Kannadigas
-
కన్నడనాట స్థానిక రగడ!
సాక్షి బెంగళూరు: కర్నాటకలో మరోసారి స్థానిక, స్థానికేతర రగడ రాజుకుంది. రాష్ట్రంలో ప్రైవేట్ ఉద్యోగాల్లో కూడా స్థానికులకే ప్రాధాన్యమిస్తూ రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ఇందుకు కారణమైంది. రాష్ట్రంలోని పరిశ్రమలు, ఫ్యాక్టరీలు, ఇతర ప్రైవేటు సంస్థలన్నింట్లోనూ కన్నడిగులకు రిజర్వేషన్ కలి్పంచాలని ప్రభుత్వం తీర్మానించింది. ప్రైవేట్ రంగంలో మేనేజ్మెంట్ స్థాయి ఉద్యోగాల్లో 50 శాతం, నాన్ మేనేజ్మెంట్లో 75 శాతం ఉద్యోగాలు స్థానికులకే రిజర్వు చేయాలని నిర్ణయించింది. ఈ మేరకు రూపొందించిన ఉద్యోగ బిల్లు–2024కు కేబినెట్ సోమవారం ఆమోదముద్ర వేసింది. నిబంధనలను ఉల్లంఘిస్తే రూ 25 వేల దాకా జరిమానా కూడా విధిస్తారు. అంతేగాక గ్రూప్ సి, డి తరహా చిరుద్యోగాల్లో ప్రైవేట్ కంపెనీలు విధిగా నూటికి నూరు శాతం స్థానికులనే తీసుకోవాలని ముఖ్యమంత్రి సిద్ధరామయ్య కుండబద్దలు కొట్టారు. ఈ మేరకు చట్టం చేసేందుకు వీలుగా ఒకట్రెండు రోజుల్లో బిల్లును అసెంబ్లీలో ప్రవేశపెట్టేందుకు కూడా ప్రభుత్వం సిద్ధమైంది. కానీ ఐటీ తదితర పరిశ్రమలు, ప్రైవేటు రంగ సంస్థల నుంచి తీవ్రమైన వ్యతిరేకత వెల్లువెత్తుతుండటంతో ప్రస్తుతానికి దీనిపై వెనకడుగు వేసింది. బిల్లును పక్కన పెడుతున్నామని, మరింత అధ్యయనం చేస్తామని సీఎం కార్యాలయం బుధవారం ప్రకటించింది. ఇదీ నేపథ్యం... కర్నాటకవ్యాప్తంగా ప్రైవేటు ఉద్యోగాల్లో ఉత్తరాది వారికే ఎక్కువ అవకాశాలు దక్కుతున్నాయంటూ కొన్నాళ్లుగా కర్నాటకలో ఆందోళనలు జరుగుతున్నాయి. స్థానిక వనరులు, మౌలిక వసతులు ఉపయోగించుకుంటున్న ప్రైవేటు సంస్థలు, పరిశ్రమలు అందుకు తగ్గట్టుగా స్థానికులకే ఉద్యోగాలివ్వాలన్న డిమాండ్ పెరుగుతోంది. ఈ నేపథ్యంలోనే ప్రభుత్వం ఉద్యోగాల బిల్లుకు రూపకల్పన చేసింది. 100 % స్థానికులకేనంటూ సిద్ధు పోస్టుబిల్లుకు మంత్రివర్గ ఆమోదం అనంతరం మంగళవారం సీఎం సిద్ధరామయ్య ఎక్స్‌లో పెట్టిన పోస్టు వివాదానికి దారితీసింది. ‘‘మాది కన్నడ ప్రభుత్వం. కన్నడిగుల భద్రత, సంక్షేమానికి పాటుపడటమే మా బాధ్యత. కానీ కన్నడిగులు కన్నడనాడులోనే ఉద్యోగాలు పొందడంలో వెనకబడుతున్నారు. దీన్ని నివారించేందుకు ఈ బిల్లు ద్వారా అవకాశం కల్పిస్తున్నాం. ఇకపై రాష్ట్రంలో అన్ని ప్రైవేటు రంగ పరిశ్రమలు, కర్మాగారాల్లో గ్రూప్ సి, డి ఉద్యోగాలు వంద శాతం కన్నడిగులకే ఇవ్వాల్సిందే’’ అని పోస్టులో సిద్ధు పేర్కొన్నారు. తీవ్ర విమర్శలు రావడంతో దాన్ని తొలగించారు.తీవ్ర వ్యతిరేకతసిద్ధు సర్కారు నిర్ణయాన్ని కర్ణాటకలోని ప్రైవేటు రంగ సంస్థలు, పరిశ్రమలు ము ఖ్యంగా ఐటీ తదితర కంపెనీలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. పారిశ్రామిక దిగ్గజం, బయోకాన్ చీఫ్ కిరణ్ మజుందార్ షా దీనిపై తీవ్ర అభ్యంతరాలు తెలుపుతూ ఎక్స్‌లో పోస్ట్ చేశారు. టెక్ కంపెనీలకు స్థానికత కంటే ప్రతిభే ముఖ్యమని స్పష్టం చేశారు. ఈ బిల్లుతో కంపెనీలు కర్నాటకకు రావాలంటే భయపడే పరిస్థితి తలెత్తుతుందని సాఫ్ట్వేర్ పరిశ్రమల జాతీయ సంఘం నాస్కామ్ విమర్శించింది. దీన్ని తక్షణం వెనక్కు తీసుకోవాలని డిమాండ్ చేసింది. ఇది వివక్షా పూరితమైన బిల్లంటూ ఇన్ఫోసిస్ మాజీ సీఎఫ్ఓ మోహన్ దాస్ పాయ్ విమర్శించారు. ‘‘ఇది రాజ్యాంగవిరుద్ధం. టెక్ రంగానికి గొడ్డలిపెట్టు వంటి ఈ ఫాసిస్టు బిల్లును వెంటనే వెనక్కు తీసుకోవాలి’’ అని డిమాండ్ చేశారు. అసోచామ్ కర్నాటక సహధ్యక్షుడు ఆర్కే మిశ్రా తదితరులు కూడా ఇది దూరదృష్టి లేని బిల్లంటూ తీవ్రంగా తప్పుబట్టారు. విపక్ష బీజేపీ కూడా బిల్లును తీవ్రంగా తప్పుబట్టింది. కర్నాటకలో కన్నడిగుల స్వాభిమానాన్ని కాపాడేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం కట్టుబడి ఉంది. కన్నడ నేమ్ప్లేట్లు, కన్నడ ధ్వజం, భాష, సంస్కృతి, పరంపర విషయంలో వెనుకంజ ఉండదు. రాష్ట్రంలో ప్రైవేటు ఉద్యోగాల్లో కన్నడిగులకు రిజర్వేషన్ కలి్పస్తూ బిల్లు తేవడం అందులో భాగమే– బిల్లును తాత్కాలికంగా పక్కన పెట్టిన అనంతరం కర్నాటక ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ వ్యాఖ్యలు -
‘100 శాతం ఉద్యోగాలు కన్నడిగులకే’.. పోస్టు డిలీట్ చేసిన సీఎం
ప్రైవేటు రంగంలో స్థానికులకు రిజర్వేషన్ తప్పనిసారి చేస్తూ కర్ణాటకలోని సిద్దరామయ్య ప్రభుత్వం కొత్త బిల్లును ఆమోదించింది. అయితే కేబినెట్ ఆమోదించిన ఈ బిల్లుపై కర్ణాటక సీఎం సిద్దరామయ్య ఎక్స్‌లో ఓ పోస్టు చేశారు. ఆయన ట్వీట్ ప్రకారం.. రాష్ట్రంలోని అన్ని ప్రైవేటు పరిశ్రమల్లోని గ్రూప్ సీ, డీ గ్రేడ్ ఉద్యోగాల్లో వంద శాతం కన్నడిగుల నియామకాన్ని తప్పనిసరి చేస్తూ రూపొందించిన బిల్లును రాష్ట్ర మంత్రివర్గం సోమవారం ఆమోదించిందని సీఎం పేర్కొన్నారు.కన్నడిగులు తమ రాష్ట్రంలో సంతోషంగా జీవించేందుకు అవకాశం కల్పించాలన్నదే తమ ప్రభుత్వ ఉద్ధేశ్యమని సీఎం పేర్కొన్నారు. సొంత రాష్ట్రంలో ఉద్యోగానికి వారు దూరం కాకూడదని తెలిపారు. కన్నడిగుల సంక్షేమమే తమ తొలి ప్రాధాన్యతగా చెప్పుకొచ్చారు. అయితే పోస్టుపై అనేక విమర్శలు వెల్లువెత్తడంతో.. తరువాత ఆయన దానిని డిలీట్ చేశారు. అనంతరం మళ్లీ సరిచేసి ట్వీట్ చేశారు.ರಾಜ್ಯದ ಖಾಸಗಿ ಕೈಗಾರಿಕೆಗಳು ಹಾಗೂ ಇತರೆ ಸಂಸ್ಥೆಗಳಲ್ಲಿ ಕನ್ನಡಿಗರಿಗೆ ಆಡಳಿತಾತ್ಮಕ ಹುದ್ದೆಗಳಿಗೆ ಶೇ.50 ಹಾಗೂ ಆಡಳಿತಾತ್ಮಕವಲ್ಲದ ಹುದ್ದೆಗಳಿಗೆ ಶೇ.75 ಮೀಸಲಾತಿ ನಿಗದಿಪಡಿಸುವ ವಿಧೇಯಕಕ್ಕೆ ಸೋಮವಾರ ನಡೆದ ಸಚಿವ ಸಂಪುಟ ಸಭೆಯು ಒಪ್ಪಿಗೆ ನೀಡಿದೆ.ಕನ್ನಡಿಗರು ಕನ್ನಡದ ನೆಲದಲ್ಲಿ ಉದ್ಯೋಗ ವಂಚಿತರಾಗುವುದನ್ನು ತಪ್ಪಿಸಿ, ತಾಯ್ನಾಡಿನಲ್ಲಿ… pic.twitter.com/Rz6a0vNCBz— Siddaramaiah (@siddaramaiah) July 17, 2024 తాజాగా దీనిపై మంత్రి క్లారిటీ ఇచ్చారు. ఈ బిల్లు ప్రకారం రాష్ట్రంలోని ప్రైవేటు కంపెనీల్లోని నాన్ మెనేజ్మెంట్ ఉద్యోగాల్లో స్థానికులకు (కన్నడిగులకు) 70 శాతం.. మేనేజ్మెంట్ ఉద్యోగాల్లో 50 శాతం స్థానికులకు రిజర్వేషన్ అమలు చేయనున్నట్లు రాష్ట్ర కార్మికశాఖ మంత్రి సంతోష్ లాడ్ పేర్కొన్నారు. అయితే బిల్లులో గ్రూప్ సీ, డీ పోస్టుల్లో మొత్తం 100 శాతం స్థానికులకే కేటాయిస్తున్నట్లు ఎక్కడా ప్రస్తావించలేదని తెలిపారు.అదే విధంగా ఉద్యోగానికి అర్హతలు, నైపుణ్యం ఉన్న స్థానికులు లేకపోతే.. కంపెనీలు.. ఇతర రాష్ట్రాల వారిని నియమించుకోవచ్చిని పేర్కొన్నారు. ‘ఉద్యోగానికి తగిన నైపుణ్యాలు కలిగిన కన్నడిగులలో లేకపోతే వాటిని అవుట్సోర్సింగ్ ఇవ్వవచ్చు. నైపుణ్యం కలిగిన కార్మికులలను వెలికి తీసీ..స్థానికులకు ప్రాధాన్యత ఇచ్చే చట్టం తీసుకురావడానికి ప్రభుత్వం ప్రయత్నిస్తోంది’ అని పేర్కొన్నారు. అయితే రాష్ట్రంలో ప్రతిభకు కొదవలేదని మంత్రి వెల్లడించారు. "కర్ణాటకలో తగినంత నైపుణ్యం కలిగిన వర్క్‌ఫోర్స్ ఉందని.. చాలా ఇంజినీరింగ్ కాలేజీలు, మెడికల్ కాలేజీలు, ఇంటర్నేషనల్ స్కూల్స్ ఉన్నాయన్నారు. కన్నడిగులకు 70 శాతం పని ఇవ్వాలని తాము కంపెనీలను అడుగుతున్నామని ఒకవేళ ఇక్కడ తగిన ప్రతిభ లేకపోతే బయట నుంచి తీసుకోవచ్చని అన్నారు.అయితే కాంగ్రెస్ ప్రభుత్వ నిర్ణయాన్ని పలువురు పారిశ్రామిక వేత్తలు తప్పుబడుతున్నారు. ఈ బిల్లు వల్ల అనేకమంది ప్రతిభ, నైపుణ్యం కలిగిన కార్మికులు అందుబాటులో ఉండకపోవచ్చనే అభిప్రాయాన్ని వ్యక్త పరుస్తున్నారు. కర్ణాటకలో ఐటీ సహా ప్రైవేటు సంస్థలు, పరిశ్రమలు, కర్మాగారాల్లో ఇక ఇతర రాష్ట్రాలవారికి ఉద్యోగాలు తగ్గిపోయే అవకాశాలు కనిపిస్తున్నాయని చెబుతున్నారు.ఈ బిల్లు వివక్షాపూరితమైనది, తిరోగమనపూరితమైనది, ఫాసిస్ట్ బిల్లు అంటూ మణిపాల్ గ్లోబల్ ఎడ్యుకేషన్ సర్వీసెస్ ఛైర్మన్ మోహన్‌దాస్ పాయ్ ఎక్స్‌లో అన్నారు. మరోవైపు బయోకాన్ ఎగ్జిక్యూటివ్ చైర్పర్సన్ కిరణ్ మజుందార్-షా ప్రభుత్వ ప్రతిపాదనను స్వాగతిస్తూనే.. స్థానికులకు ఉద్యోగాలు ఇవ్వడం మంచిదే అని, కానీ నైపుణ్యం ఉన్న వారిని ఇతరులను ప్రమాదం ఉందని హెచ్చరించారు.ఎవరు స్థానికులు?కర్ణాటకలో జన్మించినవారు.. 15 ఏళ్లుగా ఆ రాష్ట్రంలోనే నివసిస్తున్నవారు.. కన్నడ భాషలో మాట్లాడే, చదివే, రాసే నైపుణ్యం ఉండి.. రాష్ట్ర నోడల్ ఏజెన్సీ నిర్వహించే అర్హత పరీక్షలో నెగ్గినవారిని స్థానిక అభ్యర్థిగా పరిగణిస్తారు. కన్నడం ఓ భాషగా ఉన్న ఎస్‌ఎ్‌ససీ సర్టిఫికెట్‌ను ఉద్యోగార్థులు కలిగి ఉండాలి. లేదంటే ప్రభుత్వ నోడల్ ఏజెన్సీ నిర్వహించే కన్నడ ప్రావీణ్య పరీక్షలో పాసవ్వాలి. అర్హతలున్న స్థానిక అభ్యర్థులు దొరక్కపోతే.. చట్ట నిబంధనల సడలింపునకు ప్రైవేటు పరిశ్రమలు, సంస్థలు ప్రభుత్వానికి దరఖాస్తు చేసుకోవాలి. తగు విచారణ తర్వాత ప్రభుత్వం సముచిత ఉత్తర్వులు జారీచేస్తుంది. -
ప్రైవేట్ సంస్థల్లో వారికి 100 శాతం రిజర్వేషన్లు..కర్ణాటక కేబినెట్ గ్రీన్ సిగ్నల్
బెంగళూరు: కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ప్రైవేట్ సంస్థల్లో గ్రూప్ సీ,గ్రూప్ డీ పోస్టుల్లో కన్నడిగులకు (కన్నడ ప్రజలు) 100 శాతం రిజర్వేషన్ కల్పిస్తూ జారీ చేసిన బిల్లును కేబినెట్ ఆమోదం తెలిపింది.సోమవారం (జులై 15)న జరిగిన కేబినెట్ సమావేశంలో కన్నడిగులకు 100 శాతం రిజర్వేషన్లు కల్పించే అంశంపై చర్చ జరిగింది. ఆ భేటీ తర్వాత రిజర్వేషన్ బిల్లుపై కేబినెట్ సభ్యులు ఆమోదం తెలిపారు’ అని సిద్ధరామయ్య ఎక్స్ వేదికగా ట్వీట్ చేశారు. ರಾಜ್ಯದ ಎಲ್ಲಾ ಖಾಸಗಿ ಕೈಗಾರಿಕೆಗಳಲ್ಲಿ "ಸಿ ಮತ್ತು ಡಿ" ದರ್ಜೆಯ ಹುದ್ದೆಗಳಿಗೆ ನೂರಕ್ಕೆ ನೂರರಷ್ಟು ಕನ್ನಡಿಗರ ನೇಮಕಾತಿಯನ್ನು ಕಡ್ಡಾಯಗೊಳಿಸುವ ವಿಧೇಯಕಕ್ಕೆ ನಿನ್ನೆ ನಡೆದ ಸಚಿವ ಸಂಪುಟ ಸಭೆಯು ಒಪ್ಪಿಗೆ ನೀಡಿದೆ.ಕನ್ನಡಿಗರು ಕನ್ನಡದ ನೆಲದಲ್ಲಿ ಉದ್ಯೋಗ ವಂಚಿತರಾಗುವುದನ್ನು ತಪ್ಪಿಸಿ, ತಾಯ್ನಾಡಿನಲ್ಲಿ ನೆಮ್ಮದಿಯ ಬದುಕು ಕಟ್ಟಿಕೊಳ್ಳಲು… pic.twitter.com/UwvsJtrT2q— Siddaramaiah (@siddaramaiah) July 16, 2024తమ ప్రభుత్వం కన్నడ ప్రజలు సుఖవంతమైన జీవితాన్ని గడపడానికి అవకాశం కల్పించాలని, వారికి అన్నీ రంగాల్లో ఉద్యోగ అవకాశాలు కల్పించడమే తమ ప్రభుత్వ ఆకాంక్ష అని అన్నారు. తమది కన్నడ అనుకూల ప్రభుత్వమని, కన్నడిగుల సంక్షేమమే మా ప్రాధాన్యత అని ముఖ్యమంత్రి అన్నారు.ఈ బిల్లును గురువారం అసెంబ్లీలో ప్రవేశపెట్టనున్నట్లు న్యాయశాఖ వర్గాలు తెలిపాయి. -
కోహ్లీ-గంభీర్ గొడవకు రాజకీయ రంగు.. బుద్ధిచెబుతామంటున్న కన్నడిగులు!
బెంగళూరు: సోమవారం జరిగిన బెంగళూరు రాయల్ ఛాలెంజర్స్, లక్నో సూపర్ జియంట్స్ మ్యాచ్ అనంతరం విరాట్ కోహ్లీ, గౌతం గంభీర్ మధ్య తీవ్ర వాగ్వాదం చెలరేగిన విషయం తెలిసిందే. ఇందుకు సంబంధించిన వీడియోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారాయి. ఈ ఇద్దరి తీరుపట్ల బీసీసీఐ అసంతృప్తి వ్యక్తం చేసి మ్యాచ్ ఫీజులో 100 శాతం జరిమానా కూడా విధించింది. అయితే ఇద్దరిలో తప్పు ఎవరిదనే విషయంపై సోషల్ మీడియాలో జోరుగా చర్చ జరుగుతోంది. ఇప్పుడిది కర్ణాటకలో రాజకీయ రంగు కూడా పులుముకుంది. అయితే ఈ విషయంలో కింగ్ విరాట్ కోహ్లీకి కన్నడిగులు, ముఖ్యంగా కాంగ్రెస్ శ్రేణులు తమ మద్దతు తెలిపారు. బీజేపీ ఎంపీ కూడా అయిన లక్నో టీం మెంటార్ గౌతం గంభీర్.. కన్నడిగుల గర్వం అయిన కోహ్లీని బెదిరించాడని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ విషయంలో కర్ణాటక ప్రజలు ఎన్నికల్లో బుద్ది చెప్పేందుకు సిద్ధంగా ఉన్నారని, మే 13న ఫలితాలు దీన్ని నిరూపిస్తాయని ట్వీట్లు చేస్తున్నారు. A BJP MP threatening Kannadigas pride RCB’s Virat Kohli. The People of Karnataka are ready to teach them a lesson on 13th May.pic.twitter.com/RqMpNijZGj — Shantanu (@shaandelhite) May 1, 2023 (చదవండి: నేను రాహుల్ అభిమానిని.. కాంగ్రెస్ ర్యాలీలో కన్నడ సూపర్‌స్టార్ శివ రాజ్‌కుమార్) కాంగ్రెస్ సీనియర్ నేత, కర్ణాటక మాజీ సీఎం సిద్ధరామయ్య కూడా ఈ విషయంపై స్పందించారు. ఈసారి కచ్చితంగా ఆర్సీబీ ఐపీఎల్ కప్పు గెలుస్తుందని, ఎన్నికల్లో కాంగ్రెస్ విజయం సాధిస్తుందని జోస్యం చెప్పారు. ఓ జాతీయ వార్తా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈమేరకు మాట్లాడారు. RCB will win & Congress will also win 🔥 BJP MP Gambhir 🤡 pic.twitter.com/qvK1yt33kc — Srivatsa (@srivatsayb) May 2, 2023 కాగా.. లక్నోతో జరిగిన మ్యాచ్‌లో ఆర్సీబీ ఘన విజయం సాధించిన విజయం సాధించిన విషయం తెలిసిందే. ఈ లో స్కోరింగ్ మ్యాచ్‌లో మొదట బ్యాటింగ్ చేసిన బెంగళూరు 126 పరుగులే చేసింది. అయితే బౌలింగ్‌లో అద్భుతంగా రాణించి లక్నోను 108 పరుగులకే ఆలౌట్ చేసింది. ఫలితంగా హోం గ్రౌండ్ బెంగళూరులో తమను ఓడించిన లక్నోను సొంత మైదానంలో ఓడించి ప్రతీకారం తీర్చుకుంది. చదవండి: పీసీసీ చీఫ్ హెలికాప్టర్‌ను ఢీకొట్టిన పక్షి.. ఎమర్జెన్సీ ల్యాండింగ్.. అద్దం పగిలి.. -
ఆర్సీబీ జట్టుపై సిద్ధరామయ్య ఎమోషనల్ ట్వీట్.. కన్నడిగులు ఫిదా..
బెంగళూరు: ఐపీఎల్లో తమ తొలి మ్యాచ్‌లో ముంబైపై ఆర్సీబీ ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే. అయితే ఈ మ్యాచ్ అనంతరం కర్ణాటక మాజీ సీఎం, ప్రతిపక్షనేత సిద్ధరామయ్య చేసిన ట్వీట్ కన్నడిగుల మనసులు దోచుకుంది. ఆర్సీబీ తన అభిమాన జట్టు అని, ఈ టీంను చూస్తే తనకు గర్వంగా ఉంటుందని సిద్ధరామయ్య అన్నారు. ఆర్సీబీ జట్టుకు నాలాగే కోట్ల మంది అభిమానులున్నారు. ఈసారి మనం కచ్చితంగా ఐపీఎల్ కప్పు గెలుస్తామని నాకు బలమైన విశ్వాసం ఉంది. ఒక కన్నడిగగా.. నా మద్దతు ఎప్పుడూ ఆర్సీబీకే ఉంటుంది' అని సిద్ధ రామయ్య ట్వీట్ చేశారు. ఈ మ్యాచ్‌ను ఆయన స్టేడియంకు వెళ్లి స్వయంగా వీక్షించి ఆద్యంతం ఎంజాయ్ చేస్తూ కన్పించారు. ఆయనతో పాటు మరో ఇద్దరు కాంగ్రెస్ నేతలు కూడా మ్యాచ్‌ను తిలకించారు. ಕ್ರಿಕೆಟ್ ನನ್ನ ಇಷ್ಟದ ಆಟ, ಆರ್ಸಿಬಿ ನನ್ನ ಹೆಮ್ಮೆಯ ತಂಡ.. ನನ್ನಂತಹ ಕೋಟ್ಯಂತರ ಅಭಿಮಾನಿಗಳ ಹಾರೈಕೆ ಆರ್.ಸಿ.ಬಿ ಹುಡುಗರ ಜೊತೆಗಿದೆ.. ಇಂದಲ್ಲ ನಾಳೆ ನಮ್ಮವರೂ ಕಪ್ ಗೆಲ್ಲುತ್ತಾರೆ ಎಂಬ ವಿಶ್ವಾಸ ನನಗಿದೆ. ಓರ್ವ ಕನ್ನಡಿಗನಾಗಿ ನನ್ನ ಬೆಂಬಲ ಯಾವಾಗಲೂ ನಮ್ಮ ಆರ್ಸಿಬಿಗೆ.@RCBTweets #RCBvMI pic.twitter.com/KgCOrbsNle — Siddaramaiah (@siddaramaiah) April 2, 2023 ఆర్సీబీ జట్టుకు కోట్ల మంది అభిమానులున్నారు. అయితే ఇప్పటివరకు ఒక్కసారి కూడా ఈ టీం ఐపీఎల్ ట్రోఫీ గెలవలేకపోవడం వారిని నిరుత్సాహపరిచే ఏకైక విషయం. మొత్తం 15 సీజన్లలో మూడు సార్లు ఫైనల్ చేరిన ఆర్సీబీ.. ఒక్కసారి కూడా ట్రోఫీని ముద్దాడలేకపోయింది. 2009, 2011, 2016 సీజన్లలో రన్నరప్‌గా నిలిచి సరిపెట్టుకుంది. చదవండి: కోహ్లి దెబ్బకు ఆర్చర్‌కు చిప్ దొబ్బినట్లుంది! -
కన్నడిగుల కోసం సాహిత్య వేదిక
సాక్షి, హైదరాబాద్: గంగా జమునా తహెజీబ్‌కు ప్రతీకగా కొనసాగుతున్న హైదరాబాద్ జీవన విధానాన్ని నిలుపుకోవడానికి ఇతర రాష్ట్రాలు, ప్రాంతాల సాహిత్యం, సంస్కృతిని రాష్ట్ర ప్రభుత్వం గౌరవిస్తుందని ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు అన్నారు. హైదరాబాద్‌లో స్థిరనివాసం ఏర్పరుచుకుని దశాబ్దాలుగా జీవనం సాగిస్తున్న కన్నడ భాష మాట్లాడే కన్నడిగుల కోసం సాహిత్యవేదికను పునర్నిర్మాణం చేయాలని సీఎం నిర్ణయించారు. అందుకోసం రూ.5 కోట్లు మంజూరు చేశారు. హైదరాబాద్‌తోపాటు రాష్ట్రవ్యాప్తంగా నివసిస్తున్న కర్ణాటకవాసులు, అంబర్‌పేట ఎమ్మెల్యే కాలేరు వెంకటేశ్ విజ్ఞప్తికి ముఖ్యమంత్రి సానుకూలంగా స్పందించి ఈ నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు కాచిగూడలోని ‘కర్ణాటక సాహిత్య మందిరం’పునర్నిర్మాణం కోసం నిధులు మంజూరు చేస్తూ అధికారిక ఉత్తర్వులు జారీ అయ్యాయి. దానికి సంబంధించిన అనుమతిపత్రాలను ఎమ్మెల్యే కాలేరు వెంకటేశ్‌కు శుక్రవారం ప్రగతిభవన్‌లో అందచేశారు. సాహిత్య, సాంస్కృతిక కార్యక్రమాలతోపాటు కమ్యూనిటీ అవసరాల కోసం వినియోగించుకునేవిధంగా మౌలిక వసతులు ఏర్పాటు చేసి ఆడిటోరియాన్ని తీర్చిదిద్దాలని అధికారులు, ఎమ్మెల్యేకు సీఎం సూచించారు. నిధులు మంజూరు చేసినందుకు సీఎం కేసీఆర్‌కు ఎమ్మెల్యే వెంకటేశ్ కృతజ్ఞతలు తెలిపారు. -
అమర్నాథ్లో కన్నడిగులు క్షేమం: సీఎం
శివాజీనగర: జమ్ముకశ్మీర్‌లోని అమర్నాథ్ గుహ వద్ద ఆకస్మిక వరదలు సంభవించి పలువురు మరణించడం తెలిసిందే. దీంతో యాత్రను రద్దు చేశారు. అమర్నాథ్ పర్యటనలో వంద మందికి పైగా కన్నడిగులు ఉన్నారు. వారి రక్షణకు చర్యలు తీసుకున్నట్లు సీఎం బసవరాజ బొమ్మై, రెవెన్యూ మంత్రి అశోక్ తెలిపారు. శనివారం సీఎం మాట్లాడుతూ కన్నడిగులు అందరూ క్షేమమని, ఎలాంటి అవాంఛనీయాలు జరిగినట్లు సమాచారం రాలేదన్నారు. 15–20 మంది ఫోన్ చేసి తాము ఇబ్బందుల్లో ఉన్నట్లు చెప్పగా, అక్కడి అధికారులతో మాట్లాడి సాయం చేయాలని కోరామన్నారు. సహాయం అవసరమైతే సహాయవాణికి కాల్ చేయాలన్నారు. మైసూరు లాయర్లు సురక్షితం మైసూరు: అమర్నాథ్ వరద విపత్తు నుంచి మైసూరు నగరానికి చెందిన న్యాయవాదుల బృందం కొంచెంలో తప్పించుకుంది. వరదలో చిక్కుకున్న తమను సైనికులు కాపాడినట్లు తెలిపారు. మైసూరు తాలూకాలో మరటి క్యాతనహళ్లికి చెందిన ఎ.జె.సుధీర్, గుంగ్రాల్ శివరామ్, ఎస్.రఘు, మైసూరువాసి జి.కే.జోషి, హెబ్బాలవాసి కే.టి.విష్ణు. లోకేష్, తిలక్, ప్రదీప్‌కుమార్ తదితరులు జూలై నెల 4 వ తేదీన అమర్నాథ్లో పరమశివుని గుహ దర్శనం కోసం వేచి చూస్తున్నారు. అదే సమయంలో ఎగువన హిమాలయాల్లో ప్రచండమైన వరదలు రావడంతో గుహ వద్ద పెద్ద ప్రవాహం దూసుకొచ్చింది. కొండ చరియలు కూడాకొట్టుకొచ్చాయని తెలిపారు. ఇంతలో సైనికులు తమను సురక్షిత ప్రాంతానికి తీసుకెళ్లారని ఫోన్లో తెలిపారు. ఎన్డీఆర్ఎఫ్: 011–23438252, 011–23438253 కాశ్మీర్ హెల్ప్ లైన్: 0914–2496240 దేవాలయ పాలక మండలి సహాయవాణి:01914–2313149 కర్ణాటక కేంద్రం: 080–1070, 22340676 -
ఫలించిన సమన్వయ మంత్రం.. శ్రీశైలంలో సడలిన ఉద్రిక్త పరిస్థితులు
సాక్షి, శ్రీశైలం (కర్నూలు): బుధవారం అర్ధరాత్రి.. అందరూ నిద్రమత్తులో ఉన్న వేళ.. లక్షలాది మంది కన్నడిగులు.. రెచ్చగొట్టిన అల్లరి మూకలు.. ఏం జరుగుతుందో తెలుసుకునే లోపలే.. పలు దుకాణాలు ధ్వంసమయ్యాయి.. వాహనాల అద్దాలు పగిలిపోయాయి.. అలజడి విషయం తెలిసి అధికారులు వెంటనే స్పందించారు. సమన్వయంతో వ్యవహరించి పరిస్థితి అదుపులోకి తీసుకొచ్చారు. దీంతో శ్రీశైలంలో ఉద్రిక్త పరిస్థితులు వెంటనే తొలగిపోయాయి. ఏం జరిగిందంటే... బుధవారం అర్ధరాత్రి 12.30 గంటల సమయంలో పాతాళగంగ మార్గంలోని బీరప్ప సదన్ పక్కనే ఉన్న టీదుకాణం వద్ద నీళ్ల బాటిల్ విషయమై వివాదం చెలరేగింది. ఎక్కువ ధరకు విక్రయిస్తున్నారన్న విషయంపై దుకాణం యజమానితో కన్నడిగులు గొడవపడ్డారు. దుకాణ యజమాని భార్యను కొట్టే ప్రయత్నం చేశారు. దీంతో యజమాని పక్కనే ఉన్న గొడ్డలితో దాడికి దిగడంతో కన్నడిగులు రెచ్చిపోయారు. టీ దుకాణాన్ని ధ్వంసం చేసి, నిప్పంటించారు. అలాగే శివసదనం కూడలి వద్ద టైర్లను వేసి కాల్చారు. ఆ తర్వాత క్షేత్ర వ్యాప్తంగా అన్ని కూడళ్లు, పార్కులు, వివిధ ప్రదేశాలు, ప్రధాన పురవీధుల్లో ఉన్న కన్నడిగులందరినీ రెచ్చగొట్టారు. దీంతో వారంత ఏకమై ముందుగా పరిపాలనా భవన్రోడ్డులో ఉన్న దుకాణాలపై విరుచుకుపడి వాటిని ధ్వంసం చేశారు. ద్విచక్రవాహనాలు, కార్లు, జీపుల అద్దాలను పగులగొట్టారు. అక్కడ నుంచి పోస్టాఫీస్ రోడ్డు, పాతాళగంగ మార్గంలో మూసివేసిన దుకాణాలపై కూడా వారు ప్రతాపం చూపించారు. దుకాణ యజమానులు సైతం కన్నడిగులపై ఎదురుదాడికి పాల్పడ్డారు. దీంతో పరిస్థితి మరింత ఉద్రిక్త స్థాయికి చేరుకుంది. పోలీస్ సిబ్బందికి సూచనలు ఇస్తున్న డీఎస్పీ శృతి అధికారులు ఏం చేశారంటే.. విషయం తెలుసుకుని ఆత్మకూరు డీఎస్పీ శృతి, శ్రీశైల దేవస్థాన ఈఓ ఎస్ లవన్న, డిప్యుటేషన్‌పై వచ్చిన డీఎస్పీలు, సీఐలు, ఎస్ఐలు, పోలీసులు, స్పెషల్‌ఫోర్స్ సిబ్బంది వెంటనే స్పందించారు. సుమారు రెండు గంటలపాటు శ్రమించి అల్లరి మూకలను అదుపు చేశారు. ఇందుకోసం శ్రీశైలం జగద్గురు పీఠాధిపతి డాక్టర్ చెన్నసిద్దరామ శివాచార్యమహాస్వామి సహకారాన్ని తీసుకున్నారు. గుంపులుగా ఉన్న వారి వద్దకు వచ్చి కన్నడంలో ప్రశాంతంగా ఉండాలని పీఠాధిపతి ఆదేశించడంతో కన్నడిగులు శాంతించారు. దేవస్థానం చీఫ్ సెక్యూరిటీ ఆఫీసర్ నరసింహారెడ్డి