న్యూఢిల్లీ: రక్షణ మంత్రిత్వ శాఖ రూ.3,000 కోట్ల విలువైన సైనిక సామగ్రి కొనుగోలుకు శనివారం ఆమోదం తెలిపింది. నావికా దళం కోసం రెండు బ్రహ్మోస్ సూపర్ సోనిక్ క్రూయిజ్ క్షిపణులు, ఆర్మీకి చెందిన ముఖ్యమైన అర్జున్ యుద్ధ ట్యాంకుల కోసం ఆర్మ్‌డ్ రికవరీ వాహనాలు కొనుగోలు చేస్తున్నట్లు సీనియర్ అధికారి ఒకరు తెలిపారు. ఈమేరకు సామగ్రి కొనుగోలుకు సంబంధించి రక్షణ కొనుగోలు మండలి నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు. ‘రక్షణ శాఖ మంత్రి నిర్మల అధ్యక్షతన జరిగిన డీఏసీ సమావేశంలో సామగ్రి కొనుగోలుకు ఆమోదం తెలిపారు’ అని అధికారి పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment