భార్య తలతో నడివీధిలో సంచారం | Man Seen Walking With Wife's Head on Pune Road | Sakshi
Sakshi News home page

భార్య తలతో నడివీధిలో సంచారం

Published Fri, Oct 9 2015 3:11 PM | Last Updated on Sat, Aug 11 2018 8:48 PM

భార్య తలతో నడివీధిలో సంచారం - Sakshi

భార్య తలతో నడివీధిలో సంచారం

పుణె: కట్టుకున్నవాడే కాలయముడు కావడమంటే అక్షరాల ఇదేనేమో.. పుణెలో ఓ కిరాతక వృద్ధుడు ఓ చేతిలో గొడ్డలి, మరో చేతిలో నరికేసిన తన భార్య తల పట్టుకొని.. నడివీధిలో కాలయముడిలా నడుచుకుంటూపోయాడు. ఈ దృశ్యాన్ని చూసినవారికి దిగ్భ్రాంతితో సొమ్మసిల్లినంత పనైంది. వారు తేరుకునేలోపే ట్రాఫిక్ పోలీసులు ఈ వ్యక్తిని నిలువరించి అరెస్టు చేశారు.

మహారాష్ట్రలోని పుణెలో శుక్రవారం ఉదయం జరిగిన ఈ ఘటన తాలుకు మొబైల్ వీడియో దృశ్యాలు దిగ్భ్రాంతికి గురిచేస్తున్నాయి. 60 ఏండ్ల రామచంద్ర చవన్ వాచ్మ్యాన్గా పనిచేస్తున్నాడు. తన భార్య (55)  ఎవరితోనో అక్రమ సంబంధం కలిగివుందనే అనుమానంతో గొడ్డలితో ఆమె తలను నరికేశాడు. అంతేకాకుండా ధోతి, కుర్తా ధరించిన అతను భార్య తలను ఓ చేతిలో, గొడ్డలిని ఓ చేతిలో పట్టుకొని నడివీధిలో నడుచుకుంటు వెళ్లడం చూసినవారిని దిగ్భ్రాంత పరిచింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement