స్ట్రెచర్ ఇవ్వకపోవడంతో పోలీసు మోసుకెళ్లాడు | UP: Policeman carries rape victim after hospital denies stretcher | Sakshi
Sakshi News home page

స్ట్రెచర్ ఇవ్వకపోవడంతో పోలీసు మోసుకెళ్లాడు

Published Tue, Apr 5 2016 4:45 PM | Last Updated on Sat, Aug 25 2018 5:10 PM

స్ట్రెచర్ ఇవ్వకపోవడంతో పోలీసు మోసుకెళ్లాడు - Sakshi

స్ట్రెచర్ ఇవ్వకపోవడంతో పోలీసు మోసుకెళ్లాడు

లక్నో: ఆస్పత్రి అంటేనే వైద్య సహాయం కోసం వచ్చేవారిని తన అక్కున చేర్చుకుని అండగా నిలిచే దేవాలయం. అందులో సేవలందించేవారంతా దైవాలతో సమానం. కానీ ఉత్తరప్రదేశ్లోని లకీంపూర్లోగల ఓ ప్రభుత్వాస్పత్రి మాత్రం మొత్తం వైద్యాలయాలకే మచ్చ తెచ్చే పనిచేసింది. ఓ కామాంధుడి చేతిలో లైంగిక దాడికి గురై అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయిన బాధితురాలిని తరలించేందుకు స్ట్రెచర్ ఇచ్చేందుకు ఆస్పత్రి సిబ్బంది నిరాకరించారు.

సాక్షాత్తు పోలీసు అధికారి చెప్పిన వారు ఆ మాట వినలేదు. కనీసం ఆమెను ముట్టుకునేందుకు కూడా సిబ్బంది నిరాకరించారు. దాంతో ఇక చేసేదిలేక స్వయంగా పోలీసు అధికారి మరో వ్యక్తి ఆ బాధితురాలి కాళ్లు చేతులు పట్టుకొని ఒక వార్డు నుంచి మరో వార్డుకు తరలించారు. ఆ సమయంలో ఆ బాలికకు తీవ్ర రక్తస్రావం అవుతోంది.

పోలీసులకు బాధితురాలి తల్లిదండ్రులు తెలిపిన వివరాల ప్రకారం ఆ బాలిక తమ పొలాల్లోకి పనుల నిమిత్తం వెళ్లింది. ఆ సమయంలో గుర్తు తెలియని ఓ యువకుడు ఆమెపై పాశవిక లైంగికదాడికి పదేపదే పాల్పడ్డాడు. ఆ చర్యతో ఆ బాలిక స్పృహ కోల్పోయింది. ప్రస్తుతం కూడా ఆమె అపస్మారక స్థితిలోనే ఉంది. బాలిక స్పృహలోకి వస్తే గానీ ఈ దారుణానికి ఒడిగట్టినవారి వివరాలు తెలియవు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement