lakhimpur
-
బీజేపీ ఎమ్మెల్యేను చెంపదెబ్బ కొట్టిన న్యాయవాది.. వీడియో వైరల్
లక్నో: ఉత్తరప్రదేశ్‌లో ఓ ఎమ్మెల్యేపై జరిగిన దాడి సర్వత్రా చర్చనీయాంశమైంది. లఖింపూర్‌లో బీజేపీ ఎమ్మెల్యే యోగేష్ వర్మ చెంప చెళ్లుమనించాడు ఓ న్యాయవాది చెంపపై న్యాయవాది కొట్టాడు. పోలీసుల సమక్షంలోనే ఈ సంఘటన జరగ్గా. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.అసలేం జరిగిందంటే.. అక్టోబర్ 14న అర్బన్ కోఆపరేటివ్ బ్యాంక్ మేనేజ్మెంట్ కమిటీ ఎన్నికలు జరుగనున్నాయి. అయితే ఓటర్ల జాబితాను తారుమారు చేశారని, కొంత మంది సభ్యులను జాబితా నుంచి తొలగించినట్లు ఆరోపణలు వచ్చాయి. ఈ నేపథ్యంలో ఎన్నికలను వాయిదా వేయాలని బీజేపీ జిల్లా అధ్యక్షుడు సునీల్‌సింగ్, ఎమ్మెల్యే యోగేష్ వర్మ డిమాండ్ చేశారు. బుధవారం అదనపు జిల్లా మేజిస్ట్రేట్ (ఏడీఎం)కు వినతి పత్రం సమర్పించారు. కానీ షెడ్యూల్ ప్రకారమే ఎన్నికలు జరుగుతాయని అదనపు జిల్లా మేజిస్ట్రేట్ (ఏడీఎం) సంజయ్ సింగ్ ధృవీకరించారు.అయితే, కలెక్టర్ కార్యాలయం నుంచి తిరిగి వెళ్తున్న బీజేపీ ఎమ్మెల్యే యోగేష్ వర్మపై స్థానిక బార్ అసోసియేషన్ అధ్యక్షుడు, న్యాయవాది అవధేష్ సింగ్ దాడికి ప్రయత్నించాడు. పోలీసులు అడ్డుకున్నప్పటికీ ఎమ్మెల్యే చెంపపై ఆయన కొట్టాడు. అంతేగాక సింగ్ మద్దతుదారులు, మరికొంతమంది న్యాయవాదులు కూడా ఎమ్మెల్యేపై చేయిచేసుకున్నారు. ఎమ్మెల్యే తిరిగి ప్రతి దాడికి ప్రయత్నించినప్పటికీ పోలీసులు అడ్డుకున్నారు. ఈ సందర్భంగా ఇరు వర్గాల మధ్య ఘర్షణ జరిగింది. అనంతరం పోలీసులు పరిస్థితిని అదుపు చేశారు. ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.Uttar Pradesh: In Lakhimpur, tensions flared during the Urban Cooperative Bank election as Sadar MLA Yogesh Verma and Bar Association President Avadhesh Singh clashed pic.twitter.com/qF9mFi5Mps— IANS (@ians_india) October 9, 2024 -
అసోంలో భారీ వర్షాలు.. 11 జిల్లాలను ముంచెత్తిన వరదలు..
వర్షాకాలం పూర్తిగా మొదలు కాకముందే అసోం రాష్ట్రాన్ని భారీ వర్షాలు వణికిస్తున్నాయి. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలు 11 జిల్లాలను ముంచెత్తాయి. దీని కారణంగా 34 వేల మంది ప్రభావితులయ్యారు. నదులు పొంగి ప్రవహిస్తుండటంతో అసోంలో ఈ ఏడాది తొలి వరదలు నమోదయ్యాయి. అసోం స్టేట్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీ(ASDMA) ప్రకారం బ్రహ్మపుత్రతోపాటు పలు నదులు నీటిమట్టం పెరుగుతుండటంతో వరద నీరు వందలాది గ్రామాలను ముంచెత్తింది. అయితే ఏ నది ప్రమాదకర స్థాయికి మించి ప్రవహించడం లేదని పేర్కొంది. అసోం అంతటా 209.67 హెక్టార్ల పంట ప్రాంతాలు దెబ్బతిన్నాయని తెలిపింది. వరదల వల్ల బిశ్వనాథ్, దర్రాంగ్, ధేమాజీ, దిబ్రూగఢ్, లఖింపూర్, తముల్పూర్, ఉదల్గురి జిల్లాలు ప్రభావితమయ్యాయయని.. 34 వేలమందిని సురక్షిత ప్రాంతాలకు తరలించినట్లు అధికారులు తెలిపారు. వీరిలో 4, 675 మంది మహిళలు, 3,787 మంది చిన్నారులు ఉన్నట్లు పేర్కొన్నారు. చదవండి: బీజేపీ శవపేటికకు చివరి మేకు అదే..కేంద్రానికి స్టాలిన్ హెచ్చరికలు.. లఖింపూర్‌లో అత్యధికంగా 23,516 మంది ప్రభావితమయ్యారు, దిబ్రూగర్‌లో 3,857 మంది, దర్రాంగ్‌లో 2231 మంది, బిశ్వనాథ్‌లో 2231 మంది, ధేమాజీలో 1,085 మంది ఉన్నారు. వరదల బారిన పడిన లఖింపూర్‌లో ఎనిమిది, ఉదల్గురిలో రెండు మొత్తం 11 సహాయ పంపిణీ కేంద్రాలను ఏర్పాటు చేశారు. మొత్తంగా 77 గ్రామాలు వరదల వల్ల ప్రభావితమయ్యాయి. లఖింపూర్, ఉదల్గురిలో రెండు చొప్పున నాలుగు చెరువుల కట్టలు తెగిపోయాయి. బిస్వనాథ్, బొంగైగావ్, దిబ్రూఘర్, గోలాఘాట్, జోర్హాట్, కర్బీ అంగ్లాంగ్ వెస్ట్, లఖింపూర్, మోరిగావ్, నల్బరీ, సోనిత్పూర్, తముల్పూర్ ఉదల్గురి జిల్లాల్లో రోడ్లు భారీ కోతకు గురయ్యాయని ఏఎస్డీఎమ్ఏ తెలిపింది. భారీ వర్షాల కారణంగా దిమా హసావో కమ్రూప్ జిల్లాల్లోని కొన్ని ప్రాంతాలలో కూడా కొండచరియలు విరిగిపడినట్లు పేర్కొంది. కాగా భారతదేశంలో ఎక్కువగా వరదలకు గురయ్యే రాష్ట్రాల్లో అస్సాం ఒకటి. ఈ రాష్ట్రానికి వరద సమస్య వార్షిక విపత్తుగా మారింది. అత్యధిక జనాభా కలిగిన ఈ ఈశాన్య రాష్ట్ర ప్రజలు భారీ వర్షాలు, వరదలతో ప్రతి వర్షాకాలం ప్రభావితం అవుతుంటారు. వేలాది మంది ప్రజలను నిరాశ్రయులవుతారు. అనేక జంతువులు ప్రాణాలు కోల్పోతాయి. కోట్లాది రూపాయల ఖరీదైన పంటలకు తీవ్ర నష్టం తెచ్చిపెడుతోంది. ఇక ఆస్తి నష్టం కూడా అదే రేంజ్లో వాటిల్లుతోంది. 34,000 people affected as #AssamFlood worsens and incessant rain continues Total 34,189 people, comprising 14, 675 women & 3,787 children reeling under the impact of the deluge#Assam #Flood #AssamRain #FloodUpdate #AssamFloods #Guwahati #GuwahatiFlood pic.twitter.com/oOKd4cg2L1 — Ritam English (@EnglishRitam) June 17, 2023 -
లఖీంపూర్ ఖేరి కేసు విచారణకు ఐదేళ్లు పడుతుంది
