
డిస్పూర్ : ఏళ్లుగా భర్త చేతిలో హింసకు గురయ్యంది. ఇక భరించే ఓపిక నశించి.. ఎదురు తిరిగింది. భర్తను చంపి.. అతని తలను తీసుకుని పోలీస్ స్టేషన్‌కు వెళ్లి లొంగి పోయింది. వివరాలు.. అస్సాం లఖింపూర్ జిల్లాకు చెందిన గుణేశ్వరి బర్కతకి(48) భర్త ముధిరం(55). వీరికి ఐదుగురు కొడుకులు, ముగ్గురు కూతుళ్లు. పైళ్లైన నాటి నుంచి భర్త.. గుణేశ్వరిని చిత్ర హింసలకు గురి చేస్తుండేవాడు. తిట్టడం, కొట్టడమే కాక కత్తి, గొడ్డలి వంటి మారణాయుధాలతో కూడా దాడి చేసేవాడు. ఇన్నాళ్లు భర్త ఆగడాలను భరించిన గుణేశ్వరికి.. ఓపిక నశించింది. దాంతో భర్త మీద కత్తితో దాడి చేసి చంపేసింది. అనంతరం అతని తలను వేరు చేసి.. ఓ ప్లాస్టిక్ కవర్‌లో వేసుకుని.. ఐదు కిలోమీటర్ల దూరంలో ఉన్న పోలీసు స్టేషన్‌కు వెళ్లి లొంగిపోయింది.
ఈ సందర్భంగా గుణేశ్వరి మాట్లాడుతూ.. ‘ఏళ్లుగా నా భర్త నన్ను శారీరకంగా, మానసింకంగా ఎంతో హింసించాడు. శుభకార్యలు, పండుగల సమయంలో బంధువులందరి ముందు నన్ను కొట్టేవాడు. ఇతన్ని వదిలేసి వెళ్దామనుకున్నాను. కానీ నా పిల్లల కోసం ఇన్నేళ్ల నుంచి నా భర్త హింసను భరిస్తూ వచ్చాను. ఈ రోజు కూడా తాగి వచ్చి నన్ను కొట్టాడు. ఒక వేళ నేను తిరగబడకపోతే.. నా భర్త చేతిలో నేనే చనిపోయేదాన్ని. అందుకే తెగించి ఎదురుతిరిగాను. సమయానికి చేతికి దొరికిన కత్తితో అతని మీద దాడి చేసి చంపేశాను’ అని తెలిపింది. ప్రస్తుతం పోలీసులు గుణేశ్వరి మీద కేసు నమోదు చేసి.. అరెస్ట్ చేశారు.
Comments
Please login to add a commentAdd a comment