
సాక్షి, హైదరాబాద్: నగరంలోని కిషన్‌బాగ్‌లో శుక్రవారం మిట్టమధ్యాహ్నం ఇద్దరు దుండగులు మొబైల్ ఫోన్ స్నాచింగ్‌కు పాల్పడ్డారు. ఈ ఘటన ఎన్‌ఎం గూడ ఆంజనేయస్వామి దేవాలయం వద్ద జరిగింది. ఒక వ్యక్తి మొబైల్ చూస్తూ నడుచుకుంటూ వెళ్తున్నాడు. అంతలోనే బైక్‌పై వచ్చిన ఇద్దరు దుండగులు అతని చేతిలో నుంచి మొబైల్ లాక్కుని క్షణాల్లో అక్కడి నుంచి పరార్యాయారు. వారిని బాధితుడు వెంబడించినప్పటికీ లాభం లేపోయింది. ఈ స్నాచింగ్ దృశ్యాలు స్థానికంగా ఉన్న సీసీ టీవీ కెమెరాల్లో రికార్డయ్యాయి. సీసీ ఫుటేజీ ఆధారంగా పోలీసులు నిందితులు గుర్తించే పనిలోపడ్డారు.
(సీఎం కేసీఆర్ ఆరోగ్యంపై హైకోర్టులో పిటిషన్)
Comments
Please login to add a commentAdd a comment