private firms
-
ప్రైవేట్ సంస్థల్లో వారికి 100 శాతం రిజర్వేషన్లు..కర్ణాటక కేబినెట్ గ్రీన్ సిగ్నల్
బెంగళూరు: కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ప్రైవేట్ సంస్థల్లో గ్రూప్ సీ,గ్రూప్ డీ పోస్టుల్లో కన్నడిగులకు (కన్నడ ప్రజలు) 100 శాతం రిజర్వేషన్ కల్పిస్తూ జారీ చేసిన బిల్లును కేబినెట్ ఆమోదం తెలిపింది.సోమవారం (జులై 15)న జరిగిన కేబినెట్ సమావేశంలో కన్నడిగులకు 100 శాతం రిజర్వేషన్లు కల్పించే అంశంపై చర్చ జరిగింది. ఆ భేటీ తర్వాత రిజర్వేషన్ బిల్లుపై కేబినెట్ సభ్యులు ఆమోదం తెలిపారు’ అని సిద్ధరామయ్య ఎక్స్ వేదికగా ట్వీట్ చేశారు. ರಾಜ್ಯದ ಎಲ್ಲಾ ಖಾಸಗಿ ಕೈಗಾರಿಕೆಗಳಲ್ಲಿ "ಸಿ ಮತ್ತು ಡಿ" ದರ್ಜೆಯ ಹುದ್ದೆಗಳಿಗೆ ನೂರಕ್ಕೆ ನೂರರಷ್ಟು ಕನ್ನಡಿಗರ ನೇಮಕಾತಿಯನ್ನು ಕಡ್ಡಾಯಗೊಳಿಸುವ ವಿಧೇಯಕಕ್ಕೆ ನಿನ್ನೆ ನಡೆದ ಸಚಿವ ಸಂಪುಟ ಸಭೆಯು ಒಪ್ಪಿಗೆ ನೀಡಿದೆ.ಕನ್ನಡಿಗರು ಕನ್ನಡದ ನೆಲದಲ್ಲಿ ಉದ್ಯೋಗ ವಂಚಿತರಾಗುವುದನ್ನು ತಪ್ಪಿಸಿ, ತಾಯ್ನಾಡಿನಲ್ಲಿ ನೆಮ್ಮದಿಯ ಬದುಕು ಕಟ್ಟಿಕೊಳ್ಳಲು… pic.twitter.com/UwvsJtrT2q— Siddaramaiah (@siddaramaiah) July 16, 2024తమ ప్రభుత్వం కన్నడ ప్రజలు సుఖవంతమైన జీవితాన్ని గడపడానికి అవకాశం కల్పించాలని, వారికి అన్నీ రంగాల్లో ఉద్యోగ అవకాశాలు కల్పించడమే తమ ప్రభుత్వ ఆకాంక్ష అని అన్నారు. తమది కన్నడ అనుకూల ప్రభుత్వమని, కన్నడిగుల సంక్షేమమే మా ప్రాధాన్యత అని ముఖ్యమంత్రి అన్నారు.ఈ బిల్లును గురువారం అసెంబ్లీలో ప్రవేశపెట్టనున్నట్లు న్యాయశాఖ వర్గాలు తెలిపాయి. -
భారతీయ ఆర్మీలోకి ప్రైవేట్ కంపెనీలు
బెంగుళూరు : రక్షణ శాఖలోకి ప్రైవేటు కంపెనీల అడుగుపడబోతోంది. భారతీయ ఆర్మీకి చెందిన ఆర్మీ బేస్ వర్క్షాపు(ఏబీడబ్ల్యూ)లను నిర్వహించేందుకు చేసేందుకు ప్రైవేటు కంపెనీలకు రక్షణ శాఖ అనుమతి ఇచ్చింది. దేశంలోని ఆరు రాష్ట్రాల్లో గల ఎనిమిది నగరాల్లోని ఏబీడబ్ల్యూలను ప్రవేటు కంపెనీలు నడపనున్నాయి. ‘ప్రభుత్వ ఆస్తిని కాంట్రాక్టర్ నిర్వహించే మోడల్’ కింద రక్షణ శాఖ దీన్ని ఆమోదించింది. ఈ మోడల్లో