించిన మరో పది మరణాలతో కలిపి మొత్తం మృతుల సంఖ్య 118కి చేరుకుందని అధికారులు తెలిపారు. అస్సాంలో వరద బీభత్సం ఇంకా కొనసాగుతూనే ఉంది. వందేళ్లలో ఈ ప్రాంతంలో ఇంత దారుణమైన పరిస్థితులు ఇదే ప్రథమంగా కనిపిస్తున్నాయి. చాలా ప్రాంతాల్లో మనుషులు మునిగిపోయేంత మేర వరద నీరు ఇంకా పేరుకుపోయే ఉంది. వరద ప్రభావం తీవ్రంగా ఉన్న చచార్ జిల్లాలోని సిల్చార్ చాలా భాగం వరద నీటిలోనే ఉంది. బాధితుల కోసం ఐఏఎఫ్, ఎన్డీఆర్ఎఫ్ బృందాలు ఆహార పొట్లాలు, మంచినీటి ప్యాకెట్లు అందజేస్తున్నాయి. రెండు కంపెనీల సీఆర్పీఎఫ్ బలగాలను కూడా రంగంలోకి దించారని అధికారులు తెలిపారు. సిల్చార్‌లో 3 లక్షల మంది నీరు, ఆహారం, అవసరమైన మందుల కొరతతో ఇబ్బందులు పడుతున్నారు. #AidToCivilAdministration In response to extensive floods in Assam & Meghalaya,#IAF heptr & transport aircraft have been deployed across the region to deliver relief material & provide succour to the locals. During the floods, 13 tons of relief material has been airlifted so far. pic.twitter.com/ylOgSOTGsz — Indian Air Force (@IAF_MCC) June 24, 2022 -
నిజంగానే మట్టిలో మాణిక్యం మన కీర్తి జల్లి
దిస్పూర్: సాధారణంగా ఐఏఎస్ ఆఫీసర్ అంటే ఏమనుకుంటాం..పైనుండి ప్రభుత్వ విధానాల అమలు పరిధిని మాత్రమే చూసుకుంటూ తగిన సూచనలు చేసేవారనే అనుకుంటాం. ప్రధాన విధాన నిర్ణయాలను ప్రభావితం చేయగలిగే సామర్థ్యం వీరి సొంతమైనా.. కొన్ని ప్రత్యేక సందర్భాల్లో ‘మేము సైతం’ అంటూ ప్రజల కష్టాల్లో అడుగులు వేయడానికి కూడా వీరు వెనుకడుగు వేయరు. అచ్చం అలానే అస్సాంకి చెందిన ఐఏఎస్ ఆఫీసర్ ఇప్పుడు సోషల్ మీడియాలో ట్రెండింగ్‌గా మారారు. అస్సాంలో వరదలు ముంచెత్తుతున్న తరుణంలో మహిళా ఐఏఎస్ ఆఫీసర్ కీర్తి జల్లి స్వయంగా ఆ మునిగిపోయిన ప్రాంతాలను పర్యవేక్షించారు. చాలా సింపుల్‌గా చీరకట్టులో ఆ ప్రాంతాల్ని పర్యవేక్షించడానికి వచ్చిన ఆమె.. బురదలో సైతం నడుచుకుంటూ వెళ్లి బాధితులకు జరిగిన నష్టాన్ని అడిగి తెలుసుకున్నారు. అక్కడ జరిగిన నష్టాన్ని పక్కన పెడితే ప్రస్తుతం ఒక ఐఏఎస్ అధికారిణి మట్టి, బురద, నీరు అనేది చూడకుండా ఆ ప్రాంతాలు కలియదిరడగం విశేషంగా ఆకట్టుకుంది. నిజంగానే ఆమె మట్టిలో మాణిక్యం అంటూ నెటిజన్లు కొనియాడుతున్నారు. ఇంతకీ కీర్తి జల్లి ఎవరు? ఒక్కసారిగా వెలుగులోకి వచ్చిన కీర్తి జల్లి పేరు ఇప్పుడు వైరల్‌గా మారింది. అసలు కీర్తి జల్లి ఎవరు అనే విషయాన్ని తెలుసుకునే ప్రయత్న చేస్తున్నారు నెటిజన్లు. కీర్తి జెల్లి స్వస్థలం వరంగల్ జిల్లా. ఆమె తండ్రి జెల్లి కనకయ్య న్యాయవాది. తల్లి వసంత గృహిణి. 2011లో బి.టెక్ పూర్తి చేసిన కీర్తి తన చిరకాల కోరిక అయిన ఐ.ఏ.ఎస్ ఎంపికను నెరవేర్చుకోవడానికి కోచింగ్ కోసం ఢిల్లీకి వెళ్లింది. రెండేళ్లు కష్టపడిన కీర్తి 2013 సివిల్స్‌లో జాతీయస్థాయిలో 89వ ర్యాంకూ, రాష్ట్రస్థాయిలో 4వ ర్యాంకు సాధించింది. ప్రణబ్ ముఖర్జీ చేతుల మీదుగా అవార్డు ఐ.ఏ.