ఇరాక్ కు భారత సైన్యమా?
న్యూఢిల్లీ: ఇరాక్ లో సున్నీ, షియాల మధ్య జరుగుతున్న అంతర్యుద్ధ పోరును నియంత్రించడానికి భారత సేనల్ని పంపే అవకాశముందని వస్తున్న వార్తలను రక్షణ శాఖా మంత్రి అరుణ్ జైట్లీ ఖండించారు.
ఇరాక్ కు భారత సేనాలా అంటూ మీడియా అడిగిన ప్రశ్నకు జైట్లీ ఆశ్చర్యం వ్యక్తం చేశారు. నేను ఊహించడం లేదు కూడా మంత్రి జైట్లీ మీడియాతో అన్నారు.
ఇరాక్ లో సున్నీ చొరబాటుదారుల దాడుల కారణంగా 120 మంది భారతీయులు చిక్కుకు పోయారని, ఇరాక్ లో 10 వేల మంది భారతీయులు ఉన్నారని ఓ ప్రశ్నకు సమాధానమిచ్చారు.