ఫేస్బుక్లోకి రక్షణశాఖ | Defence Ministry on Facebook | Sakshi
Sakshi News home page

ఫేస్బుక్లోకి రక్షణశాఖ

Published Fri, May 22 2015 7:18 PM | Last Updated on Thu, Jul 26 2018 5:23 PM

ఫేస్బుక్లోకి రక్షణశాఖ - Sakshi

ఫేస్బుక్లోకి రక్షణశాఖ

న్యూఢిల్లీ: కేంద్ర రక్షణ శాఖ ఫేస్బుక్లోకి ప్రవేశించింది. శుక్రవారం తన ఫేస్ బుక్ ఖాతాను తెరిచింది. హోం పేజీగా తన బ్లాక్ను ఉంచి ప్రొఫైల్ పిక్చర్గా డిఫెన్స్ నేషన్ అనే ఫొటోను ఉంచింది. ముఖ్యంగా యువతరానికి బాగా దగ్గరకావాలనే ఉద్దేశంతోపాటు పూర్తిగా తమ శాఖను డిజిటలైజేషన్ చేస్తున్న క్రమంలో భాగంగా ఫేస్బుక్ ఖాతాను తెరిచింది. ఇప్పటికే డిఫెన్స్ శాఖ ట్విట్టర్ ఖాతాను తెరవగా.. దానిని పదహారు వేలమంది ఫాలో అవుతున్నారు.

వివిధ సామాజిక అనుసంధాన వేధికల ద్వారా ప్రజలకు మరింత దగ్గరకావాలన్న తమ ఆశయంలో భాగంగా ఇదొక పురోగతి అని ఆ శాఖ అధికారిక ప్రతినిధి సితాన్షు కర్ తెలిపారు. యువకులు ఎక్కువగా ఫేస్బుక్, ట్విట్టర్లో ఉన్నారని, వారిని ఆకట్టుకోవాలనే ఉద్దేశంతోనే ఫేస్బుక్ ప్రారంభించినట్లు తెలిపారు. రక్షణ శాఖ కోసం ప్రత్యేకంగా కొత్త వెబ్ సైట్ను రూపొందిస్తున్నట్లు చెప్పారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement