severed head
-
తలలేని మొండం.. 3 రోజులుగా పోలీసులకు ముచ్చెమటలు.. అయినా!
సాక్షి, దేవరకొండ/చింతపల్లి : నల్లగొండ జిల్లా చింతపల్లి మండల పరిధిలో ఇటీవల వెలుగుచూసిన మతిస్థిమితం లేని జహేందర్ హత్యోదంతం కేసు పోలీసులకు జటిలంగా మారింది. కిరాతకులు జహేందర్ తలను తెగ్గోసి మహంకాళి అమ్మవారి పాదాల వద్ద పెట్టి మొండెం ఆచూకీ లేకుండా చేసిన విషయం విదితమే. కాగా, గడిచిన మూడు రోజులుగా ప్రత్యేక పోలీసు బృందాలు తీవ్రంగా శ్రమిస్తున్నా బుధవారం నాటికి కూడా మొండెం ఆచూకీ లభ్యం కాలేదు. అయితే, హత్యోదంతం వెలుగుచూసిన నాటి నుంచి జహేందర్ తలను దేవరకొండ ప్రభుత్వ ఆస్పత్రిలో భద్రపరిచారు. మొండెం ఆచూకీ లభించేంత వరకు అతడి తలను కుటుంబ సభ్యుల కు ఇవ్వకూడదని, కొద్ది రోజుల క్రితం హైదరాబాద్ పరిసరాల్లో నల్లగొండ జిల్లా పీఏపల్లి మండలానికి చెందిన మాజీ నక్సలైట్ శ్రీనివాస్‌రెడ్డి దారుణ హత్యనే ఇందుకు ఉదాహరణ అని పోలీసు వర్గాలు పేర్కొంటున్నాయి. దీంతో బాధిత కుటుంబానికి జహేందర్ తల ఇవ్వలేక.. అతడి మొండేన్ని కనుకొనలేక ఆ శాఖ యంత్రాంగం తల పట్టుకుంది. చింతపల్లి : సిబ్బందికి సూచనలు చేస్తున్న ఎస్పీ 9 బృందాలు.. 170మంది పోలీసులు కిరాతకుల సవాల్‌ను చాలెంజ్‌గా తీసుకున్న పోలీస్ శాఖ ఉన్నతాధికారులు జహేందర్‌నాయక్ కేసును ఛేదించేందుకు తీవ్రంగానే శ్రమిస్తున్నారు. హతుడి మొండెం ఆచూకీ కనుగొనేందుకు 170మంది పోలీసులు తొమ్మిది బృందాలుగా విడిపోయి గాలిస్తున్నాయి. ఇబ్రంహీంపట్నం, తుర్కయాంజల్ మొదలుకుని చింతపల్లి మండల పరిసరప్రాంతాల్లోని చెట్టూపుట్ట వెతుకుతున్నా ఎలాంటి పురోగతి కనిపించలేదు. కాగా, గత శనివారం 10గంటల సమయంలో దేవరకొండ నుంచి శేరిపల్లి వెళ్లే దారి పక్కన నిలిపి ఉంచిన కారు ఎవరిదన్న కోణంలో కూడా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఇదిలా ఉంటే సంప్రదాయం ప్రకారం జహేందర్ అంత్యక్రియలు నిర్వహించుకుంటామని, అతడి మొండేన్ని కనుగొని పూర్తి మృతదేహాన్ని అప్పగించాలని బాధిత కుటుంబం పోలీసు అధికారులను వేడుకుంటోంది. త్వరలోనే ఛేదిస్తాం.. సహకరించండి జహేందర్ నాయక్ హత్య కేసును ఛేదించేందుకు తమకు సహకరించాలని ఎస్పీ రెమా రాజేశ్వరి బాధిత కుటుంబ సభ్యులను కోరారు. జహేందర్‌నాయక్ తల లభ్యమైన చింతపల్లి మండలం విరాట్‌నగర్ సమీపంలోని