తృణమూల్‌కు రూ.1,397 కోట్లు
వెబ్‌సైట్‌లో పొందుపరచిన ఎన్నికల సంఘం
న్యూఢిల్లీ: ఎన్నికల బాండ్లతో అధికార బీజేపీ అత్యధికంగా లబ్ధి పొందినట్లు వెల్లడయ్యింది. కమలం పార్టికి ఈ బాండ్ల ద్వారా ఏకంగా రూ.6,986.5 కోట్లు అందినట్లు కేంద్ర ఎన్నికల సంఘం తెలియజేసింది. ఎన్నికలబాండ్లపై పార్టిలు గత నవంబర్‌లో ఇచి్చన సమాచారాన్ని ఆదివారం తన వెబ్‌సైట్‌లో అందుబాటులోకి తెచి్చంది. పశి్చమ బెంగాల్‌లో అధికార పార్టీ తృణమూల్ కాంగ్రెస్‌కు రూ.1,397 కోట్లు, కాంగ్రెస్‌కు రూ.1,334 కోట్లు, భారత రాష్ట్ర సమితికి రూ.1,322 కోట్లు, బిజూ జనతాదళ్‌కు రూ.944.5 కోట్లు, డీఎంకేకు రూ.656.5 కోట్లు బాండ్ల రూపంలో అందినట్లు ఈసీ డేటాను బట్టి తెలుస్తోంది.
బాండ్ల కొనుగోలుదార్లలో ఫ్యూచర్ గేమింగ్, హోటల్ సరీ్వసెస్ సంస్థ అధినేత, లాటరీ కింగ్ శాంటియాగో మార్టిన్ అగ్రస్థానంలో నిలిచాడు. రూ.1,368 కోట్ల విలువైన బాండ్లు కొనుగోలు చేశాడు. ఇందులో 37 శాతానికిపైగా, అంటే రూ.509 కోట్లను డీఎంకేకు అందజేశాడు. డీఎంకేకు మేఘా ఇంజనీరింగ్ రూ.105 కోట్లు, ఇండియా సిమెంట్స్ రూ.14 కోట్లు, సన్ టీవీ నెట్‌వర్క్ రూ.100 కోట్లు సమరి్పంచుకున్నాయి.
అన్నాడీఎంకేకు ఇండియా సిమెంట్స్ యాజమాన్యంలోని ఐపీఎల్ టీం చెన్నై సూపర్ కింగ్స్; జేడీ(ఎస్)కు ఆదిత్య బిర్లా గ్రూప్, ఇన్ఫోసిస్, జేఎస్‌డబ్ల్యూ గ్రూప్, మేఘా ఇంజనీరింగ్, ఎంబసీ గ్రూప్; ఆప్‌కు బజాజ్, కేఎంజెడ్ ఇన్వెస్ట్‌మెంట్స్, ఎన్‌జేకే, బీజీ షిర్కే, టొరెంట్ ఫార్మా; జేడీ(యూ)కు భారతీ ఎయిర్‌టెల్, శ్రీ సిమెంట్స్; ఎన్సీపీకి నియోటియా ఫౌండేషన్, భారతీ ఎయిర్‌టెల్, సైరస్‌పూనావాలా, బజాజ్ ఫిన్‌సర్వ్, ఒబెరాయ్ రియాల్టీ తదితర సంస్థలు విరాళాలిచ్చాయి. బాండ్ల రూపంలో తమకు ఏయే సంస్థ/వ్యక్తుల నుంచి ఎంతెంత విరాళాలు వచ్చాయో బీజేపీ, కాంగ్రెస్, తృణమూల్ కాంగ్రెస్ ఈసీకి తెలియజేయలేదు. ఏడీఆర్ గణాంకాల ప్రకారం బీజేపీకి మొత్తం 7,700 కోట్ల విరాళాలు అందాయి. బాండ్ల ద్వారా తమకెలాంటి నిధులూ రాలేదని సీపీఎం, బీఎస్పీ, మజ్లిస్ ప్రకటించాయి.
ఈసీ డేటా ప్రకారం బాండ్ల ద్వారా
అత్యధిక నిధులు అందుకున్న పారీ్టలు
పార్టీ నిధులు
బీజేపీ రూ.6,986.5 కోట్లు
టీఎంసీ రూ.1,397 కోట్లు
కాంగ్రెస్ రూ.1,334 కోట్లు
బీఆర్‌ఎస్ రూ.1,322 కోట్లు
Comments
Please login to add a commentAdd a comment