ఎస్ ట్రయినింగ్ పూర్తయ్యాక కీర్తికి అస్సాంలో వివిధ బాధ్యతల్లో పని చేసే అవకాశం లభించింది. జోర్హట్ జిల్లాలోని తితబార్ ప్రాంతానికి సబ్ డివిజనల్ ఆఫీసర్‌గా కీర్తి పని చేస్తున్నప్పుడు 2016 అసెంబ్లీ ఎలక్షన్లు వచ్చాయి. ఓటింగ్ శాతం పెంచేందకు ఆమె చేసిన కృషికి నాటి రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ చేతుల మీదుగా ‘బెస్ట్ ఎలక్టొరల్ ప్రాక్టిసెస్ అవార్డ్’ దక్కింది. ఉసిరి మురబ్బాతో సమస్యకు చెక్ 2019లో ‘హైలాకండి’ జిల్లాలో డెప్యూటి కమిషనర్‌గా కీర్తి బాధ్యతలు నిర్వహించే సమయంలో అక్కడి ప్రజలు ముఖ్యంగా ముఖ్యంగా టీ ఎస్టేట్స్‌లో పని చేసే కార్మిక మహిళలు రక్తహీనతతో బాధ పడుతున్నారు. పిల్లల్లో పౌష్టికాహారలోపం విపరీతంగా ఉంది. స్త్రీలకు రక్తహీనత పోవడానికి అక్కడ విస్తృతంగా దొరికే కొండ ఉసిరి నుంచి ‘ఉసిరి మురబ్బా’ (బెల్లంపాకంలో నాన్చి ఎండబెట్టిన ఉసిరి ముక్కలు) తయారు చేసి పంచడంతో గొప్ప ఫలితాలు వచ్చాయి. ఇక అంగన్వాడి కేంద్రాలలో పిల్లలకు అందించే ఆహారంతో పాటు వారంలో ఒకరోజు తల్లులు తమ ఇంటి తిండి క్యారేజీ కట్టి పిల్లలతో పంపే ఏర్పాటు చేసింది కీర్తి. అంగన్వాడీ కేంద్రాలలో ‘డిబ్బీ ఆదాన్ ప్రధాన్’ కార్యక్రమం విజయవంతంగా నిర్వహించింది. అంటే పిల్లలు ఆ రోజు తమ బాక్స్ వేరొకరికి ఇచ్చి వేరొకరి బాక్స్ తాము తింటారు. దాని వల్ల ఇతర రకాల ఆహారం తిని వారి పౌష్టికాహారం లోపం నుంచి బయట పడతారు. ఇది కూడా మంచి ఫలితాలు ఇచ్చి కీర్తికి కీర్తి తెచ్చి పెట్టింది. పెళ్లైన మరుసటి రోజే విధుల్లోకి 2020 మే నెల నుంచి కచార్ జిల్లా డిప్యూటి కమిషనర్‌గా ఇటు పాలనా విధులు, ఇటు కోవిడ్ నియంత్రణ కోసం పోరాటం చేస్తోంది కీర్తి. సిల్చార్ మెడికల్ కాలేజీ హాస్పిటల్లో 16 పడకల ఐ.సి.యు కోవిడ్ పేషెంట్స్‌కు సరిపోవడం లేదు కనుక కీర్తి ఆధ్వర్యంలో ఆఘమేఘాల మీద అక్కడ కొత్త ఐ.సి.యు యూనిట్ నిర్మాణం జరుగుతోంది. పెళ్లి చేసుకున్న మరుసటి రోజున కీర్తి ఈ నిర్మాణ పనులను పర్యవేక్షించడానికి హాజరవడం చూస్తే ఆమె పని స్వభావం అర్థమవుతుంది. కీర్తి ప్రచారానికి, ఇంటర్య్వూలకు దూరంగా ఉంటుంది. తన గురించి తాను కాకుండా తన పని మాట్లాడాలని ఆమె విశ్వాసం. అది ఎలాగూ జరుగుతోంది. ప్రజలూ, పత్రికలు ఆమెను మెచ్చుకోకుండా ఎందుకు ఉంటాయి. చదవండి👉: కన్నీళ్లలో అస్సాం.. మునుపెన్నడూ లేనంతగా డ్యామేజ్.. పదేళ్లలో చేసిందంతా నీళ్లపాలు! This photo should have gone viral today A rare photo In the photo, Kachar District Commissioner (Srmti Keerthi Jalli, IAS) How to walk in the mud alongside the flood victims A nice photo 🙏🙏 One of them is going to spoil the expensive shoes😀 .. pic.twitter.com/FFEEHw9WLt — Ajit Sonowal (Jit) (@AjitSonowal3) May 26, 2022 A real defination of simplicity. Keerthi Jalli IAS, Deputy Commissioner Cachar.#AssamFloods pic.twitter.com/vPVnik77LF — Naini Vishnoi🇮🇳 (@NainiVishnoi) May 26, 2022 This is an appreciation tweet for @dccachar, Smt. Keerthi Jalli, IAS. Her eagerness to work for the people has no limits. The way she visited the remotest flood affected areas, taking stock of the damage and understanding the suffering of the people deserves huge respect. pic.twitter.com/ki7WPkUZOC — Karim Uddin Barbhuiya (@KUBarbhuiya) May 25, 2022 -
కన్నీళ్లలో అస్సాం.. మునుపెన్నడూ లేనంతగా నష్టం!