శ్రీ మెట్టు మహంకాళి దేవాలయాన్ని బుధవారం ఎస్పీ పరిశీలించారు. అనంతరం బాధిత కుటుంబ సభ్యులను విచారించారు. కేసు సంక్లిష్టంగా ఉందని, నిందితులు చిన్న క్లూ కూడా వదలేదు అన్నట్లు తెలిసింది. కేసు ఛేదనకు అనునిత్యం శ్రమిస్తున్నామని, మీకు ఎవరిమీదైనా అనుమానం ఉన్నా, గతంలో అనుకోని ఘటనలు జరిగి ఉంటే చెప్పాలని కోరినట్లు సమాచారం. ‘‘ఒకటి రెండు రోజుల్లో కేసును కొలిక్కి తెస్తామని.. సహకరించాలని ఎస్పీ కోరినట్లు తెలిసింది. ఎస్పీ వెంట సీసీఎస్ డీఎస్పీ మొగి లయ్య, నాంపల్లి సీఐ సత్యం, ఎస్ఐ వెంకటేశ్వర్లు ఉన్నారు. -
భర్త తలతో పోలీస్ స్టేషన్‌కు వెళ్లింది
డిస్పూర్ : ఏళ్లుగా భర్త చేతిలో హింసకు గురయ్యంది. ఇక భరించే ఓపిక నశించి.. ఎదురు తిరిగింది. భర్తను చంపి.. అతని తలను తీసుకుని పోలీస్ స్టేషన్‌కు వెళ్లి లొంగి పోయింది. వివరాలు.. అస్సాం లఖింపూర్ జిల్లాకు చెందిన గుణేశ్వరి బర్కతకి(48) భర్త ముధిరం(55). వీరికి ఐదుగురు కొడుకులు, ముగ్గురు కూతుళ్లు. పైళ్లైన నాటి నుంచి భర్త.. గుణేశ్వరిని చిత్ర హింసలకు గురి చేస్తుండేవాడు. తిట్టడం, కొట్టడమే కాక కత్తి, గొడ్డలి వంటి మారణాయుధాలతో కూడా దాడి చేసేవాడు. ఇన్నాళ్లు భర్త ఆగడాలను భరించిన గుణేశ్వరికి.. ఓపిక నశించింది. దాంతో భర్త మీద కత్తితో దాడి చేసి చంపేసింది. అనంతరం అతని తలను వేరు చేసి.. ఓ ప్లాస్టిక్ కవర్లో వేసుకుని.. ఐదు కిలోమీటర్ల దూరంలో ఉన్న పోలీసు స్టేషన్‌కు వెళ్లి లొంగిపోయింది. ఈ సందర్భంగా గుణేశ్వరి మాట్లాడుతూ.. ‘ఏళ్లుగా నా భర్త నన్ను శారీరకంగా, మానసింకంగా ఎంతో హింసించాడు. శుభకార్యలు, పండుగల సమయంలో బంధువులందరి ముందు నన్ను కొట్టేవాడు. ఇతన్ని వదిలేసి వెళ్దామనుకున్నాను. కానీ నా పిల్లల కోసం ఇన్నేళ్ల నుంచి నా భర్త హింసను భరిస్తూ వచ్చాను. ఈ రోజు కూడా తాగి వచ్చి నన్ను కొట్టాడు. ఒక వేళ నేను తిరగబడకపోతే.. నా భర్త చేతిలో నేనే చనిపోయేదాన్ని. అందుకే తెగించి ఎదురుతిరిగాను. సమయానికి చేతికి దొరికిన కత్తితో అతని మీద దాడి చేసి చంపేశాను’ అని తెలిపింది. ప్రస్తుతం పోలీసులు గుణేశ్వరి మీద కేసు నమోదు చేసి.. అరెస్ట్ చేశారు. -
శరీరాన్ని రెండు ముక్కలు చేసినా వదల్లేదు
