బెంగళూరు: సోమవారం జరిగిన బెంగళూరు రాయల్ ఛాలెంజర్స్, లక్నో సూపర్ జియంట్స్ మ్యాచ్ అనంతరం విరాట్ కోహ్లీ, గౌతం గంభీర్ మధ్య తీవ్ర వాగ్వాదం చెలరేగిన విషయం తెలిసిందే. ఇందుకు సంబంధించిన వీడియోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారాయి. ఈ ఇద్దరి తీరుపట్ల బీసీసీఐ అసంతృప్తి వ్యక్తం చేసి మ్యాచ్ ఫీజులో 100 శాతం జరిమానా కూడా విధించింది. అయితే ఇద్దరిలో తప్పు ఎవరిదనే విషయంపై సోషల్ మీడియాలో జోరుగా చర్చ జరుగుతోంది. ఇప్పుడిది కర్ణాటకలో రాజకీయ రంగు కూడా పులుముకుంది.
అయితే ఈ విషయంలో కింగ్ విరాట్ కోహ్లీకి కన్నడిగులు, ముఖ్యంగా కాంగ్రెస్ శ్రేణులు తమ మద్దతు తెలిపారు. బీజేపీ ఎంపీ కూడా అయిన లక్నో టీం మెంటార్ గౌతం గంభీర్.. కన్నడిగుల గర్వం అయిన కోహ్లీని బెదిరించాడని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ విషయంలో కర్ణాటక ప్రజలు ఎన్నికల్లో బుద్ది చెప్పేందుకు సిద్ధంగా ఉన్నారని, మే 13న ఫలితాలు దీన్ని నిరూపిస్తాయని ట్వీట్లు చేస్తున్నారు.
A BJP MP threatening Kannadigas pride RCB’s Virat Kohli. The People of Karnataka are ready to teach them a lesson on 13th May.pic.twitter.com/RqMpNijZGj
— Shantanu (@shaandelhite) May 1, 2023
(చదవండి: నేను రాహుల్ అభిమానిని.. కాంగ్రెస్ ర్యాలీలో కన్నడ సూపర్‌స్టార్ శివ రాజ్‌కుమార్)
కాంగ్రెస్ సీనియర్ నేత, కర్ణాటక మాజీ సీఎం సిద్ధరామయ్య కూడా ఈ విషయంపై స్పందించారు. ఈసారి కచ్చితంగా ఆర్సీబీ ఐపీఎల్ కప్పు గెలుస్తుందని, ఎన్నికల్లో కాంగ్రెస్ విజయం సాధిస్తుందని జోస్యం చెప్పారు. ఓ జాతీయ వార్తా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈమేరకు మాట్లాడారు.
RCB will win & Congress will also win 🔥
— Srivatsa (@srivatsayb) May 2, 2023
BJP MP Gambhir 🤡 pic.twitter.com/qvK1yt33kc
కాగా.. లక్నోతో జరిగిన మ్యాచ్‌లో ఆర్సీబీ ఘన విజయం సాధించిన విజయం సాధించిన విషయం తెలిసిందే. ఈ లో స్కోరింగ్ మ్యాచ్లో మొదట బ్యాటింగ్ చేసిన బెంగళూరు 126 పరుగులే చేసింది. అయితే బౌలింగ్‌లో అద్భుతంగా రాణించి లక్నోను 108 పరుగులకే ఆలౌట్ చేసింది. ఫలితంగా హోం గ్రౌండ్ బెంగళూరులో తమను ఓడించిన లక్నోను సొంత మైదానంలో ఓడించి ప్రతీకారం తీర్చుకుంది.
చదవండి: పీసీసీ చీఫ్ హెలికాప్టర్‌ను ఢీకొట్టిన పక్షి.. ఎమర్జెన్సీ ల్యాండింగ్.. అద్దం పగిలి..
Comments
Please login to add a commentAdd a comment