
చోరీల బాట పట్టిన జల్సా బాబు
హైదరాబాద్: జల్సాలకు అలవాటు పడిన ఓ డిగ్రీ విద్యార్థి చోరీల బాటపట్టాడు. స్నాచింగ్‌లు చేసి పలుసార్లు జైలుకెళ్లాడు. అయినా బుద్ధిమార్చుకోకుండా మళ్లీ దొంగతనాలు చేస్తూ మారేడుపల్లి పోలీసులకు చిక్కాడు. సోమవారం మహంకాళి ఏసీపీ మహేందర్ తెలిపిన వివరాల ప్రకారం... మంగళ్‌హాట్‌కు చెందిన మహ్మద్ ఫర్హాన్ (22) హిమాయత్‌నగర్‌లోని ప్రైవేట్ కళాశాలలో డిగ్రీ ఫైనల్ ఇయర్ చదువుతున్నాడు.
జల్సాలకు అలవాటు పడిన ఇతను సులభంగా డబ్బు సంపాదించేందుకు 2010 నుంచి చైన్‌స్నాచిం గ్‌లకు పాల్పడుతున్నాడు. 2010లో పోలీసుల కు చిక్కి కటకటాల పాలయ్యాడు. జైలు నుంచి విడుదలైన ఫర్హాన్ మళ్లీ 18 చోరీలు చేసి గత ఏప్రిల్‌లో బేగంపేట్ పోలీసులకు పట్టుబడ్డాడు. ఇటీవల జైలు నుంచి వచ్చిన ఇతను మహంకాళి, మార్కెట్, కార్ఖాన పీఎస్‌ల పరిధిల్లో 8 గొలుసు దొంగతనాలు చేశారు.
ఫర్హాన్ సోమవారం అనుమానాస్పదంగా తిరుగుతుండగా మారేడుపల్లి డీఎస్సై మధు తమ సిబ్బందితో కలిసి పట్టుకున్నారు. విచారణలో ఇతను పాతనేరస్తుడని తెలిసింది. రూ.7.5 లక్షలు విలువ చేసే 26 తులాల బం గారు నగలు స్వాధీనం చేసుకొని నిందితుడి రిమాండ్‌కు తరలించారు. విలేకరుల సమావేశంలో ఇన్‌స్పెక్టర్ శశాంక్‌రెడ్డి, అదనపు ఇన్‌స్పెక్టర్ నరహరి పాల్గొన్నారు.