ఆధ్వర్యంలో పనిచేస్తున్న ప్రైవేట్ సెక్యూరిటీ గార్డుల సహకారంతో డీఎస్పీ శృతి ప్రశాంత వాతావరణాన్ని ఏర్పరచారు. తమకు రక్షణ కరువైందని దుకాణ యజమానులు గురువారం సాయంత్రం 4 గంటల వరకు షాపులను తెరవలేదు. దీంతో ఎమ్మెల్యే శిల్పాచక్రపాణిరెడ్డి, డీఎస్పీ శృతి, ఈఓ లవన్న దుకాణదారులతో చర్చించారు. షాపులు తెరుచుకోవాల్సిందిగా సూచించి, ఎలాంటి ఇబ్బందులు ఏర్పడకుండా చూస్తామని హామీ ఇచ్చారు. దీంతో దుకాణాలను సాయంత్రం 5 గంటల నుంచి తెరిచారు. మాట్లాడుతున్న పీఠాధిపతి చదవండి: (రణరంగంగా మారిన శ్రీశైలం..) ఎస్పీ సమీక్ష శ్రీశైలంటెంపుల్: శ్రీశైలంలో పరిస్థితులపై ఎస్పీ సుధీర్‌కుమార్‌రెడ్డి సమీక్షించారు. గురువారం సాయంత్రం శ్రీశైలం చేరుకున్న ఆయన భ్రమరాంబా అతి«థిగృహంలో ఎమ్మెల్యే శిల్పా చక్రపాణిరెడ్డి, దేవస్థాన ఈఓ ఎస్.లవన్నతో చర్చించారు. శ్రీశైలంలో ఉగాది ఉత్సవాలకు మరింత పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేస్తామన్నారు. చిన్నపాటి ఘటనలు కూడా జరగకుండా చర్యలు తీసుకుంటామని చెప్పారు. అనంతరం ఎమ్మెల్యే శిల్పా, దేవస్థాన ఈవో ఎస్.లవన్నతో శ్రీశైల క్షేత్ర పురవీధుల్లో తిరిగి పరిస్థితిని ఎస్పీ సమీక్షించారు. క్షతగాత్రులకు పరామర్శ శ్రీశైలంప్రాజెక్ట్/కర్నూలు(హాస్పిటల్): శ్రీశైలంఘటనలో గాయాలపాలైన కన్నడ భక్తులను జిల్లా కలెక్టర్ పి. కోటేశ్వరరావు గురువారం పరామర్శించారు. ఘటనలో గాయపడి కర్నూలు ప్రభుత్వ సర్వజన వైద్యశాలలోని న్యూరోసర్జరీ విభాగంలో చికిత్స పొందుతున్న రాముడు, క్యాజువాలిటీలో చికిత్స పొందుతున్న శ్రీశైలంను ఆయన ప్రత్యేకంగా కలిసి వివరాలు తెలుసుకున్నారు. వారికి మెరుగైన వైద్యం అందించాలని అధికారులను ఆదేశించారు. సున్నిపెంట ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న భక్తుడిని శ్రీశైల జగద్గురు పీఠాధిపతి చెన్న సిద్దరామశివాచార్య మహాస్వామీజీ పరామర్శించారు. శ్రీశైలంలో ప్రశాంత వాతావరణం శ్రీశైలంటెంపుల్: క్షేత్రంలో ప్రశాంత వాతావరణం నెలకొందని, భక్తులు భయాందోళన చెందాల్సిన అవసరం లేదని శ్రీశైలం ఎమ్మెల్యే శిల్పా చక్రపాణిరెడ్డి తెలిపారు. గురువారం శ్రీశైలంలోని భ్రమరాంబా అతిథి గృహంలో దేవస్థాన ఈఓ ఎస్.లవన్న, ఆత్మకూరు డీఎస్పీ శృతితో కలిసి ఎమ్మెల్యే విలేకరులతో మాట్లాడారు. బుధవారం అర్ధరాత్రి శ్రీశైలంలో జరిగిన సంఘటన బాధాకరమని అన్నారు. గాయపడిన కన్నడ భక్తుడు చనిపోయాడని సోషల్ మీడియాలో అసత్య ప్రసారాలు చేస్తున్నారని, ప్రస్తుతం అతను ఆరోగ్యంగా ఉన్నాడని వీడియోను చూపించారు. కొన్ని అసాంఘిక శక్తులు క్షేత్ర ప్రతిష్టతను దెబ్బతీయాలని చూస్తున్నాయన్నారు. ముస్లింలు కన్నడ భక్తులను కొట్టారని విషప్రచారం చేస్తున్నారని, దానిని ఖండిస్తున్నామన్నారు. గొడవకు బందోబస్తుకు ముడిపెట్టడం సబబుకాదని డీఎస్పీ శృతి అన్నారు. ఉగాది మహోత్సవాలకు పటిష్ట బందోబస్తు్త ఏర్పాటు చేశామన్నారు. భక్తులందరికీ సౌకర్యవంతమైన దర్శనం కల్పిస్తున్నామని ఈఓ లవన్న తెలిపారు. క్షేత్రానికి ఎంతమందైనా రావచ్చని, ప్రశాంతంగా దర్శనం చేసుకోవాలని సూచించారు. భక్తులంతా శాంత చిత్తులై ఉండాలి శ్రీశైలం చేరుకున్న కన్నడ భక్తులంతా శాంతచిత్తులై ఉండాలని శ్రీశైల జగద్గురు పీఠాధిపతి డాక్టర్ చెన్నసిద్దరామ శివాచార్య మహాస్వామీజీ తెలిపారు. గురువారం కన్నడ భక్తుల కోసం పీఠాధిపతి శాంతి సందేశాన్ని వీడియో రికార్డు చేసి పంపించారు. ఉగాది ఉత్సవాలు మూడు రోజల పాటు జరగనున్నాయని, భక్తులు ప్రశాంతమైన వాతావరణంలో స్వామిఅమ్మవార్లను దర్శించుకోవాలని సూచించారు. -
రణరంగంగా మారిన శ్రీశైలం..
