అధ్యాపకురాలికి పీహెచ్‌డీ ప్రదానం
Published Wed, Feb 1 2017 12:14 AM | Last Updated on Tue, Sep 5 2017 2:34 AM
బోట్‌క్లబ్ (కాకినాడ సిటీ) :
జేఎ¯ŒSటీయూ ఇంజినీరింగ్ కళాశాల ఫిజిక్స్ విభాగం అసిస్టెంట్ ప్రొఫెసర్ చట్టి సన్యాసలక్షి్మకి ఆంధ్రా యూనివర్సిటీ పీహెచ్‌డీ ప్రదానం చేసింది. ‘స్రక్చరల్, మేగ్నేటిక్ అండ్ ఎలక్ట్రికల్ ఇన్వెస్టగేష¯Œ్స ఆ¯ŒS ఆంటిమొనో అండ్ నియోబియయ్ డొపడ్‌నానోక్రిస్టలీ¯ŒS నికెల్ జింగ్ ఫెర్రైట్స్’ అంశంపై దశాబ్దకాలంగా చేసిన పరిశోధనలో ప్రతిపాదించిన అంశాలను వర్సిటీ ఆమోదించినట్టు ఆమె మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. వర్సిటీ వీసీ జి.నాగేశ్వరరావు చేతుల మీదుగా ఆమె పీహెచ్‌సీని అందుకున్నారు. వర్సిటీ డిపార్ట్‌మెంట్ ఆఫ్ ఫిజిక్స్ పీఎస్ బంగారురాజు నేతృత్వంలో ఆమె ఈ పరిశోధన చేశారు. ఈ నూతన ఆవిష్కరణ వల్ల మెక్రో ఎలక్ట్రానిక్స్ పరికరాల్లో మైక్రోవేవ్ డివైజర్స్, కంప్యూటరియా మెమరీ ఎలిమెంట్స్, వైద్యరంగంలో డీప్ బై¯ŒS స్టిమ్యులేష¯ŒS వ్యాధి నిర్ధారణకు ఉపయోగపడుతుందన్నారు. మతిమరుపు లక్షణాల గుర్తింపు, సూచనలు, కేన్సర్ ట్రీట్‌మెంట్‌లో ఈ పరిశోధన దోహదపడుతుందని ఆమె వివరించారు. దశాబ్ది కాలంగా చేసిన కృషి ఫలించిందని, ఆమె భర్త, విశాఖ గాయత్రి ఇంజినీరింగ్ కళాశాల మేథమెటిక్స్ డిపార్ట్‌మెంట్ అసిస్టెంట్ ప్రొఫెసర్ కేవీఎస్ శర్మ తెలిపారు.
Advertisement