న్యూఢిల్లీ: ఉత్తరప్రదేశ్‌లో అమాయకులైన రైతులు సహా ఎనిమిది మంది ప్రాణాలను బలిగొన్న లఖింపూర్ ఖేరి హింసా కాండ కేసు విచారణ పూర్తి కావడానికి దాదాపు అయిదేళ్లు పడుతుందని సుప్రీంకోర్టుకు సెషన్స్ కోర్టు విన్నవించింది. కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి అజయ్ మిశ్రా కుమారుడు ఆశిష్ మిశ్రా నిందితుడిగా ఉన్న ఈ కేసులో 208 మంది సాక్షులు, 171 డాక్యుమెంట్లు, 27 ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబరెటరీ (ఎఫ్ఎస్ఎల్) నివేదికలు ఉన్నాయని సెషన్స్ కోర్టు న్యాయమూర్తి సుప్రీంకోర్టుకి తెలిపారు. ఆశిశ్ మిగ్రా బెయిల్ విచారణ సందర్భంగా గత నెలలో ఈ కేసు విచారణ పూర్తి కావడానికి ఎన్ని రోజులు పడుతుందని సుప్రీం అడిగిన ప్రశ్నకు సెషన్స్ కోర్టు ఈ విధంగా బదులిచ్చింది. ఈ మేరకు జస్టిస్ సూర్యకాంత్, వి రామసుబ్రమణియన్‌లతో కూడిన ధర్మాసనం ఒక నివేదికను సుప్రీంకు సమర్పించింది. తదుపరి విచారణను జనవరి 19కి ధర్మాసనం వాయిదా వేసింది. కాగా అక్టోబర్ 3, 2021న నూతన వ్యవసాయం చట్టాలకు వ్యతిరేకంగా లఖింపూర్ ఖేరీ జిల్లాలో రైతులు నిరసన వ్యక్తం చేస్తున్నప్పుడు చెలరేగిన హింసాకాండలో ఎనిమిది మంది మరణించిని విషయం తెలిసిందే. చదవండి: ఆప్‌కు భారీ షాక్.. పదిరోజుల్లో 160 కోట్లు చెల్లించాల్సిందే, లేకుంటే ఆఫీస్‌కు సీజ్! -
లఖీంపూర్ కేసు: కేంద్ర మంత్రి కుమారుడిపై అభియోగాలు
లఖీంపూర్ ఖేరి: నలుగురు రైతులు సహా మొత్తం 8 మంది మృతికి కారణమైన లఖీంపూర్ ఖేరి సంఘటనలో నిందితులపై కోర్టులో విచారణకు రంగం సిద్ధమయ్యింది. ఈ కేసులో ప్రధాన నిందితుడు, కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి అజయ్‌కుమార్ మిశ్రా కుమారుడు ఆశిష్ మిశ్రాతోపాటు మరో 12 మంది నిందితులపై జిల్లా కోర్టు అభియోగాలు నమోదు చేసింది. హత్య, నేరపూరిత కుట్ర, సంబంధిత సెక్షన్ల కింద అభియాగాలు మోపింది. నిందితులపై ఐపీసీ సెక్షన్లు 147, 148(అల్లర్లు), 149(చట్టవిరుద్ధంగా గుమికూడడం), 302(హత్య), 307(హత్యాయత్నం), 326(ఆయుధాలతో గాయపర్చడం), 427, 120బీతోపాటు మోటార్ వాహన చట్టంలోని 177 కింద అదనపు జిల్లా జడ్జి సునీల్‌కుమార్ వర్మ అభియోగాలు నమోదు చేశారు. తదుపరి విచారణను ఈ నెల 16వ తేదీకి వాయిదా వేశారు. 13 మంది నిందితులు ప్రస్తుతం జైలులో ఉన్నారు. బెయిల్‌పై బయట ఉన్న 14వ నిందితుడు వీరేంద్ర శుక్లాపై ఐపీసీ సెక్షన్ 201 అభియోగాలు నమోదయ్యాయి. ఆశిష్ మిశ్రాతోపాటు కొందరు నిందితులపై ఆయుధాల చట్టంలోని పలు సెక్షన్ల కింద అభియోగాలు మోపారు. 2021 అక్టోబర్ 3న ఉత్తరప్రదేశ్‌లోని లఖీంపూర్ ఖేరిలో రోడ్డుపై ధర్నా చేస్తున్న రైతులపైకి వాహనం దూసుకెళ్లిన సంగతి తెలిసిందే. ఈ ఘటనలో నలుగురు రైతులు మరణించారు. అనంతరం రైతుల దాడిలో ఒక డ్రైవర్, ఇద్దరు బీజేపీ కార్యకర్తలు, ఒక జర్నలిస్టు మరణించారు. రైతులపైకి దూసుకెళ్లిన వాహనంలో ఆశిష్ మిశ్రా ఉన్నాడని ఉత్తరప్రదేశ్ పోలీసులు ఎఫ్ఐఆర్లో పేర్కొన్నారు. ఇదీ చదవండి: మళ్లీ సరిహద్దు రగడ -
సీఎం కావాలా.. రెండవ కిమ్ కావాలా?