సాక్షి, కర్నూలు: శ్రీశైలంలో బుధవారం అర్ధరాత్రి ఉద్రిక్తత చోటుచేసుకుంది. స్థానికంగా ఉన్న ఒక సత్రం ముందు ఉన్న టీ దుకాణం దగ్గర గొడవ ప్రారంభమైంది. ఈ గొడవలో స్థానికులు, కర్ణాటక వాసల మధ్య మాటా మాటా పెరిగి వాగ్వాదం దాడికి దారితీసింది. ఈ క్రమంలో స్థానికులు కర్ణాటక వాసిపై గొడ్డలితో దాడికి పాల్పడ్డారు. దీంతో హుటాహుటిన దాడిలో తీవ్రంగా గాయపడిన వ్యక్తిని సున్నిపెంట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కాగా, శ్రీశైలంలో కర్నాటకవాసిపై దాడి చేయడం జీర్ణించుకోని కన్నడిలు ఆగ్రహంతో స్థానికంగా ఉన్న షాపులను ధ్వంసం చేసి నిప్పటించారు. ఈ క్రమంలో ఆలయ పరిసరాల్లో ఉన్న దుకాణాలు, పలు వాహనాలు ధ్వంసమయ్యాయి. పాతాళ గంగ, నంది సర్కిల్, పరిపాలన భవనం ముందు లైన్లల్లోని, తాత్కాలిక షాపులను పూర్తిగా ద్వంసం చేశారు. ఈ నేపథ్యంలో పరిస్థితిని గమనించిన ఈఓ లవన్న, జగద్గురువు పీఠాధిపతి శ్రీశ్రీశ్రీ 1008 చెన్న సిద్ధరామ పండితారాధ్య, శివాచార్య, కర్ణాటక స్వామిజీలతో మాట్లాడి ప్రత్యేక పోలీస్ బృందాలతో పరిస్థితి అదుపులోకి తెచ్చారు. ప్రస్తుతం అక్కడ పోలీసులు భారీగా మోహరించారు. -
రాజమౌళిపై కన్నడిగుల ఆగ్రహం!
సాక్షి, బెంగళూర్ : అగ్రదర్శకుడు ఎస్ ఎస్ రాజమౌళిపై కన్నడిగులు ఆగ్రహంతో ఉన్నారు. తాజాగా బెంగళూర్‌లో ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ జరుగుతున్న విషయం తెలిసిందే. దీనికి హాజరుకావాల్సిందిగా కర్ణాటక చలన చిత్ర అకాడమీ రాజమౌళికి ఆహ్వానం పంపింది. అయితే ఆ ఆహ్వానాన్ని తిరస్కరించటంపై వారు మండిపడుతున్నారు. ‘ఈ కార్యక్రమానికి హాజరుకావాలని చాలా మంది నటీనటులకు, మేకర్లకు ఆహ్వానం పంపాం. కానీ, చాలా వరకు హాజరుకాలేదు. దర్శకుడు రాజమౌళికి కూడా ప్రత్యేక ఆహ్వానం పంపాం. కానీ, రాలేనని నేరుగా చెప్పేశారు. ఇది కన్నడ ప్రజలను, ముఖ్యమంత్రి(సిద్ధరామయ్య)ని అవమానించటమే. వారంపాటు జరిగే ఈ కార్యక్రమం కోసం కాస్తైనా సమయం కేటాయించాల్సింది’ అని కర్ణాటక చలనచిత్ర అకాడమీ చైర్మన్ ఎస్వీ రాజేంద్ర సింగ్ బాబు అభిప్రాయపడ్డారు. కాగా, బాహుబలి వివాద సమయంలో(సత్యరాజ్ వివాదాస్పద వ్యాఖ్యలు) తాను రాయ్‌చూర్ మూలాలు ఉన్నవాడినంటూ సినిమా విడుదలను అడ్డుకోవద్దని రాజమౌళి విజ్ఞప్తి చేసిన విషయం తెలిసిందే. ఆ వ్యాఖ్యలను గుర్తు చేస్తూ.. ఇంత పెద్ద ఎత్తున్న నిర్వహించిన కార్యక్రమానికి రావటానికి ఆయనకొచ్చిన సమస్యేంటని? కన్నడిగులు సోషల్ మీడియాలో ఫైర్ అవుతున్నారు. అయితే ముందుగా ఫిక్స్ చేసుకున్న కార్యక్రమాల వల్లనే తాను రాలేకపోతున్నానని రాజమౌళి వారితో చెప్పినట్లు తెలుస్తోంది. -
మైసూర్‌పాక్ ఎవరిది..?
సాక్షి,న్యూఢిల్లీ: రసగులా బెంగాలీలదేనని తేలడంతో తాజాగా మరో స్వీట్‌పై వివాదం ముందుకొచ్చింది. నోరూరించే మైసూర్‌పాక్ కర్నాటకకు చెందుతుందా లేక అది తమిళనాడు వంటకమా అనేది తేలాల్సి ఉంది. అయితే ఈ స్వీట్ తమదంటే తమదేనని సోషల్ మీడియా వేదికగా తమిళులు, కన్నడిగులు సవాల్ చేసుకుంటున్నారు. ప్రాంతాలవారీగా విడిపోయి మైసూర్‌పాక్ మూలాలు తమ రాష్ర్టంలోనే ఉన్నాయని వాదవివాదాలకు దిగుతున్నారు. కన్నడిగులు ఒక అడుగు ముందుకేసి మైసూర్‌పాక్ పేరులోనే అది తమదేననే అర్థం స్ఫురిస్తుందని మైసూర్ పేరును ఉటంకిస్తూ ఇది రాజ కృష్ణ రాజ వడయార్ కిచెన్‌లో మెనూ అని చెబుతున్నారు. నెయ్యి, చక్కెర, శనగపిండితో ప్యాలెస్ చెఫ్ కకసుర మాదప్ప దీన్ని వండివార్చేవాడని చెబుతున్నారు.కాలక్రమంలో దీనిపేరు మైసూర్‌పాక్‌గా స్ధిరపడిందని అంటున్నారు. అయితే తమిళులు తమదైన శైలిలో మరో కథ వినిపిస్తున్నారు. మద్రాస్‌కు చెందినవారు మైసూర్ పాక్‌ను కనుగొన్నారని అయితే 74 ఏళ్ల కిందట ఓ న్యాయవాది ఈ వంటకాన్ని దొంగిలించి మైసూర్ రాజాకు దీని సీక్రెట్ ఫార్ములాను అప్పగించారని చెబుతున్నారు. అప్పుడు మైసూర్ రాజా ఈ వంటకానికి మైసూర్‌పాక్ అని పేరుపెట్టారని ఈ విషయాలను స్వయంగా మెకాలే 1835లో బ్రిటన్ పార్లమెంట్‌కు వివరించారని పేర్కొంటున్నారు.దీనిపై సోషల్ మీడియాలో నెటిజన్లు రాష్ర్టాల వారీగా చీలి కామెంట్లు, లైక్‌లతో రెచ్చిపోతున్నారు. -
అసలు కట్టప్ప ఏమన్నాడు?