ప్రైవేటు కంపెనీలు రక్షణ శాఖలో ఎలాంటి పెట్టుబడులు పెట్టవు. కానీ, కంపెనీలకు కావలసిన భూమి, వస్తువులు, మెషీన్లు తదితర వనరులను ప్రభుత్వమే సమకూర్చుతుంది. నిపుణుల కమిటీ(సీఓఈ) సూచనలతోనే రక్షణ శాఖ ఈ నిర్ణయాన్ని తీసుకున్నట్లు తెలిసింది. ఆర్మీ సామర్ధ్యాన్ని పెంచడం, రక్షణ శాఖ వ్యయాన్ని అదుపులో ఉంచడం తదితరాలను దృష్టిలో పెట్టుకుని సీఓఈ ఈ సూచనలు చేసినట్లు సమాచారం. ఎల్లప్పుడూ యుద్ధం కోసం ఆయుధాలను సిద్ధంగా ఉంచేందుకు ఏబీడబ్ల్యూలను రెండో ప్రపంచయుద్ధం సమయంలో ఆరంభించారు. ఆర్డినెన్స్ ఫ్యాక్టరీలు ఓ వైపు ఆయుధాలను పర్యవేక్షించేందుకు ఉన్నా.. భారతీయ ఆర్మీ ఎన్నడూ దానిపై ఆధారపడలేదు. ఢిల్లీ, కోల్కతా, పుణె, బెంగుళూరు తదితర కీలక నగరాల్లో ఏబీడబ్ల్యూలు ఉన్నాయి. -
ఆ సంస్థల్లో పనిచేసే మహిళలకు ఒత్తిడి ఎక్కువ
న్యూయార్క్: ప్రైవేటు సంస్థల్లో పని చేసే ఎవరికైనా పనిలో ఒత్తిడి సర్వసాధారణం. ముఖ్యంగా ఒక పక్కన ఇంటిని, పిల్లలను చక్కబెట్టుకుంటూ మరో పక్క వృత్తి బాధ్యతలు నిర్వహించే మహిళలపై సహజంగానే ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది. వీటితో పాటు ఆడవాళ్లు ఒత్తిడికి లోనవడానికి మరో కొత్త కారణాన్ని వెల్లడించారు న్యూయార్క్ పరిశోధకులు. పురుషాధిక్యంతో నడిచే సంస్థలు, వృత్తుల్లో పనిచేసే మహిళలు తీవ్ర స్థాయిలో ఒత్తిడికి లోనవుతున్నారని తెలిపారు. ఇది వారి ఆరోగ్యంపై తీవ్ర ప్రభావాన్ని చూపుతోందని అన్నారు. ఏళ్ల తరబడి ఇదే పరిస్థితుల్లో పనిచేయడం వల్ల చివరికి వాళ్ల మనసులో తాము బలహీనులమని భావించే రుగ్మతకు లోనవుతున్నారని ‘ఇండియన్ యూనివర్సిటీ’కి చెందిన మనాగో చెప్పారు. 85 శాతం కంటే ఎక్కువ మంది పురుషులు సహోద్యులుగా ఉన్న సంస్థల్లో పనిచేసే స్త్రీలు ఇలాంటి సమస్యలు ఎదుర్కొంటున్నారని అంచనా వేస్తున్నారు. ఇలాంటి వాతావరణంలో పనిచేసే మహిళలు.. ఒంటిరితనం, పనితీరు, లైంగిక వేధింపులు, చిన్నచూపు చూడటం, తగిన ప్రోత్సాహం లేకపోవడం.. వంటి సవాళ్లను ఎదుర్కొంటున్నారని అన్నారు.