లఖింపూర్: ముఖ్యమంత్రి కావాలో, రెండవ కిమ్ జాంగ్ ఉన్ కావాలో తేల్చుకోవాలని ఉత్తరప్రదేశ్ ప్రజలకు రైతు నాయకుడు రాకేష్ టికాయిత్ సూచించారు. యూపీ అసెంబ్లీ ఎన్నికల్లో అధికార బీజేపీ వ్యతిరేకంగా ఆయన విమర్శలు ఎక్కుపెడుతున్నారు. ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్, ప్రధాని నరేంద్ర మోదీని లక్ష్యంగా చేసుకుని ఆయన విమర్శలు చేస్తున్నారు. ‘యూపీ ప్రజలు తమ ఓట్లను తెలివిగా వినియోగించుకోవాలి. ముఖ్యమంత్రి, ప్రధానమంత్రి లాంటి ప్రజాప్రతినిధులు కావాలో.. రెండవ కిమ్ జాంగ్ ఉన్(ఉత్తర కొరియా అధినేత) కావాలో తేల్చుకోవాలని కోరుతున్నాం. ఏ రాష్ట్రంలోనూ నియంతృత్వ ప్రభుత్వం మనకు వద్ద’ని టికాయిత్ అన్నారు. తన స్వస్థలమైన ముజఫర్‌నగర్‌లో బీజేపీ విభజన రాజకీయాలు చేస్తోందని గత వారం ఆయన మండిపడ్డారు. అయితే విద్వేష రాజకీయాలను ప్రజలు సహించరని హెచ్చరించారు. ‘అభివృద్ధి గురించి మాట్లాడాలని పశ్చిమ యూపీ ప్రజలు కోరుకుంటున్నారు. హిందూ, ముస్లిం, జిన్నా, మతం పేరుతో రెచ్చగొట్టేవారికి ఓట్లు పడవు. ముజఫర్‌నగర్ హిందూ-ముస్లిం మ్యాచ్‌లకు స్టేడియం కాద’ని టికాయిత్ ట్వీట్ చేశారు. రైతులకు మేలు చేసే వారికే యూపీ ప్రజలు పట్టం కడతారన్న ఆశాభావాన్ని ఆయన వ్యక్తం చేశారు. పాకిస్తాన్, జిన్నా గురించి మాత్రమే కాకుండా తమ సమస్యల గురించి మాట్లాడేవారికి ప్రజలు అనుకూలంగా ఉంటారని ‘పీటీఐ’తో అన్నారు. మోదీ సర్కారు తెచ్చిన మూడు వ్యవసాయ వివాదాస్పద చట్టాలను వెనక్కు తీసుకునేలా ఉద్యమించడంలో టికాయిత్ ముందంజలో నిలిచిన సంగతి తెలిసిందే. (క్లిక్: పంజాబ్ లో చేదు అనుభవం.. మరోసారి గుర్తు చేసుకున్న మోదీ) -
మరణావస్థలో కాంగ్రెస్!: సిద్ధూ
చండీగఢ్: కాంగ్రెస్‌ను తనదైన శైలిలో ఇబ్బందులు పెడుతున్న నవజోత్‌సింగ్ సిద్దూ మరోమారు గళం విప్పారు. యూపీలో జరిగిన రైతు మరణాలకు సంబంధించి ఆయన మొహాలి నుంచి లఖిమ్‌పూర్‌కు యాత్ర చేపట్టారు. దీని ఆరంభానికి ముందు పంజాబ్ సీఎం రాక ఆలస్యం కావడంతో ఆయన అసహనంగా