దిస్పూర్: ప్రతీ ఏటా అస్సాం వరదలు రావడం.. నష్టం వాటిల్లడం జరుగుతున్నదే. అయితే మునుపెన్నడూ లేనంతగా ఈసారి భారీ స్థాయిలో నష్టం వాటిల్లింది. దిమా హసావో జిల్లాలో గత ఐదు-పదేళ్ల చేపట్టిన నిర్మాణాలు, రోడ్లు వరదల్లో కోట్టుకోవడంపై స్వయంగా సీఎం హిమంత బిస్వ శర్మ ప్రకటన చేయడం పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతోంది. అస్సాం వరదలతో ఇప్పటిదాకా 30 మంది చనిపోయారు. వానా-వరద నష్టంతో.. కేవలం ఏడు రాష్ట్రాల్లోనే సుమారు ఐదున్నర లక్షల మంది నిరాశ్రయులయ్యారు. 956 గ్రామాలు పూర్తిగా నీట మునగ్గా, 47, 139, 12 హెక్టార్ల పంట సర్వనాశనం అయ్యిది. ఒక్క నాగోవ్ జిల్లాలో దాదాపు నాలుగు లక్షల మంది ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కాచర్‌లో లక్షన్నర, మోరిగావ్‌లో 40వేలమందికి పైగా నిరాశ్రయులయ్యారని అస్సాం స్టేట్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీ(ASDMA). ఆరు జిల్లాల్లో 365 రిలీఫ్ క్యాంపులు ఏర్పాటు చేసి.. వరద బాధితులకు ఆశ్రయం కల్పిస్తున్నారు. Assam Floods 2022 ధుబ్రి, దిబ్రుగఢ్, గోలాఘాట్, నల్బరి, శివసాగర్, సౌత్ సాల్మరా, టిన్సుకియా, ఉదల్గురి జిల్లాల్లో నష్టం ఊహించని స్థాయిలో నమోదు అయ్యింది. రోడ్లు సహా అంతటా బ్రిడ్జిలు ఘోరంగా దెబ్బతిన్నాయి. భారీ ఎత్తున్న నిత్యావసరాల పంపిణీ జరుగుతోంది. రెండు లక్షలకు పైగా కోళ్లు, పెంపుడు జంతువులు మృత్యువాత పడ్డాయి. బ్రహ్మపుత్ర ఉపనది కోపిలి.. ధరమ్‌తుల్ దగ్గర ప్రమాద స్థాయికి దాటి ప్రవహిస్తుండడంతో.. ఏం జరుగుతుందో అనే ఆందోళన నెలకొంది. ఎస్డీఆర్ఎఫ్ కింద 324 కోట్ల రూపాయల సాయం ప్రకటించింది కేంద్రం. వాన ప్రభావం తగ్గినా.. వరదలతో నీట మునిగిన ఇళ్లలోకి వెళ్లేందుకు జనాలు ఇష్టపడడం లేదు. A real defination of simplicity. Keerthi Jalli IAS, Deputy Commissioner Cachar.#AssamFloods pic.twitter.com/vPVnik77LF — Naini Vishnoi🇮🇳 (@NainiVishnoi) May 26, 2022 -
అయ్యా ఎమ్మెల్యే సారూ అదేం పని.. వీడియో వైరల్
భారీ వర్షాల కారణంగా అసోం అతలాకుతలమవుతోంది. వరదల కారణంగా అసోం ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. నదులు, వాగులు ఉప్పొంగి ప్రవహిస్తుండటంతో ఇళ్లలోకి నీళ్లు చేరి ప్రజలు సురక్షిత ప్రాంతాలకు తరలి వెళ్తున్నారు. కాగా, వర్షాల నేపథ్యంలో వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించిన బీజేపీ ఎమ్మెల్యే సోషల్ మీడియాలో ట్రెండింగ్‌లో నిలిచారు. ఆయన చేసిన పనికి నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇంతకీ ఏం జరిగిందంటే..? వివరాల ప్రకారం.. బీజేపీ ఎమ్మెల్యే బిసు మిశ్రా గురువారం వరద ప్రభావిత ప్రాంతంలో పర్యటనకు వెళ్లారు. ఈ క్రమంలో ఓ ప్రాంతంలో వరద నీరు ఎక్కువగా ఉండటంతో ఆయనకు నడవడం సాధ్యపడలేదు. దీంతో, ఎమ్మెల్యే మిశ్రా.. అక్కడే ఉన్న రెస్క్యూ టీమ్ సభ్యుడిని పిలిచారు. అనంతరం రెస్క్యూ టీమ్ సభ్యుడి వీపుపై ఎక్కి, ఎమ్మెల్యే పడవ వరకూ వెళ్లి అందులో నిల్చున్నారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. వీడియోపై నెటిజన్లు స్పందిస్తూ.. ఎమ్మెల్యే అలా చేయడమేంటని ఆగ్రహం వ్యక్తం చేస్తూ కామెంట్స్ చేస్తున్నారు. ఇదిలా ఉండగా.. వర్షాల కారణంగా అసోంలో నాలుగు లక్షల మంది నిరాశ్రయులయ్యారు. #WATCH | Assam: BJP MLA from Lumding Assembly, Sibu Misra was seen taking a piggyback ride to a boat, on the back of a flood rescue worker yesterday, May 18th. He was in Hojai to review the flood situation in the area. pic.twitter.com/Rq0mJ8msxt — ANI (@ANI) May 19, 2022 ఇది కూడా చదవండి: బీజేపీలో చేరిన కాంగ్రెస్ సీనియర్ నేత -
Assam Floods: కొనసాగుతోన్న వరదల బీభత్సం.. 9 మంది మృతి
దిస్పూర్: ఎడతెరిపి లేని వర్షాలు అస్సాంలో అల్లకల్లోలం సృష్టిస్తున్నాయి. శనివారం మొదలైన భారీ వర్షాలు, వరదలు రాష్ట్రాన్ని ముంచెత్తుతున్నాయి. కొండ చరియలు విరిగిపడి వరద నీరు పోటెత్తడంతో వేలాది మంది నిరాశ్రయులయ్యారు. 27 జిల్లాల్లో సుమారు 1,089 గ్రామలు నీటమునిగాయి. సుమారు 6 లక్షల మంది వరదల ప్రభావానికి గురై తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. #India Moment the bamboo bridge was washed away in #Assam due to heavy rains and flooding. 20 districts of Assam were affected by #floods on Monday. 2 people died.#indiafloods 💬 @GaiaNewsIntl 🌎 pic.twitter.com/kzaDPpQrUS — ★ GNI ★ GAIA NEWS INTERNATIONAL (@GaiaNewsIntl) May 17, 2022 ఆర్మీ, పారామిలిటరీ బలగాలు, జాతీయ, రాష్ట్ర విపత్తు నిర్వహణ సంస్థ, పోలీసులు రంగంలోకి దిగి ముమ్మరంగా సహాయక చర్యలు చేపట్టాయి. ఇప్పటి వరకు వరద చేరిన ఇళ్లల్లో చిక్కుకున్న 3,427 మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు.142 పునరావాస శిబిరాలు, 115 సహాయ పంపిణీ కేంద్రాలను ఏర్పాటు చేసి మొత్తం 48,000 మంది బాధితులకు ఆశ్రయం కల్పించారు. వాన బీభత్సంతో పాటు కొండచరియలు విరిగిపడుతుండటంతో రైల్వే ట్రాక్‌లు, వంతెనలు, రోడ్లు దెబ్బతిన్నాయి. దీంతో పలుచోట్ల రవాణా వ్యవస్థ స్థంభించిపోయింది. దిమా హసావో జిల్లాలో రోడ్లు, వంతెనలు కొట్టుకుపోయాయి. వరదల ప్రభావంతో ఇప్పటి వరకు 9 మంది మృత్యువాతపడ్డారు. కాచర్‌లో ఇద్దరు, ఉదల్గురిలో ఒకరు మరణించగా.. కొండ చరియలు విరిగిపడి దిమా హసావోలో నలుగురు, లఖింపూర్‌లో ఒక్కరు ప్రాణాలు కోల్పోయారు. మరో అయిదుగురు కనిపించకుండా పోయారు. #WATCH | Assam: Efforts to airdrop relief material were initiated in Haflong amidst the #AssamFloods on May 18; will continue today, May 19. pic.twitter.com/jEnaQFGBlj — ANI (@ANI) May 18, 2022 వరద బాధిత జిల్లాలకు అస్సాం ప్రభుత్వం రూ.150 కోట్లు విడుదల చేసిందని ముఖ్యమంత్రి హిమంత బిస్వా శర్మ తెలిపారు. వరద సహాయక చర్యల్లో భాగంగా రాష్ట్రానికి కేంద్రం రూ. 1,000 కోట్లు మంజూరు చేసిందన్నారు.వరద బాధిత ప్రాంతాల్లో నిత్యావసర వస్తువుల సరఫరాను కొనసాగించేందుకు, కమ్యూనికేషన్ మార్గాలను పునరుద్ధరించేందుకు రాష్ట్ర ప్రభుత్వం అవసరమైన చర్యలు తీసుకుంటోందని పేర్కొన్నారు. రైల్వే లింక్ పునరుద్ధరించడానికి దాదాపు 45 రోజులు పడుతుందని, రెండు-మూడు రోజుల్లో రోడ్డు కనెక్టివిటీని పునరుద్దరిస్తామని సీఎం తెలిపారు. ప్రస్తుతం కంపూర్, ధర్మతుల్ వద్ద కోపిలి నది, నంగ్లమురఘాట్ వద్ద దిసాంగ్ నది, ఏపీ ఘాట్ వద్ద బరాక్ నది, కరీంనగర్ వద్ద కుషియారా నది ప్రమాదకర స్థాయికి మించి ప్రవహిస్తున్నాయి. అయితే రానున్నఈ ప్రాంతంలో విస్తృతంగా భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని గౌహతి ఆధారిత ప్రాంతీయ వాతావరణ కేంద్రం అంచనా వేసింది. జిల్లాలో సాధారణం కంటే ఎక్కువ వర్షపాతం నమోదైందని, రానున్న రెండు రోజుల పాటు వర్షాలు మరింత కురుస్తాయని వాతావరణ శాఖ పేర్కొంది. కాగా శుక్రవారం నుంచి ఈ ప్రాంతంలో వాతావరణ పరిస్థితులు కొద్దిగా మెరుగుపడవచ్చని తెలిపింది. తిరగబడ్డ రైలు బోగీలు వరదనీరు పోటేత్తడంతో దిమా హసావ్ ప్రాంతంలోని హాఫ్లాంగ్ రైల్వే స్టేషన్ పూర్తిగా నీటిలో మునిగిపోయింది. స్టేషన్‌లోని రెండు రైళ్లు పూర్తిగా నీళ్లలో మునిగిపోయాయి. గౌహతి-సిల్చార్ ఎక్స్‌ప్రెస్‌కు చెందిన కొన్ని బోగీలు తిరగబడుతున్న దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. అయితే ముందే ప్రమాద తీవ్రతను అంచనా వేసిన అధికారులు ప్రయాణికులను సురక్షితంగా తరలించడంతో ప్రాణ నష్టం తప్పింది. రైల్వే అధికారులు 29 రైళ్లను నిలిపివేశారు. ప్యాసింజర్ రైళ్లలోని ప్రయాణికులను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. -
అస్సాంలో బీభత్సం సృష్టిస్తున్న వరదలు...ముగ్గురు మృతి
Assam Floods Nearly 25,000 people affected: దేశంలో అనేక రాష్ట్రలలోని ప్రజలు భయంకరమైన ఎండలు, ఉక్కపోతతో ఉక్కిరిబిక్కిరి అవుతుంటే అస్సాం మాత్రం అకాల వర్షాలతో వరదల్లో చిక్కుకుంది. అసోంలోని దిమా హసావో జిల్లాలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల కారణంగా కొండచరియలు విరిగిపడి ఒక మహిళతో సహా ముగ్గురు వ్యక్తులు మరణించారని అస్సాం స్టేట్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీ (ఏఎస్డీఎంఏ) తెలిపింది. కొండ జిల్లా ఆకస్మిక వరదలు కారణంగా కొండ చరియలు విరిగిపడటంతో అనేక ప్రాంతాల్లో రోడ్డు, రైలు మార్గాలు దెబ్బతిన్నాయని వెల్లడించింది. కొండచరియలు విరిగిపడటంతో జటింగా-హరంగాజావో, మహూర్-ఫైడింగ్ వద్ద రైల్వే లైన్ నిలిచిపోయింది. గెరెమ్లాంబ్రా గ్రామం వద్ద మైబాంగ్ సొరంగం వద్ద కొండచరియలు విరిగిపడటం వల్ల రహదారి బ్లాక్ అయ్యే అవకాశం ఉందని హెచ్చరించింది. అస్సాంలో ఎడతెరిపి లేకుండా కురిసిన అకాల వర్షాల కారణంగా సుమారు ఐదు జిల్లాలోని దాదాపు 25000 మంది ప్రజలు వరదల బారిన పడ్డారు. ఈ మేరకు ఈ ఘటనకు సంబంధించిన వీడియో ఆన్లైన్లో తెగ వైరల్ అవుతోంది. వరదలు సృష్టించిని విధ్వంసం: న్యూ కుంజంగ్, ఫియాంగ్‌పుయ్, మౌల్‌హోయ్, నమ్‌జురాంగ్, సౌత్ బగేటార్, మహాదేవ్ తిల్లా, కలిబారి, నార్త్ బాగేటార్, జియోన్, లోడి పాంగ్‌మౌల్ గ్రామాలలో కొండచరియలు విరిగిపడడంతో దాదాపు 80 ఇళ్లు తీవ్రంగా ప్రభావితమయ్యాయని ఏఎస్డీఎంఏ తెలిపింది. అస్సాంలోని ఇప్పటి వరకు కాచర్, దేమాజీ, హోజాయ్, కర్బీ అంగ్లాంగ్ వెస్ట్, నాగావ్, కమ్రూవ్ ఈ ఆరు జిల్లాలు వరదల వల్ల ప్రభావితమయ్యాయి. ఆరు జిల్లాలో 94 గ్రామాలకు చెందిన 24,681 మంది వరద బారిన పడ్డారు. ఒక్క కాచర్ జిల్లాలోనే 21,000 మంది వరద బారిన పడ్డారు. ఆ తర్వాతి స్థానంలో కర్బీ ఆంగ్లోంగ్ వెస్ట్ దాదాపు 2,000 మంది బాధితులు, ధేమాజీలో 600 మందికి పైగా ప్రజలు ప్రళయం బారిన పడ్డారు. ఆర్మీ, పారామిలిటరీ బలగాలు, ఫైర్ అండ్ ఎమర్జెన్సీ సర్వీసెస్, ఎస్డీఆర్ఎఫ్, సివిల్ అడ్మినిస్ట్రేషన్‌తో సహా క్యాచర్, హోజాయ్ జిల్లాలకు చెందిన శిక్షణ పొందిన వాలంటీర్లు దాదాపు 2,200 మందిని రక్షించారు. #WATCH Roads, bridges and agricultural land were inundated in Hojai, Assam yesterday due to floods following incessant rain in the region pic.twitter.com/DitKiMbb6O — ANI (@ANI) May 15, 2022 (చదవండి: పెదవుల పై ముద్దు పెట్టుకోవడం అసహజ నేరం కాదు) -
శభాష్ ఎమ్మెల్యే, నీటిలోకి దిగి మరీ...
-
శభాష్ ఎమ్మెల్యే, నీటిలోకి దిగి మరీ...
గువహటి: ఒకసారి ఓట్లేసి గెలిపించిన తరువాత తిరిగి ఓటర్ల ముఖం చూడని ప్రజా ప్రతినిధులను చూస్తుంటాం. ఎప్పుడో ఎన్నికల సమయంలో తప్ప ఇంకెప్పుడు వారికి ప్రజలు గుర్తు రారు. వరదలు, ప్రకృతి విపత్తులు వచ్చినప్పుడు మాత్రం ఏదో వచ్చామా, చూశామా, వెళ్లామా అన్నట్లు ఉంటారు. అయితే అసోంలోని ఒక ఎమ్మెల్యే మాత్రం ఇందుకు పూర్తి భిన్నంగా వ్యవహరించించారు. తన నియోజక వర్గంలో వరదలో చిక్కుకున్న ప్రజలను, పశువులను స్వయంగా నీటిలోకి దిగి మరీ కాపాడారు. చదవండి: వరద బీభత్సం.. 99 గ్రామాలు జలమయం గత కొద్ది రోజులుగా అసోంను వరదలు ముంచెత్తుతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే అసోం ఎమ్మెల్యే మృణాల్ సైకియా వరదలో చిక్కుకున్న మారుమూల ప్రాంతాలకు చెందిన ప్రజలను కాపాడే సహాయక చర్యల్లో స్వయంగా పాల్గొన్నారు. నీటిలోకి దిగిమరి వారిని కాపాడారు. ఇందుకు సంబంధించిన వీడియోను ఆయన తన సోషల్ మీడియా ఖాతాలో పోస్ట్ చేశారు. ఇందులో తన చేతులతో ఒక బాబును పైకి ఎత్తి పట్టుకొని, నడుము వరకు లోతున్న నీటి నుంచి ఆ బాబును కాపాడారు. ‘మా నియోజకవర్గంలో వరదలు భీభత్సాన్ని సృష్టిస్తున్నాయి. మారుమూల ప్రాంతాల నుంచి