టెక్సాస్ : పాము పగబడితే పగతీర్చుకునే వరకు వదిలి పెట్టదంటారు. మరి అది నిజమో కాదో తెలియదు కాని అచ్చం అలాంటి ఘటనే టెక్సాస్ నగరంలో చోటుచేసుకుంది. శరీరాన్ని రెండు ముక్కలుగా నరికినా వేరుపడిన తలతోనే వ్యక్తిని కాటేసిందో పాము. పాము కాటుకు గురైన ఆ వ్యక్తి చావుతో పోరాడి వైద్యుల పుణ్యమా అని బతికి బట్ట కట్టాడు. వివరాల్లోకి వెళితే.. టెక్సాస్ నగరానికి చెందిన మీలో, జెన్నీఫర్‌లు భార్యాభర్తలు. వాళ్లిద్దరూ ఇంటి పెరట్లో పని చేసుకుంటుండగా జెన్నీఫర్‌కు రాటిల్ స్నేక్ కంటపడింది. పామును చూసి భయపడ్డ ఆమె చేతిలో ఉన్న కత్తితో పామును రెండు ముక్కలుగా నరికింది. తర్వాత ఆ విషయాన్ని భర్త మీలోకి చెప్పింది. ముక్కలుగా నరికిన పాము చచ్చిందనుకున్న మీలో దాన్ని పడేయడానికి చేత్తో వేరుపడిన తల భాగాన్ని పట్టుకున్నాడు. కొన ఊపిరితో ఉన్న రాటిల్ స్నేక్ అమాంతం అతని చేతిపై కాటు వేసింది. దీంతో అస్వస్థతకు గురైన మీలోను జెన్నీఫర్ ఆస్పత్రికి తరలించింది. అప్పటికే విషం శరీరం మొత్తం వ్యాపించటంతో అతన్ని బతికించటానికి వైద్యులు తీవ్రంగా శ్రమించాల్సి వచ్చింది. జెన్నీఫర్ మాట్లాడుతూ.. ‘‘మామూలుగా పాము కాటుకు గురైన వ్యక్తికి రెండు నుంచి మూడు డోసుల యాంటీ వీనమ్ ఇస్తారు. కానీ మీలోకు మాత్రం ఏకంగా 26 డోసులు ఇవ్వాల్సి వచ్చింది. ఆయన ప్రాణాలకు ఎలాంటి ప్రమాదం లేదు. ప్రస్తుతం ఆయన కోలుకుంటున్నప్పటికీ కిడ్నీల పనితీరు కొద్దిగా బాగోలేద’’ని తెలిపింది. -
భార్య తలతో నడివీధిలో సంచారం
పుణె: కట్టుకున్నవాడే కాలయముడు కావడమంటే అక్షరాల ఇదేనేమో.. పుణెలో ఓ కిరాతక వృద్ధుడు ఓ చేతిలో గొడ్డలి, మరో చేతిలో నరికేసిన తన భార్య తల పట్టుకొని.. నడివీధిలో కాలయముడిలా నడుచుకుంటూపోయాడు. ఈ దృశ్యాన్ని చూసినవారికి దిగ్భ్రాంతితో సొమ్మసిల్లినంత పనైంది. వారు తేరుకునేలోపే ట్రాఫిక్ పోలీసులు ఈ వ్యక్తిని నిలువరించి అరెస్టు చేశారు. మహారాష్ట్రలోని పుణెలో శుక్రవారం ఉదయం జరిగిన ఈ ఘటన తాలుకు మొబైల్ వీడియో దృశ్యాలు దిగ్భ్రాంతికి గురిచేస్తున్నాయి. 60 ఏండ్ల రామచంద్ర చవన్ వాచ్‌మ్యాన్‌గా పనిచేస్తున్నాడు. తన భార్య (55) ఎవరితోనో అక్రమ సంబంధం కలిగివుందనే అనుమానంతో గొడ్డలితో ఆమె తలను నరికేశాడు. అంతేకాకుండా ధోతి, కుర్తా ధరించిన అతను భార్య తలను ఓ చేతిలో, గొడ్డలిని ఓ చేతిలో పట్టుకొని నడివీధిలో నడుచుకుంటు వెళ్లడం చూసినవారిని దిగ్భ్రాంత పరిచింది.