కనిపించారు. దీంతో సిద్ధూను కేబినెట్‌మంత్రి పర్గాత్ సింగ్ శాంతింపజేయడానికి ప్రయతి్నస్తున్న వీడియో ఒకటి మీడియాలో ప్రత్యక్షమైంది. సీఎం త్వరలో వస్తారని పర్గాత్ చెప్పడం, ఈ యాత్ర విజయవంతమవుతుందని కాంగ్రెస్ పంజాబ్ సీడబ్లు్యసీ చీఫ్ సుఖ్విందర్ సింగ్ సముదాయించడం వీడియోలో కనిపించింది. వీరి మాటలకు సిద్ధూ స్పందిస్తూ ‘‘విజయం ఎక్కడ? నాకు పగ్గాలు అప్పజెప్పిఉంటే మీకు విజయం కనిపించేది. ఇప్పుడు కాంగ్రెస్ మృతావస్థలో ఉంది.’’ అని ఆగ్రహం వ్యక్తం చేయడం కూడా కనిపించింది. సీఎం మార్పునకు నిరసనగా కాంగ్రెస్ పంజాబ్ అధ్యక్ష పదవికి రాజీనామా చేసిన సిద్ధూ అనంతరం అధిష్టానం బుజ్జగింపుతో మెత్తబడ్డట్లు కనిపించారు. అయితే ఆయన రాజీనామాను అధికారికంగా ఉపసంహరించుకోలేదు. ఆయనలో అసంతృప్తి చల్లారలేదని తాజా వ్యాఖ్యలు చూపుతున్నాయి. సిద్ధూకు దళితులపై గౌరవం లేదని, కేవలం ఎన్నికల కోసం కుల రాజకీయాలు చేస్తున్నారని ప్రతిపక్ష అకాలీదళ్ విమర్శించింది. కాంగ్రెస్ సమస్యలకు తక్షణ పరిష్కారాలు దొరకవు! న్యూఢిల్లీ: కాంగ్రెస్ పార్టీ సమస్యల పరిష్కారానికి తక్షణ మార్గాల్లేవని ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ అభిప్రాయపడ్డారు. లఖీమ్‌పూర్ ఘటనతో పార్టీకి తక్షణ పునర్వైభవం వస్తుందని ఆశించేవారు నిరాశ పడకతప్పదంటూ ట్వీట్ చేశారు. కాంగ్రెస్‌లో చేరడానికి ప్రశాంత్ తయారవుతున్నారన్న ఊహాగానాల నడుమ ఆయన తాజా ట్వీట్ అందరినీ ఆకర్షిస్తోంది. జీఓపీ(గ్రాండ్ ఓల్డ్ పార్టీ– కాంగ్రెస్) వెనువెంటనే పునర్వికాసం చెందేందుకు లఖీమ్‌పూర్ ఘటన ఉపయోగపడుతుందని చాలామంది ఆశిస్తున్నారని, వీరంతా త్వరలో అతిపెద్ద నిరాశను ఎదుర్కొంటారని వ్యాఖ్యానించారు. కాంగ్రెస్‌లో ప్రశాంత్ చేరికను కొందరు వ్యతిరేకిస్తున్నారు. తాజా ట్వీట్‌తో తనకు, పార్టీ నాయకత్వంతో విభేదాలున్నట్లు ప్రశాంత్ పరోక్షంగా చెప్పినట్లు రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. -
అయ్యో.. చికెన్ గొడవ ఎంతపని చేసింది!