మేం ప్రజలను కాపాడుతున్నాం’ అని పేర్కొన్నారు. ఇక ప్రజలతో పాటు పశువులను వరద ముప్పు ప్రాంతం నుంచి తరలిస్తున్న వీడియోను కూడా ఆయన షేర్ చేశారు. ‘మా గ్రామ ఆర్ధిక వ్యవస్థలో పశువులు ముఖ్యపాత్ర పోషిస్తాయి. వందలాది మేకలను కాపాడినందకు సంతోషంగా ఉంది’ అని ట్వీట్ చేశారు. ఈ వీడియోలు చూసిన నెటిజన్లు మృణాల్‌ను ప్రశంసలతో ముంచెత్తున్నారు. ‘మీరు ఎంతో మంది ప్రజల ప్రతినిధులకు ఆదర్శం. ఇప్పటి నుంచైనా మిగిలిన వారు మీలా ఉండాలని ఆశిస్తున్నాను. ప్రజల రుణం తీర్చుకునే సమయమిది’ అని ఒక నెటిజన్ కామెంట్ చేశాడు. 27 జిల్లాలకు చెందిన 22లక్షల మంది ఈ వరదల వల్ల ప్రభావితమయ్యారు. సుమారు 85 మంది ప్రాణాలు కోల్పోయారు. -
వరద బీభత్సం.. 99 గ్రామాలు జలమయం
అసోం: ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలు ఈశాన్య రాష్ట్రం అసోంను ముంచెత్తుతున్నాయి. గత కొద్దిరోజులుగా అసోంలోని 4 జిల్లాల్లో కురుస్తున్న భారీ వర్షాలకు 99 గ్రామాలు ముంపుకు గురయ్యాయి. ఈ మేరకు అసోం రాష్ట్ర విపత్తు నిర్వహణ సంస్థ మంగళవారం పేర్కొంది. దీహాజీ, జోర్హాట్, శివసాగర్, దిబ్రూఘడ్ జిల్లాల్లో 4,329 హెక్టార్ల పంట నష్టం జరిగినట్లు నివేదకలు వెల్లడిస్తున్నాయి. ఈ జిల్లాల్లో 30 సహాయక శిబిరాలను శిబిరాలను ఏర్పాటు చేసి వరద బాధితులకు సహాయాన్ని అందిస్తున్నారు. ముంపుకు గురైన ప్రాంతాల నుంచి దాదాపు 37 వేలమందిని సురక్షిత ప్రాంతాలకు తరలించినట్లు అధికారులు తెలిపారు. నిరంతరాయంగా కురుస్తున్న వర్షాల కారణంగా నీమాటిఘాట్ (జోర్హాట్) వద్ద బ్రహ్మపుత్ర, ధుబ్రీ.. శివసాగర్ వద్ద డిఖో.. నంగ్లమురాఘాట్ వద్ద డిసాంగ్.. నుమాలిగ వద్ద ధన్సిరి.. ఎన్టీరోడ్ క్రాసింగ్ వద్ద జియా భరాలీ నదులు పొంగిపొర్లుతూ ప్రమాద ఘంటికలను మోగిస్తున్నాయి. చదవండి: చెరువులో పడి ఐదుగురు బాలికలు మృతి -
ట్వీట్లు వద్దయ్యా.. డొనేట్ చేయండి!
న్యూఢిల్లీ : అసోంలో కురుస్తున్న భారీ వర్షాలకు నదులు పొంగిపొర్లుతున్నాయి. వరదల ఉధృతికి పదుల సంఖ్యలో మృత్యువాత పడగా.. లక్షలమంది నిరాశ్రయులయ్యారు. మొత్తం 33 జిల్లాల్లో ఎన్నడూ లేనివిధంగా వరద ప్రభావం కొనసాగుతోంది. వీటన్నంటిని మించి వేల ఎకరాల్లో విస్తరించి ఉన్న కజిరంగ నేషనల్ పార్క్ 90 శాతం జలమయం అయింది. ఇలాంటి పరిస్థితుల్లో అసోంను చూసి బాలీవుడ్ హీరో అక్షయ్ కుమార్ చలించిపోయారు. వెంటనే అసోంకు రూ.2 కోట్ల భారీ విరాళం ప్రకటించారు. అందులో కోటి రూపాయలు అసోం ముఖ్యమంత్రి సహాయనిధికి, మరో కోటి రూపాయలు కజిరంగ నేషనల్ పార్క్‌కు విరాళంగా అందించారు. అంతేగాకుండా, తాను సాయం చేశానని, అందరూ సాయం చేయండి అంటూ ట్విటర్ ద్వారా నెటిజన్లకు విజ్ఞప్తి చేశారు. భారత స్పింటర్ హిమ దాస్ సైతం తనకు తోచిన సాయం ప్రకటించింది. అసోం ముఖ్యమంత్రి సహాయ నిధికి తన నెల జీతంలో సగం డబ్బును విరాళంగా ఇస్తున్నట్లు ట్వీట్ చేసింది. ‘‘అసోంలో వరదల పరిస్థితి చాలా దారుణంగా ఉంది. 33 జిల్లాల్లో 30 జిల్లాలు ప్రస్తుతం ఇబ్బందులు ఎదుర్కుంటున్నాయి. ఈ కష్ట సమయంలో మా రాష్ట్రాన్ని ఆదుకోవాలని అందరిని కోరుతున్నాను’అని హిమ ట్వీట్లో పేర్కొంది. ఇలా అందరూ తమకు తోచిన సాయం చేస్తూ విరాళాలివ్వాలని అభిమానులను కోరుతుండగా.. టీమిండియా క్రికెటర్లు విరాట్ కోహ్లి, రోహిత్ శర్మ, కేఎల్ రాహుల్‌లు మాత్రం.. అసోంలోని పరిస్థితులు చూస్తే గుండె తరుక్కుపోతుందని కేవలం ట్వీట్‌తో సరిపెట్టారు. క్రికెట్ ఆటతో కోట్లకు కోట్లు సంపాదించే ఆటగాళ్లు.. ఇలా కేవలం ట్వీట్లతో సరిపెట్టడం భావ్యం కాదని, డొనేట్ చేస్తే బాగుంటుందని కామెంట్ చేస్తున్నారు. మీరు చేసే సాయంతో అక్కడి అభాగ్యుల ఉపయోగపడుతుందని వేడుకుంటున్నారు. దయచేసి ట్వీట్లు చేయడం మానేసీ విరాళాలు ఇవ్వాలని, అభిమానులు కూడా ఇచ్చేలా చేయాలని కోరుతున్నారు. #Klrahul sir.. Please help us.. This is the time you should stand togather. People of Assam loves our Cricketers they support our cricketers every time and long time.. You u have a huge fan following here. Plz do something Sir. You guys are our heros and fighters.. Plz help us🙏 — Rohit Sen (@RohitSe19265431) July 19, 2019 -
విలవిలలాడుతున్న ప్రాణి ప్రపంచం
గువాహటి: భారీ వర్షాలతో బ్రహ్మపుత్ర నదికి వరద పొటెత్తటంతో అస్సాం అతలాకుతలం అవుతోంది. పునరావాస శిబిరాల్లోకి కూడా నీరు వచ్చి చేరటంతో ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించటం అధికారులకు కష్టతరంగా మారుతోంది. ప్రతిష్టాత్మక కజిరంగా జాతీయ ఉద్యావనం పరిస్థితి మరీ ఘోరంగా ఉంది. పార్క్ లోకి భారీ ఎత్తున్న నీరు వచ్చి చేరుతుండటంతో సమీపంలోని కబ్రి, అంగోలాంగ్ జిల్లాల సరిహద్దు గ్రామాలవైపు జంతువులు పరుగులు పెడుతున్నాయి. ఈ క్రమంలో వేటగాళ్ల బారిన పడే అవకాశం ఉండటంతో 188 ప్రత్యేక కాంపులను ఏర్పాటు చేసి ఫారెస్ట్ అధికారులు, రక్షణ గస్తీ కాస్తున్నారు. "85 శాతం పార్క్ నీటితో నిండిపోయింది. ఆదివారం బ్రహ్మపుత్ర వరదతో 6 అడుగుల కంటే ఎక్కువే నీరు వచ్చి చేరింది. 1988 వరదల కంటే దారుణమైన పరిస్థితిని ఇప్పుడు చూస్తున్నాం" అని కజిరంగ డివిజన్ ఫారెస్ట్ ఆఫీసర్ రోహిణి బల్లవ సాయికియా తెలిపారు. కజిరంగ ఉద్యానవనం ఏనుగులు, పులులు, తెల్ల దున్నపోతులు, అరుదైన దుప్పిజాతులు, మరీముఖ్యంగా రైనోలకు ఆశ్రయంగా ఉంది. వర్షాకాలం వచ్చిందంటే చాలూ బ్రహ్మపుత్ర నదికి ప్రతీయేడూ ఇలా వరదలు రావటం, కజిరంగ పార్క్ లోకి నీరు చేరి జంతువులు ఇబ్బందిపాలు అవుతుండటం సర్వసాధారణంగా మారింది. అయితే రాను రాను ఈ పరిస్థితి అధ్వానంగా తయారువతోందని, జంతువులను తరలించటం చాలా కష్టతరంగా మారుతోందని సాయికియా చెబుతున్నారు. గత నెలలో వరదల మూలంగా 7 రైనోలతోసహా 107 జంతువులు చనిపోగా, అందులో 13 వరదల నుంచి తప్పించుకునే క్రమంలో రోడ్డు దాటుతూ మృత్యువాత పడ్డాయి. పర్యాటక రోడ్లు, బ్రిడ్జిలు దెబ్బతినటంతో సమారు 7కోట్ల నష్టం వాటిల్లిందని అధికారులు వెల్లడించారు. -
అసోంలో కొట్టుకుపోయి.. బంగ్లాదేశ్‌లో మృతి
అసోంలో బ్రహ్మపుత్రా నదికి భారీగా వరదలు రావడంతో అందులో సుమారు 50 రోజుల క్రితం కొట్టుకుపోయింది.. చివరకు బంగ్లాదేశ్‌లో తేలి, అక్కడ చనిపోయింది. అవును.. మన దేశానికి చెందిన ఏనుగు బంగ్లాదేశ్‌లో చనిపోయింది. 'బంగబహదూర్' అనే పేరున్న ఈ ఏనుగును ఢాకా సమీపంలోని సఫారీ పార్కుకు తరలించేందుకు వన్యప్రాణి అధికారులు ప్రయత్నించినా ఫలితం లేకపోయింది. దాన్ని కాపాడేందుకు తాము చాలా ప్రయత్నించినా అది బతకలేదని బంగ్లాదేశ్ అటవీ శాఖాధికారులు చెప్పారు. అయితే ఆ ఏనుగు మృతికి సరైన కారణం తెలుసుకునేందుకు దానికి అటాప్సీ నిర్వహించే అవకాశం ఉంది. ఆ ఏనుగు బాగా నీరసంగా ఉందని.. అసోంలోని ధుబ్రి జిల్లాలో బ్రహ్మపుత్రా నది వరదల్లో కొట్టుకుపోయిందని చెబుతున్నారు. ఏనుగు చనిపోయిన విషయం తెలిసి ఇటు అసోంతో పాటు అటు బంగ్లాదేశ్‌లో కూడా పలువురు గ్రామస్తులు కన్నీరుమున్నీరుగా విలపించారు. ఈనెల 11వ తేదీన బంగ్లాదేశ్‌లో దానికి అటవీ శాఖాధికారులు మత్తుమందు ఇచ్చారు. ఒక కొలనులో ఉన్న ఆ ఏనుగును తాళ్లు, చైన్లతో బయటకు లాగి మునిగిపోకుండా చూసేందుకు ప్రయత్నించారు. ఆదివారం వరకు అది బాగానే ఉందని, కానీ చివరకు చనిపోయిందని అధికారులు తెలిపారు. ప్రస్తుతం బంగ్లాదేశ్‌లో ఉష్ణోగ్రతలు చాలా ఎక్కువగా ఉన్నాయని, ఏనుగులు అంత వేడిని భరించలేవని.. దానికి తాము సాధారణంగా ఇచ్చే ఆహారమే ఇచ్చి బతికించేందుకు ప్రయత్నించినా అది బతకలేదని మరో అధికారి చెప్పారు. -
పడవలో బిడ్డకు జన్మనిచ్చింది
