ఆదిలాబాద్: ఆదిలాబాద్ జిల్లా నిర్మల్లో ఎస్ఐ రివాల్వర్ మిస్ ఫైర్ అయిన సంఘటనలో ఓ వ్యక్తి గాయపడ్డాడు. ఈ సంఘటనకు సంబంధించి వివరాలు ఉన్నాయి.
కరీంనగర్ జిల్లా రాయికల్ ఎస్సై రాములు నాయక్తో పాటు జిల్లాకు చెందిన ఇద్దరు ఉన్నతాధికారులు నిర్మల్లోని మయూరి హోటల్కు విందుకు వెళ్లారు. రాములు నాయక్ రివాల్వర్ కిందపడటంతో మిస్ ఫైర్ అయ్యింది. ఈ ప్రమాదంలో హోటల్లో పనిచేసే సర్వర్కు గాయాలయ్యాయి.