డిస్పూర్: ఇంట్లో భర్త మాంసాహరం వండించడంతో గొడవపడ్డ అనంతరం కొత్తజంట ఆత్మహత్య చేసుకున్న ఘటన మంగళవారం అస్సాంలోని లఖింపూర్ జిల్లాలో చోటుచేసుకుంది. భార్యభర్తలను ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తుండగా భార్య మృతి చెందింది. భర్త పరిస్థితి విషమంగా ఉన్నట్లు ఇసానగర్ పోలీసులు తెలిపారు. పోలీసుల సమాచారం ప్రకారం.. ‘లఖింపూర్‌కు చెందిన గురు దయాళ్(22), రేష్మా(19)ను జూన్ 19న వివాహం చేసుకున్నాడు. రేష్మా వెజిటేరియన్ కావడంతో తన భర్త సోమవారం చికెన్ తీసుకువచ్చి తల్లికి వండమని ఇచ్చాడు. అది చూసిన రేష్మా ఇంట్లో చికెన్ వండటానికి వీలు లేదని, బయట వండుకొమ్మని భర్తకు చెప్పింది. అయినా అతడు వినిపించుకోకుండా ఇంట్లోనే వండమని తన తల్లికి చెప్పాడు. (ఆన్లైన్ చదువు: స్మార్ట్ ఫోన్ లేదని.. ) దీంతో రేష్మా అతడిని నిలదీయడంతో ఇద్దరూ గొడవడ్డారు. అనంతరం రాత్రి ఇంట్లో విషం తాగి ఆత్మహత్యకు పాల్పడ్డారు. వారిని చూసిన గురుదయాళ్ తండ్రి శివనాథ్ ఇద్దరిని ఆసుపత్రికి తరలించగా చికిత్స పోందుతూ రేష్మా మరణించింది. ప్రస్తుతం గురుదయాళ్ పరిస్థితి విషయంగా ఉందని పోలీసులు తెలిపారు. ఇసానగర్ పోలీస్టేషన్ హౌజ్ ఆఫీసర్ సునిల్ సింగ్ మాట్లాడుతూ... రేష్మాకు, గురుదయాళ్‌కు ఇటీవల వివాహం జరిగిందని చెప్పారు. సోమవారం రాత్రి ఇంట్లో నాన్‌వెజ్ వండొద్దని గొడవ పడిన అనంతరం భార్యభర్తలిద్దరూ ఆత్మహత్యకు పాల్పడ్డారు. వీరిని ఆసుపత్రికి తరలించగా భార్య రేష్మా మృతిచెందగా.. భర్త గురుదయాళ్ పరిస్థితి విషమంగా ఉందని పేర్కొన్నారు. కాగా ఈ ఘటనపై ఎలాంటి ఎఫ్ఐఆర్ నమోదు చేయలేదని, గురుదయాళ్ ఆరోగ్యం మెరుగుపడ్డాక అతడి స్టేట్మెంట్ తీసుకున్నాకే కేసు నమోదు చేస్తామని ఆయన చెప్పారు. -
భర్త తలతో పోలీస్ స్టేషన్‌కు వెళ్లింది
డిస్పూర్ : ఏళ్లుగా భర్త చేతిలో హింసకు గురయ్యంది. ఇక భరించే ఓపిక నశించి.. ఎదురు తిరిగింది. భర్తను చంపి.. అతని తలను తీసుకుని పోలీస్ స్టేషన్‌కు వెళ్లి లొంగి పోయింది. వివరాలు.. అస్సాం లఖింపూర్ జిల్లాకు చెందిన గుణేశ్వరి బర్కతకి(48) భర్త ముధిరం(55). వీరికి ఐదుగురు కొడుకులు, ముగ్గురు కూతుళ్లు. పైళ్లైన నాటి నుంచి భర్త.. గుణేశ్వరిని చిత్ర హింసలకు గురి చేస్తుండేవాడు. తిట్టడం, కొట్టడమే కాక కత్తి, గొడ్డలి వంటి మారణాయుధాలతో కూడా దాడి చేసేవాడు. ఇన్నాళ్లు భర్త