న్యూఢిల్లీ: బాహుబలిని కట్టప్ప ఎందుకు చంపాడన్న ప్రశ్న ఇంతకాలం ప్రేక్షకుల మదిని తొలుస్తూ వచ్చింది. ఆ స్థానంలో కట్టప్ప కన్నడిగులకు క్షమాపణ చెబుతారా, లేదా ? అన్న ప్రశ్న ఆక్రమించింది. చెప్పినా దుమారం రేపిన వివాదం సమసిపోతుందా? సినిమా సకాలంలో విడుదలవుతుందా? అని బాహుబలి అభిమానుల్లో ఆందోళన అంకురించింది. బాహుబలి దర్శకుడు రాజమౌలి సోషల్ మీడియా ద్వారా కట్టప్ప తరఫు బేషరుతుగా కన్నడిగులకు క్షమాపణలు చెప్పారు. ఆ మరుసటి రోజే, అంటే శుక్రవారం కట్టప్ప పాత్రధారి, తమిళనటుడు సత్యరాజ్ కూడా కన్నడిగులకు క్షమాపణలు చెప్పారు. ఎప్పుడో చేసిన తన వ్యాఖ్యలు కన్నడిగులను నొప్పించి ఉంటే అందుకు క్షమాపణులు చెబుతున్నానని చెప్పారు. ఈ నెల 28వ తేదీన విడుదల కావాల్సిన బాహుబలి–2 చిత్రం విడుదలను అడ్డుకోరాదని వేడుకున్నారు. ఇంతకు కన్నడిగులను అవమానించేలా సత్యరాజ్ ఏమన్నారు? ఎప్పుడన్నారు? అన్న ప్రశ్నలు కూడా సినిమా ప్రేక్షకులకు కలుగుతున్నాయి. తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల మధ్య 800 కిలోమీటర్ల పొడవున ప్రవహిస్తున్న కావేరీ నదీ పంపకాలపై ఇరు రాష్ట్రాల మధ్య ఎప్పటి నుంచో వివాదం నెలకొన్న విషయం తెల్సిందే. ఇరు రాష్ట్రాల నటులు ఎన్నో ఏళ్లుగా వారి వారి ప్రభుత్వాల వైఖరీలకు మద్దతుగా ప్రజాందోళనలకు మద్దతిస్తున్నారు. ధర్నాలు, బైఠాయింపుల్లో కూడా పొల్గొంటున్నారు. 2008లో చెన్నైలో నిర్వహించిన ఓ ధర్నా కార్యక్రమంలో రజనీకాంత్, కమల్ హాసన్ లాంటి నటులు పాల్గొన్నారు. ఇదే కార్యక్రమంలో సత్యరాజ్ మాట్లాడుతూ ‘కుక్కలు ఉచ్చపోస్తుంటే మౌనం వహించే మానులా తమిళప్రజలు ఉండరాదు’ అన్నారు. ఈ వ్యాఖ్యలపై కన్నడ సంఘాలు మండిపడ్డాయి. కాలక్రమంలో ఈ మాటలు ఇరు రాష్ట్రాల ప్రజలు మరచిపోయారు. బహూశ సత్యరాజ్ కూడా మరచిపోయి ఉంటారు. బాహుబలి–2 విడుదలను పురస్కరించుకొని కొందరు నాడు సత్యరాజ్ చేసిన వివాదాస్పద వ్యాఖ్యలను మళ్లీ తెరపైకి తీసుకొచ్చారు. ఏప్రిల్ 28న విడుదలవుతున్న బాహుబలిని అడ్డుకోవడంతోపాటు మొత్తం బెంగళూరు బంద్‌కు వటల్ నాగరాజ్ నాయకత్వంలోని ‘కన్నడ చలవలి వటల్ పక్ష’ సంఘం పిలుపునిచ్చింది. అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు బేషరుతుగా సత్యరాజ్ క్షమాపణలు చెబితేగానీ విడుదలను అనుమతించమని నాగరాజ్ హెచ్చరించారు. దానికి కన్నడి చలనచిత్ర వాణిజ్య మండలి కూడా మద్దతు పలికింది. సత్యరాజ్ చేసిన అనుచిత వ్యాఖ్యలు ఇప్పుడు చేసినవా, ఎప్పుడో చేసినవా అన్న అంశంతో తమకు సంబంధం లేదని, ఆ వ్యాఖ్యలు కర్ణాటకను, కన్నడిగులను అవమానపరిచే విధంగా ఉన్నాయని మండలి వ్యాఖ్యానించింది. గతంలో నాగరాజ్‌ను పెద్ద కమెడియన్ అంటూ కూడా సత్యరాజ్ ఎద్దేవ చేశారు. ఈ నేపథ్యంలోనే సత్యరాజ్ క్షమాపణల పత్రాన్ని చదవి దాన్ని వీడియోతీసి మీడియాలకు విడుదల చేశారు. కన్నడ సంఘాలు సత్యరాజ్‌ను బేషరుతుగా క్షమాపణలు చెప్పాలని కోరితే క్షమాపణలు చెప్పిన సత్యరాజ్ చివరలో తాను తమిళ ప్రజల పోరాటానికి ఎప్పుడూ అండగా నిలబడతానని కూడా చెప్పారు. మరి ఇంతటితో వివాదం సమసిపోతుందా, లేదా చూడాలి. వివాదానికి తెరపడకపోతే వాస్తవానికి సత్యరాజ్‌కు వచ్చే నష్టమేమి లేదు. 45 కోట్ల రూపాయలకుపైగా డబ్బులుపెట్టి చిత్రం హక్కులుకొన్ని కన్నడ డిస్ట్రిబ్యూటర్లే నష్టపోతారు. -
ఎట్టకేలకు దిగొచ్చిన ‘కట్టప్ప’
-
ఎట్టకేలకు దిగొచ్చిన ‘కట్టప్ప’
చెన్నై: కన్నడిగుల ఆందోళనతో ‘కట్టప్ప’ దిగొచ్చాడు. కన్నడ ప్రజలకు వ్యతిరేకంగా 9 ఏళ్ల క్రితం తాను చేసిన వ్యాఖ్యలపై తమిళ నటుడు సత్యరాజ్ క్షమాపణ చెప్పారు. తాను కన్నడ ప్రజలకు వ్యతిరేకం కాదని, వివాదానికి ముగింపు పలకాలని విజ్ఞప్తి చేశారు. తన వ్యాఖ్యలు బాహుబలి-2 సినిమా విడుదలకు అడ్డంకి కారాదని ఆకాంక్షించారు. తన వ్యాఖ్యలతో ఎవరైనా బాధపడివుంటే క్షమించాలని వేడుకున్నాడు. బాహుబలి-2 సినిమాను అడ్డుకోవద్దని కన్నడీగులను కోరాడు. ఈ మేరకు లేఖ చదువుతూ వీడియో విడుదల చేశాడు. తమిళ ప్రజల సంక్షేమం కోసం మాట్లాడుతూనేవుంటానని, సినిమాల్లో అవకాశాలు పోయినా లెక్కచేయనని చెప్పారు. కావేరి నదీ జలాల వివాదం నేపథ్యంలో తమకు వ్యతిరేకంగా వ్యాఖ్యలు చేసిన సత్యరాజ్ క్షమాపణ చెప్పకుంటే బాహుబలి-2 సినిమాను అడ్డుకుంటామని కన్నడ సంఘాలు హెచ్చరించిన సంగతి తెలిసిందే. తమ సినిమాను అడ్డుకోవద్దని కన్నడ ప్రజలను దర్శకుడు ఎస్ఎస్ రాజమౌళి స్వయంగా కోరాడు. భారీ వ్యయంతో తెరకెక్కిన తమ సినిమాను అడ్డుకుంటే తీవ్రంగా నష్టపోతామని తెలిపాడు. రిలీజ్ అడ్డుకుంటే అందరూ నష్టపోవాల్సి వస్తుందని, బాహుబలి తొలి భాగాన్ని ఆదరించినట్టుగానే కన్నడ ప్రేక్షకులు బాహుబలి-2 కూడా ఆదరించాలని విజ్ఞప్తి చేశాడు.