పలాశ్ గురి: అస్సాం వరదల్లో ఓ మహిళ పడవలో శిశువుకు జన్మనిచ్చింది. బ్రహ్మపుత్ర, ధాన్ సిరి నదులు ఉప్పొంగడంతో కజిరంగా జాతీయ పార్కుకు దగ్గరలో ఉన్న మహిళ గ్రామం బెజగావ్ జల దిగ్భంధంలో చిక్కుకుంది. ఈ సమయంలోనే జ్యోతి రవిదాస్(24)కు పురిటినొప్పులు ప్రారంభమయ్యాయి. వేగంగా వస్తున్న నీరు అలల రూపంలో కదులుతూ జ్యోతి బెడ్ రూంలోకి వచ్చేశాయి. క్రమంగా గదిలోని నీటిమట్టం పెరుగుతూ గర్భాన్ని తాకుతుంటే బిడ్డకు ఏమైనా అవుతుందేమోనని ఆమె పడిన బాధ వర్ణానాతీతం. ఓ వైపు నొప్పులు మరో వైపు వరద నీటి మధ్య చిన్న పడవలో ఆమెను ఆసుపత్రికి చేర్చాడు భర్త జమునా రవిదాస్. ప్రమాదం తప్పిపోయి పండటి ఆడ శిశువుకు జన్మనిచ్చింది జ్యోతి. ఈ సంఘటన జరిగి వారం రోజులు కావొస్తోంది. ప్రస్తుతం అస్సాం ప్రభుత్వం పలాశ్ గురిలో ఏర్పాటు చేసిన రిలీఫ్ క్యాంప్ లో ఉన్న భార్య భర్తలు తమ అనుభవాన్ని పంచుకున్నారు. వరద కారణంగా తమ ఇల్లు నీటిలో మునిగిపోయిందని భార్యభర్తలు తెలిపారు. బిడ్డ పుట్టిన దగ్గర నుంచి ఇంటికి వెళ్లలేకపోయామని, కుటుంబ సంప్రదాయం ప్రకారం బిడ్డ జన్మించిన ఆరో రోజు ప్రత్యేకపూజలు చేయాల్పివుంటుందని చెప్పారు. వరద కారణంగా పూజ చేయలేకపోవడం బాధిస్తోందని చెప్పారు. వరద వచ్చినప్పుడు తన తల్లిదండ్రులు, ఐదేళ్ల కొడుకుని పక్క గ్రామానికి తరలించినట్లు రవిదాస్ వివరించారు. జీవితంలో ఇంతకంటే దారుణమైన పరిస్థితిని ఎదుర్కొనని ఆవేదన వ్యక్తం చేశారు. ఇది కేవలం జ్యోతిరవిదాస్ ల పరిస్థితి కాదు. దాదాపు 300 కుటుంబాలు వరద కారణంగా పలాశ్ గురిలోని ధాన్ సిరిముఖ్ జనతి హైస్కూల్ లో తలదాచుకుంటున్నాయి. ప్రభుత్వం బలవంతంగా చాలా కుటుంబాలను రిలీఫ్ క్యాంపుకు తరలించిందని రవిదాస్ చెప్పారు. వరద ఉధృతి ఎక్కువగా ఉండటంతో ఇళ్ల నుంచి క్యాంపుకు వచ్చే దారిలో సగం దూరం ఈదుతూ రావాల్సి వచ్చిందని తెలిపారు. క్యాంపులో మనిషికి మూడు రోజులకు మూడు కిలోల బియ్యం ఇస్తున్నట్లు చెప్పారు. వంట చెరకు తడిగా ఉండటంతో అన్నం ఉడికించడం అసాధ్యంగా మారుతుందని వాపోయారు. వరద కారణంగా చాలా మంది పంట, ఇళ్లను నష్టపోయారు. పలాశ్ గురి చుట్టుపక్కల ప్రాంతాల్లో కలిపి మొత్తం 622 రిలీఫ్ క్యాంపులు, 233 సరఫరా క్యాంపులను ఏర్పాటుచేశారు. మొత్తం 5 లక్షలకు పైగా ప్రజలు క్యాంపుల్లో ఆశ్రయం పొందుతున్నారు. మారుమూల గ్రామాల్లో వేలాదిగా చిక్కుకుపోయిన ప్రజలను రక్షించేందుకు రెస్క్యూ టీమ్ లు ప్రయత్నిస్తున్నాయి. దాదాపు 500లకు పైగా పడవలు ఈ ఆపరేషన్ లో పాల్గొంటున్నాయి.ఆహారం, మందులు, దుస్తులను ప్రజలకు క్యాంపుల ద్వారా నిరంతరం అందిస్తున్నారు. -
అసోంను ముంచెత్తుతున్న వరదలు
-
అసోంను ముంచెత్తుతున్న వరదలు
గౌహతి : అసోంలో వరదలు పోటెత్తాయి. వేలాది మంది నిరాశ్రయులయ్యారు. వరదల కారణంగా ఒకరు మరణించినట్లు తెలుస్తోంది. బ్రహ్మపుత్ర, జై భారాలి నదులు ప్రమాదస్థాయిని దాటి ప్రవహిస్తున్నాయి. బార్పేట, నల్బరీ, గోల్ పారా, లక్ష్మీపూర్ తదితర తొమ్మిది జిల్లాలో పరిస్థితి తీవ్రంగా ఉంది. తీవ్రంగా పంట నష్టం వాటిల్లింది. సుమారు 300 హెక్టార్లలో పంటలు నీటమునిగాయి. లక్ష్మీపూర్ జిల్లాలో ఒకరు కొట్టుకుపోయారు. అసోం రాష్ట్రాన్ని భారీ వర్షాలు అతలాకుతలం చేస్తున్నాయి. ఇప్పటి వరకు 9 జిల్లాలోని లోతట్టు ప్రాంతాల్లో వరద ముంచెత్తింది. దాదాపు 60వేల మంది ప్రజలు నిరాశ్రయులయ్యారు. దీనిపై అసోం డిజాస్టర్ మేనేజ్ మెంట్ అథారిటీ అప్రమత్తమైంది. ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. పరిస్థితిని అంచనా వేస్తున్నామని, సహాయక చర్యలు కొనసాగుతున్నాయని రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. అయితే పరిస్థితి అదుపులోనే ఉందని, వరద ఉధృతి నుంచి గట్టెక్కేందుకు అన్ని విధాలా సిద్ధంగా ఉన్నామని సీనియర్ అధికారి తెలిపారు. సహాయక క్యాంపుల ద్వారా ఆహారం తదితర వస్తు సామగ్రిని అందించేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేశామని తెలిపారు. కాగా రాబోయే రెండు రోజుల్లో మరిన్ని వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు ప్రకటించారు.