ఆగడాలను భరించిన గుణేశ్వరికి.. ఓపిక నశించింది. దాంతో భర్త మీద కత్తితో దాడి చేసి చంపేసింది. అనంతరం అతని తలను వేరు చేసి.. ఓ ప్లాస్టిక్ కవర్లో వేసుకుని.. ఐదు కిలోమీటర్ల దూరంలో ఉన్న పోలీసు స్టేషన్‌కు వెళ్లి లొంగిపోయింది. ఈ సందర్భంగా గుణేశ్వరి మాట్లాడుతూ.. ‘ఏళ్లుగా నా భర్త నన్ను శారీరకంగా, మానసింకంగా ఎంతో హింసించాడు. శుభకార్యలు, పండుగల సమయంలో బంధువులందరి ముందు నన్ను కొట్టేవాడు. ఇతన్ని వదిలేసి వెళ్దామనుకున్నాను. కానీ నా పిల్లల కోసం ఇన్నేళ్ల నుంచి నా భర్త హింసను భరిస్తూ వచ్చాను. ఈ రోజు కూడా తాగి వచ్చి నన్ను కొట్టాడు. ఒక వేళ నేను తిరగబడకపోతే.. నా భర్త చేతిలో నేనే చనిపోయేదాన్ని. అందుకే తెగించి ఎదురుతిరిగాను. సమయానికి చేతికి దొరికిన కత్తితో అతని మీద దాడి చేసి చంపేశాను’ అని తెలిపింది. ప్రస్తుతం పోలీసులు గుణేశ్వరి మీద కేసు నమోదు చేసి.. అరెస్ట్ చేశారు. -
స్ట్రెచర్ ఇవ్వకపోవడంతో పోలీసు మోసుకెళ్లాడు
లక్నో: ఆస్పత్రి అంటేనే వైద్య సహాయం కోసం వచ్చేవారిని తన అక్కున చేర్చుకుని అండగా నిలిచే దేవాలయం. అందులో సేవలందించేవారంతా దైవాలతో సమానం. కానీ ఉత్తరప్రదేశ్‌లోని లకీంపూర్లోగల ఓ ప్రభుత్వాస్పత్రి మాత్రం మొత్తం వైద్యాలయాలకే మచ్చ తెచ్చే పనిచేసింది. ఓ కామాంధుడి చేతిలో లైంగిక దాడికి గురై అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయిన బాధితురాలిని తరలించేందుకు స్ట్రెచర్ ఇచ్చేందుకు ఆస్పత్రి సిబ్బంది నిరాకరించారు. సాక్షాత్తు పోలీసు అధికారి చెప్పిన వారు ఆ మాట వినలేదు. కనీసం ఆమెను ముట్టుకునేందుకు కూడా సిబ్బంది నిరాకరించారు. దాంతో ఇక చేసేదిలేక స్వయంగా పోలీసు అధికారి మరో వ్యక్తి ఆ బాధితురాలి కాళ్లు చేతులు పట్టుకొని ఒక వార్డు నుంచి మరో వార్డుకు తరలించారు. ఆ సమయంలో ఆ బాలికకు తీవ్ర రక్తస్రావం అవుతోంది. పోలీసులకు బాధితురాలి తల్లిదండ్రులు తెలిపిన వివరాల ప్రకారం ఆ బాలిక తమ పొలాల్లోకి పనుల నిమిత్తం వెళ్లింది. ఆ సమయంలో గుర్తు తెలియని ఓ యువకుడు ఆమెపై పాశవిక లైంగికదాడికి పదేపదే పాల్పడ్డాడు. ఆ చర్యతో ఆ బాలిక స్పృహ కోల్పోయింది. ప్రస్తుతం కూడా ఆమె అపస్మారక స్థితిలోనే ఉంది. బాలిక స్పృహలోకి వస్తే గానీ ఈ దారుణానికి ఒడిగట్టినవారి వివరాలు తెలియవు. -
మహిళను కాల్చి చంపిన దుండగులు
ఉత్తరప్రదేశ్ లఖింపూర్ ప్రాంతంలో అగంతకులు రెచ్చిపోయారు. డబ్బుకోసం ఓ మహిళను కాల్చి చంపారు. లూటీ చేయడానికి వచ్చిన ముగ్గురు దుండగులు డబ్బును కాజేయడంతోపాటు, మహిళను కడతేర్చిన ఘటన ఫూల్ బెహర్ పోలీస్ స్టేషన్ పరిథిలో జరిగింది. రెండు లక్షల రూపాయలతో ప్రయాణిస్తున్న కుటుంబాన్ని వెంటాడిన సాయుధ దుండగులు అగ్గర్ ఖుర్ద్ గ్రామ సమీపంలో మహిళను కాల్చి చంపి వారివద్ద ఉన్న డబ్బును దోచుకు వెళ్ళినట్లు పోలీసులు తెలిపారు. 35ఏళ్ళ ఆర్తీ దేవి, ఆమె భర్త ఆశిష్ కుమార్ తమ రెండేళ్ళ కొడుకు, ఓ బంధువుతోపాటు ప్రయాణిస్తున్నారు. ఉన్నట్లుండి వచ్చిన ముగ్గురు గుర్తు తెలియని సాయుధ దుండగులు వారివద్ద ఉన్న డబ్బును లాక్కునేందుకు ప్రయత్నించారు. అయితే వచ్చిన ముగ్గురిలో ఒకరిని ఆర్తీ దేవి గుర్తించడంతో వెంటనే ఆమెను పిస్టల్ తో కాల్చి చంపి, డబ్బును లూటీ చేశారు. ఇటీవల తాము కొనుక్కున్న భూమిని రిజిస్ట్రేషన్ చేయించుకోవడం కోసం రెండు లక్షల రూపాయల డబ్బుతో పాటు తమ అత్తమామల వద్దకు బయల్దేరామని, అగ్గర్ ఖుర్ద్ గ్రామ సమీపంలోకి వచ్చేసరికి అగంతకులు డబ్బును లూటీ చేయడమే కాక తన భార్యను తుపాకీతో కాల్చి చంపారని కుమార్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కుమార్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశామని, దుండగుల జాడ తెలుసుకునేందుకు దర్యాప్తు ప్రారంభించామని డీఎస్పీ మనోజ్ కుమార్ తెలిపారు. -
అవినీతిపరులు, మోసకారులకే చోటు!
లఖీంపూర్ (యూపీ): ఎన్నికల్లో అన్ని పార్టీల నేతలు తమను తాము నిజాయతీపరులుగా, నికార్సైన వ్యక్తులుగా ప్రచారం చేసుకుంటుంటే ఓ పార్టీ మాత్రం ఇందుకు పూర్తి భిన్నంగా ప్రజల్లో ప్రచారం చేసుకుంటోంది. కేవలం అవినీతిపరులు, మోసకారులకే తమ పార్టీలో చోటిస్తామని పేర్కొంటూ అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. ఉత్తరప్రదేశ్‌లోని లఖీంపూర్‌కు చెందిన నరేశ్‌సింగ్ భదౌరియా (52) అనే వ్యక్తి ఖాస్ ఆద్మీ పార్టీ (ఖాప్) పేరిట ఈసారి లోక్‌సభ ఎన్నికల బరిలో అభ్యర్థులను నిలపనున్నాడు. ఇందుకోసం ప్రచారంలో భాగంగా శనివారం చేపట్టిన ర్యాలీలో అతను ప్రదర్శించిన బ్యానర్ చూపరులను అవాక్కయ్యేలా చేసింది. ‘‘కేవలం అవినీతిపరులు, కుట్రదారులు, మోసకారులు తదితరులే పార్టీ సభ్యత్వానికి అర్హులు. ఆమ్ ఆద్మీ పార్టీ మినహా మరే ఇతర పార్టీతోనైనా పొత్తుకు మేం సిద్ధమే’’ అంటూ బ్యానర్లో పొందుపరిచారు.