బెంగళూరు: కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ప్రైవేట్ సంస్థల్లో గ్రూప్ సీ,గ్రూప్ డీ పోస్టుల్లో కన్నడిగులకు (కన్నడ ప్రజలు) 100 శాతం రిజర్వేషన్ కల్పిస్తూ జారీ చేసిన బిల్లును కేబినెట్ ఆమోదం తెలిపింది.
సోమవారం (జులై 15)న జరిగిన కేబినెట్ సమావేశంలో కన్నడిగులకు 100 శాతం రిజర్వేషన్లు కల్పించే అంశంపై చర్చ జరిగింది. ఆ భేటీ తర్వాత రిజర్వేషన్ బిల్లుపై కేబినెట్ సభ్యులు ఆమోదం తెలిపారు’ అని సిద్ధరామయ్య ఎక్స్ వేదికగా ట్వీట్ చేశారు.
ರಾಜ್ಯದ ಎಲ್ಲಾ ಖಾಸಗಿ ಕೈಗಾರಿಕೆಗಳಲ್ಲಿ "ಸಿ ಮತ್ತು ಡಿ" ದರ್ಜೆಯ ಹುದ್ದೆಗಳಿಗೆ ನೂರಕ್ಕೆ ನೂರರಷ್ಟು ಕನ್ನಡಿಗರ ನೇಮಕಾತಿಯನ್ನು ಕಡ್ಡಾಯಗೊಳಿಸುವ ವಿಧೇಯಕಕ್ಕೆ ನಿನ್ನೆ ನಡೆದ ಸಚಿವ ಸಂಪುಟ ಸಭೆಯು ಒಪ್ಪಿಗೆ ನೀಡಿದೆ.
ಕನ್ನಡಿಗರು ಕನ್ನಡದ ನೆಲದಲ್ಲಿ ಉದ್ಯೋಗ ವಂಚಿತರಾಗುವುದನ್ನು ತಪ್ಪಿಸಿ, ತಾಯ್ನಾಡಿನಲ್ಲಿ ನೆಮ್ಮದಿಯ ಬದುಕು ಕಟ್ಟಿಕೊಳ್ಳಲು… pic.twitter.com/UwvsJtrT2q— Siddaramaiah (@siddaramaiah) July 16, 2024
తమ ప్రభుత్వం కన్నడ ప్రజలు సుఖవంతమైన జీవితాన్ని గడపడానికి అవకాశం కల్పించాలని, వారికి అన్నీ రంగాల్లో ఉద్యోగ అవకాశాలు కల్పించడమే తమ ప్రభుత్వ ఆకాంక్ష అని అన్నారు. తమది కన్నడ అనుకూల ప్రభుత్వమని, కన్నడిగుల సంక్షేమమే మా ప్రాధాన్యత అని ముఖ్యమంత్రి అన్నారు.ఈ బిల్లును గురువారం అసెంబ్లీలో ప్రవేశపెట్టనున్నట్లు న్యాయశాఖ వర్గాలు తెలిపాయి.
Comments
Please login to add a commentAdd a comment