ఎన్నికల బాండ్ల వివరాలు వెల్లడించనందుకు ఎస్‌బీఐపై సుప్రీంకోర్టు మండిపాటు
నేటి సాయంత్రంలోగా ఎన్నికల సంఘానికి
వివరాలు ఇవ్వాల్సిందేనని ఆదేశాలు
వాటిని 15వ తేదీ సాయంత్రంలోగా వెబ్‌సైట్‌లో ఉంచాలని ఈసీకి నిర్దేశం
సాక్షి, న్యూఢిల్లీ: ఎలక్టోరల్ బాండ్ల ద్వారా రాజకీయ పార్టిలు పొందిన విరాళాల వివరాలను మంగళవారం సాయంత్రంకల్లా కేంద్ర ఎన్నికల సంఘం(ఈసీ)కి సమరి్పంచాల్సిందేనని సర్వోన్నత న్యాయస్థానం తేలి్చచెప్పింది. దీంతో మరింత గడువు కావాలంటూ కోర్టు మెట్లెక్కిన భారతీయ స్టేట్ బ్యాంక్(ఎస్‌బీఐ)కి న్యాయస్థానంలో పెద్ద ఎదురుదెబ్బ తగిలింది. ‘‘రాజకీయ పార్టిలు పొందిన విరాళాల సమగ్ర వివరాలను 12వ తేదీ పనిగంటలు ముగిసేలోగా ఈసీకి వెల్లడించాలి.
తర్వాత అందరికీ బహిర్గతం చేయాలి’’ అని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్, జస్టిస్ సంజీవ్ ఖన్నా, జస్టిస్ బీఆర్ గవాయి, జస్టిస్ జేబీ పారి్ధవాలా, జస్టిస్ మనోజ్ మిశ్రాల రాజ్యాంగ ధర్మాసనం ఎస్‌బీఐను ఆదేశించింది. మరోవైపు, మార్చి 15వ తేదీ సాయంత్రం ఐదు గంటలలకల్లా తమ అధికారిక వెబ్‌సైట్‌లో సమగ్ర వివరాలను పొందుపరచాలని ఈసీకి కోర్టు సూచించింది.
బ్యాంక్‌కు ఆదేశాలు, గడువుకు సంబంధించి ఫిబ్రవరి 15వ తేదీన ఇచి్చన ఉత్తర్వుల ఉల్లంఘనకు బ్యాంక్ పాల్పడితే బ్యాంక్‌పై చర్చలు తీసుకునేందుకు వెనకాడబోమని ధర్మాసనం ఆగ్రహం వ్యక్తంచేసింది. ఎలక్టోరల్ బాండ్ల విధానం రాజ్యాంగవిరుద్ధమని పేర్కొంటూ ఆ పద్దతిని రద్దుచేస్తూ ఐదుగురు సభ్యుల రాజ్యాంగధర్మాసనం ఫిబ్రవరిలో చరిత్రాత్మక తీర్పునివ్వడం తెల్సిందే. 2019 ఏప్రిల్ 12వ తేదీ నుంచి ఎస్‌బీఐ ద్వారా జరిగిన ఎలక్టోరల్ బాండ్ల అధికారిక కొనుగోలు, డిపాజిట్ లావాదేవీల వివరాలను మార్చి ఆరో తేదీలోపు ఈసీకి ఇవ్వాలని కోర్టు గతంలోనే ఆదేశించడం తెల్సిందే.
దీంతోజూన్ 30వ తేదీకా గడువు పొడిగించాలని ఎస్‌బీఐ కోర్టును కోరడం, అలా గడవు కోరడాన్ని కోర్టు ధిక్కారణగా పరిగణించాలంటూ కోర్టులో వేర్వేరు పిటిషన్లు దాఖలవడం తెల్సిందే. ఎస్‌బీఐ తరఫున సీనియర్ లాయర్ హరీశ్ సాల్వే వాదించారు. ‘‘ బాండ్లను కొనుగోలు చేసిన వారు, డిపాజిట్ చేసుకున్న వారి వివరాలు వేర్వేరుగా ఉన్నాయి. వాటిని సరిపోల్చి నివేదించాల్సిఉంది.
వేర్వేరు చోట ఉన్న బ్రాంచీల్లో నిక్షిప్తమైన డేటాను సరిపోల్చేందుకు చాలా సమయంపడుతుంది. అందుకే గడువు పెంచండి’ అని కోరారు. ‘‘ విరాళాల దాతలు, గ్రహీతల వివరాలను సరిపోల్చి మ్యాచింగ్ వివరాలని ఇవ్వాలని మేం అడగలేదు. మీ దగ్గర ఉన్నది ఉన్నట్లుగా సీల్డ్ కవర్ లోంచి తీసి ఈసీకిస్తే చాలు’’ అని ఆదేశించింది. ‘‘ ఫిబ్రవరి 15న తీర్పు ఇచ్చాం. అంటే ఈ 26 రోజుల నుంచి ఏం చేసినట్లు? ఇంతకాలం మౌనంవహించి ఇప్పుడొచ్చి గడువు పెంచమంటారా? కోర్టు ఉత్తర్వులపై ఇంత నిర్లక్ష్యమా?’’ అని దుయ్యబట్టింది.
స్వాగతించిన కాంగ్రెస్
సుప్రీంకోర్టు తీర్పును కాంగ్రెస్ స్వాగతించింది. భారీ కాంట్రాక్టులను సంపాదించేందుకు బీజేపీకి భారీగా విరాళాల విరాళాలిచ్చిన వారి వివరాలూ బయటికొచ్చేలా ఉత్తర్వులిస్తే బాగుండేదని పేర్కొంది. ‘‘స్విస్ ఖాతాల నుంచి కోట్ల నల్లధనం తెస్తామన్న వాళ్లే తమ సొంత ఖాతాల వివరాలు సుప్రీం కంటబడకుండా దాచేస్తున్నారు’’ అని ప్రధాని మోదీని ఉద్దేశించి రాహుల్ గాంధీ ఎద్దేవా చేశారు.
Comments
Please login to add a commentAdd a comment