వర్షాకాలం పూర్తిగా మొదలు కాకముందే అసోం రాష్ట్రాన్ని భారీ వర్షాలు వణికిస్తున్నాయి. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలు 11 జిల్లాలను ముంచెత్తాయి. దీని కారణంగా 34 వేల మంది ప్రభావితులయ్యారు. నదులు పొంగి ప్రవహిస్తుండటంతో అసోంలో ఈ ఏడాది తొలి వరదలు నమోదయ్యాయి.
అసోం స్టేట్ డిజాస్టర్ మేనేజ్‌మెంట్ అథారిటీ(ASDMA) ప్రకారం బ్రహ్మపుత్రతోపాటు పలు నదులు నీటిమట్టం పెరుగుతుండటంతో వరద నీరు వందలాది గ్రామాలను ముంచెత్తింది. అయితే ఏ నది ప్రమాదకర స్థాయికి మించి ప్రవహించడం లేదని పేర్కొంది. అసోం అంతటా 209.67 హెక్టార్ల పంట ప్రాంతాలు దెబ్బతిన్నాయని తెలిపింది.
వరదల వల్ల బిశ్వనాథ్, దర్రాంగ్, ధేమాజీ, దిబ్రూగఢ్, లఖింపూర్, తముల్‌పూర్, ఉదల్‌గురి జిల్లాలు ప్రభావితమయ్యాయయని.. 34 వేలమందిని సురక్షిత ప్రాంతాలకు తరలించినట్లు అధికారులు తెలిపారు. వీరిలో 4, 675 మంది మహిళలు, 3,787 మంది చిన్నారులు ఉన్నట్లు పేర్కొన్నారు.
చదవండి: బీజేపీ శవపేటికకు చివరి మేకు అదే..కేంద్రానికి స్టాలిన్ హెచ్చరికలు..
లఖింపూర్‌లో అత్యధికంగా 23,516 మంది ప్రభావితమయ్యారు, దిబ్రూగర్‌లో 3,857 మంది, దర్రాంగ్‌లో 2231 మంది, బిశ్వనాథ్‌లో 2231 మంది, ధేమాజీలో 1,085 మంది ఉన్నారు. వరదల బారిన పడిన లఖింపూర్‌లో ఎనిమిది, ఉదల్‌గురిలో రెండు మొత్తం 11 సహాయ పంపిణీ కేంద్రాలను ఏర్పాటు చేశారు. మొత్తంగా 77 గ్రామాలు వరదల వల్ల ప్రభావితమయ్యాయి. లఖింపూర్, ఉదల్‌గురిలో రెండు చొప్పున నాలుగు చెరువుల కట్టలు తెగిపోయాయి.
బిస్వనాథ్, బొంగైగావ్, దిబ్రూఘర్, గోలాఘాట్, జోర్హాట్, కర్బీ అంగ్లాంగ్ వెస్ట్, లఖింపూర్, మోరిగావ్, నల్బరీ, సోనిత్‌పూర్, తముల్‌పూర్ ఉదల్‌గురి జిల్లాల్లో రోడ్లు భారీ కోతకు గురయ్యాయని ఏఎస్‌డీఎమ్‌ఏ తెలిపింది. భారీ వర్షాల కారణంగా దిమా హసావో కమ్రూప్ జిల్లాల్లోని కొన్ని ప్రాంతాలలో కూడా కొండచరియలు విరిగిపడినట్లు పేర్కొంది.
కాగా భారతదేశంలో ఎక్కువగా వరదలకు గురయ్యే రాష్ట్రాల్లో అస్సాం ఒకటి. ఈ రాష్ట్రానికి వరద సమస్య వార్షిక విపత్తుగా మారింది. అత్యధిక జనాభా కలిగిన ఈ ఈశాన్య రాష్ట్ర ప్రజలు భారీ వర్షాలు, వరదలతో ప్రతి వర్షాకాలం ప్రభావితం అవుతుంటారు. వేలాది మంది ప్రజలను నిరాశ్రయులవుతారు. అనేక జంతువులు ప్రాణాలు కోల్పోతాయి. కోట్లాది రూపాయల ఖరీదైన పంటలకు తీవ్ర నష్టం తెచ్చిపెడుతోంది. ఇక ఆస్తి నష్టం కూడా అదే రేంజ్‌లో వాటిల్లుతోంది.
34,000 people affected as #AssamFlood worsens and incessant rain continues
— Ritam English (@EnglishRitam) June 17, 2023
Total 34,189 people, comprising 14, 675 women & 3,787 children reeling under the impact of the deluge#Assam #Flood #AssamRain #FloodUpdate #AssamFloods #Guwahati #GuwahatiFlood pic.twitter.com/oOKd4cg2L1
Comments
Please login to add a commentAdd a comment