భారతీయ ఆర్మీలోకి ప్రైవేట్‌ కంపెనీలు | Private Companies to Enter into Indian Army | Sakshi
Sakshi News home page

భారతీయ ఆర్మీలోకి ప్రైవేట్‌ కంపెనీలు

Published Tue, Jan 2 2018 3:15 PM | Last Updated on Tue, Jan 2 2018 3:15 PM

Private Companies to Enter into Indian Army - Sakshi

బెంగుళూరు : రక్షణ శాఖలోకి ప్రైవేటు కంపెనీల అడుగుపడబోతోంది. భారతీయ ఆర్మీకి చెందిన ఆర్మీ బేస్‌ వర్క్‌షాపు(ఏబీడబ్ల్యూ)లను నిర్వహించేందుకు చేసేందుకు ప్రైవేటు కంపెనీలకు రక్షణ శాఖ అనుమతి ఇచ్చింది. దేశంలోని ఆరు రాష్ట్రాల్లో గల ఎనిమిది నగరాల్లోని ఏబీడబ్ల్యూలను ప్రవేటు కంపెనీలు నడపనున్నాయి.

‘ప్రభుత్వ ఆస్తిని కాంట్రాక్టర్‌ నిర్వహించే మోడల్‌’ కింద రక్షణ శాఖ దీన్ని ఆమోదించింది. ఈ మోడల్‌లో ప్రైవేటు కంపెనీలు రక్షణ శాఖలో ఎలాంటి పెట్టుబడులు పెట్టవు. కానీ, కంపెనీలకు కావలసిన భూమి, వస్తువులు, మెషీన్లు తదితర వనరులను ప్రభుత్వమే సమకూర్చుతుంది. 

నిపుణుల కమిటీ(సీఓఈ) సూచనలతోనే రక్షణ శాఖ ఈ నిర్ణయాన్ని తీసుకున్నట్లు తెలిసింది. ఆర్మీ సామర్ధ్యాన్ని పెంచడం, రక్షణ శాఖ వ్యయాన్ని అదుపులో ఉంచడం తదితరాలను దృష్టిలో పెట్టుకుని సీఓఈ ఈ సూచనలు చేసినట్లు సమాచారం. ఎల్లప్పుడూ యుద్ధం కోసం ఆయుధాలను సిద్ధంగా ఉంచేందుకు ఏబీడబ్ల్యూలను రెండో ప్రపంచయుద్ధం సమయంలో ఆరంభించారు.

ఆర్డినెన్స్‌ ఫ్యాక్టరీలు ఓ వైపు ఆయుధాలను పర్యవేక్షించేందుకు ఉన్నా.. భారతీయ ఆర్మీ ఎన్నడూ దానిపై ఆధారపడలేదు. ఢిల్లీ, కోల్‌కతా, పుణె, బెంగుళూరు తదితర కీలక నగరాల్లో ఏబీడబ్ల్యూలు ఉన్నాయి.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement