ఏపీఎస్‌ఆర్టీసీ వంటి ప్రభుత్వరంగ సంస్థలు రూ.10 నాణేలను స్వీకరించాలి
దీనిపై పత్రికా ప్రకటన జారీ చేసి ప్రోత్సహించాలి
రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరిన రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా
సాక్షి, అమరావతి: రూ.10 నాణెం చెల్లుబాటుపై ప్రజల్లో ఉన్న అపోహలను తొలగించడానికి ముందుకు రావాలని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరింది. ఏపీఎస్‌ఆరీ్టసీ వంటి ప్రభుత్వరంగ సంస్థలు పది రూపాయల నాణేలను స్వీకరించడం ద్వారా ప్రజలకు భరోసా కలి్పంచేలా తక్షణం పత్రికా ప్రకటన విడుదల చేయాలని విజ్ఞప్తి చేసింది. బుధవారం విజయవాడలో 32వ స్టేట్ లెవెల్ సెక్యూర్టీ మీటింగ్‌లో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా హైదరాబాద్ రీజినల్ డైరెక్టర్ కమల్ పి పట్నాయక్ మాట్లాడుతూ ప్రజల్లో నెలకొన్న అపోహల వల్ల రాష్ట్రంలో తీవ్రమైన చిల్లర కొరత నెలకొని ఉందన్నారు.
ఇటువంటి పరిస్థితుల్లోనే కర్ణాటక ప్రభుత్వం ముందుకు వచ్చి ప్రకటన విడుదల చేసిన తర్వాత రూ.10 నాణేల చెలామణి ఏడు రెట్లు పెరిగిందని చెప్పారు. అదే విధంగా రాష్ట్ర ప్రభుత్వం కూడా ముందుకు వచ్చే విధంగా చర్యలు తీసుకోవాలని ఈ సమావేశానికి చైర్మన్‌గా వ్యవహరించిన రాష్ట్ర హోంశాఖ కార్యదర్శి కుమార్ విశ్వజిత్‌ను కోరారు. ఇప్పటికే ఆర్‌బీఐ పలు ప్రకటనలు చేసినా వినియోగం ఆశించినంత పెరగలేదని, ప్రభుత్వ ప్రోత్సాహంతోనే ఇది సాధ్యమవుతుందన్నారు. రూ.10 నోట్లతో పోలిస్తే నాణేల జీవిత కాలం రెండు దశాబ్దాలుపైన ఉంటుందని తెలిపారు.
రూ.10 నాణేలు చెల్లవనే ప్రచారం ఒకప్పుడు దక్షిణాది రాష్ట్రాల్లో అత్యధికంగా ఉందని, హైదరాబాద్ రీజినల్ డైరెక్టర్ పరిధిలో రూ.22 కోట్ల విలువైన రూ.10 నాణేలు మింట్, కరెన్సీ చెస్ట్‌ల్లో మూలుగుతున్నాయన్నారు. ప్రస్తుతం దేశంలో 14 డిజైన్లలో పది రూపాయల నాణేలు చెలామణిలో ఉన్నాయని, ఇవన్నీ కూడా చెల్లుతాయని ఆర్‌బీఐ అధికారులు స్పష్టం చేశారు. దీనిపై స్పందించిన విశ్వజిత్ ఆర్‌బీఐ లిఖిత పూర్వకంగా ఈ ప్రతిపాదనను పంపిస్తే తక్షణంచర్యలు తీసుకునే విధంగా ప్రభుత్వంతో చర్చిస్తామని హామీనిచ్చారు.
రూ.10 నాణేల చెలామణి పెంచే విధంగా బ్యాంకులు కూడా ప్రోత్సహించాలని ఆర్‌బీఐ కోరింది. అనంతరం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకులు, డీమార్ట్, మోడరన్ సూపర్ బజార్, రైస్ మిల్లుల వ్యాపారులకు రూ.10 నాణేలను కమల్ పి పట్నాయక్, కుమార్ విశ్వజిత్ చేతుల మీదుగా అందజేశారు.
Comments
Please login to add a commentAdd a comment