ఆయుధాల కొనుగోలుకు 16 వేల కోట్లు | Defence Ministry allows purchase of 7.40 lakh assault rifles for Armed forces | Sakshi
Sakshi News home page

ఆయుధాల కొనుగోలుకు 16 వేల కోట్లు

Published Tue, Feb 13 2018 7:44 PM | Last Updated on Wed, Feb 14 2018 9:05 AM

Defence Ministry allows purchase of 7.40 lakh assault rifles for Armed forces - Sakshi

సరిహద్దుల్లో భారత సేనల పహారా

న్యూఢిల్లీ: సాయుధ దళాల బలోపేతానికి రక్షణ శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. రూ.15,935 కోట్ల విలువైన ఆయుధాల కొనుగోలు, సేకరణకు పచ్చజెండా ఊపింది. రక్షణ శాఖలో అత్యున్నత స్థాయిలో నిర్ణయాలు తీసుకునే రక్షణ కొనుగోళ్ల మండలి(డీఏసీ) మంగళవారం ఈ మేరకు ఆమోదం తెలిపింది.

కొనుగోలు చేయనున్న ప్రతిపాదిత జాబితాలో 7.40 లక్షల రైఫిల్స్, 5719 స్నైపర్‌ రైఫిల్స్, మెషీన్‌ గన్స్‌ ఉన్నాయి.  సరిహదుల్లో పాక్, చైనాల నుంచి తీవ్ర సవాళ్లు ఎదురవుతున్న నేపథ్యంలో ఈ నిర్ణయం వెలువడింది. సుమారు రూ. 12,280 కోట్ల ఖర్చయ్యే రైఫిళ్లను ప్రభుత్వ, ప్రైవేట్‌ భాగస్వామ్యంతో భారత్‌లో తయారుచేస్తారు. స్నైపర్‌ రైఫిళ్లను తొలుత విదేశాల నుంచి కొనుగోలు చేసి, తర్వాత భారత్‌లో తయారుచేస్తారు.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement