నవోదయలో ప్రవేశానికి దరఖాస్తుల స్వీకరణ | navodaya entrance applications received | Sakshi
Sakshi News home page

నవోదయలో ప్రవేశానికి దరఖాస్తుల స్వీకరణ

Published Sat, Aug 27 2016 8:29 PM | Last Updated on Mon, Sep 4 2017 11:10 AM

navodaya entrance applications received

పెద్దాపురం : 
నవోదయ విద్యాలయలో 2016–17 విద్యా సంవత్సరానికి ఆరో తరగతిలో ప్రవేశానికి దరఖాస్తులు స్వీకరిస్తున్నట్లు విద్యాలయ ప్రిన్సిపాల్‌ వి.మునిరామయ్య తెలిపారు. శనివారం ఆయన స్థానిక విలేకర్లతో మాట్లాడుతూ అభ్యర్థులు వచ్చే నెల 16వ తేదీలోగా ఆయా మండల విద్యాశాఖాధికారులకు అందజేయాలన్నారు. దరఖాస్తు ఫారాలకు ఎటువంటి రుసుము లేదని, జిరాక్స్‌లో కూడా స్వీకరిస్తామన్నారు. దరఖాస్తు చేసుకునేందుకు గడువు పొడిగించే పరిస్థితి లేదని, మండల విద్యాశాఖాధికారులు గమనించి గత ఏడాది కంటే ఈ ఏడాది 15 శాతం రిజిస్ట్రేషన్‌ పెరిగేలా సహరించాలన్నారు. గ్రామీణ ప్రాంత అభ్యర్థులు, ఎస్సీ, ఎస్టీ, బాలికలు తప్పని సరిగా ఈ అవకాశాన్ని  సద్వినియోగం చేసుకోవాలని ముని రామయ్య తెలిపారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement