RS.10 coins
-
రూ.10 నాణెం చెల్లుతుంది
సాక్షి, అమరావతి: రూ.10 నాణెం చెల్లుబాటుపై ప్రజల్లో ఉన్న అపోహలను తొలగించడానికి ముందుకు రావాలని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరింది. ఏపీఎస్‌ఆరీ్టసీ వంటి ప్రభుత్వరంగ సంస్థలు పది రూపాయల నాణేలను స్వీకరించడం ద్వారా ప్రజలకు భరోసా కలి్పంచేలా తక్షణం పత్రికా ప్రకటన విడుదల చేయాలని విజ్ఞప్తి చేసింది. బుధవారం విజయవాడలో 32వ స్టేట్ లెవెల్ సెక్యూర్టీ మీటింగ్‌లో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా హైదరాబాద్ రీజినల్ డైరెక్టర్ కమల్ పి పట్నాయక్ మాట్లాడుతూ ప్రజల్లో నెలకొన్న అపోహల వల్ల రాష్ట్రంలో తీవ్రమైన చిల్లర కొరత నెలకొని ఉందన్నారు.ఇటువంటి పరిస్థితుల్లోనే కర్ణాటక ప్రభుత్వం ముందుకు వచ్చి ప్రకటన విడుదల చేసిన తర్వాత రూ.10 నాణేల చెలామణి ఏడు రెట్లు పెరిగిందని చెప్పారు. అదే విధంగా రాష్ట్ర ప్రభుత్వం కూడా ముందుకు వచ్చే విధంగా చర్యలు తీసుకోవాలని ఈ సమావేశానికి చైర్మన్‌గా వ్యవహరించిన రాష్ట్ర హోంశాఖ కార్యదర్శి కుమార్ విశ్వజిత్‌ను కోరారు. ఇప్పటికే ఆర్బీఐ పలు ప్రకటనలు చేసినా వినియోగం ఆశించినంత పెరగలేదని, ప్రభుత్వ ప్రోత్సాహంతోనే ఇది సాధ్యమవుతుందన్నారు. రూ.10 నోట్లతో పోలిస్తే నాణేల జీవిత కాలం రెండు దశాబ్దాలుపైన ఉంటుందని తెలిపారు.రూ.10 నాణేలు చెల్లవనే ప్రచారం ఒకప్పుడు దక్షిణాది రాష్ట్రాల్లో అత్యధికంగా ఉందని, హైదరాబాద్ రీజినల్ డైరెక్టర్ పరిధిలో రూ.22 కోట్ల విలువైన రూ.10 నాణేలు మింట్, కరెన్సీ చెస్ట్‌ల్లో మూలుగుతున్నాయన్నారు. ప్రస్తుతం దేశంలో 14 డిజైన్లలో పది రూపాయల నాణేలు చెలామణిలో ఉన్నాయని, ఇవన్నీ కూడా చెల్లుతాయని ఆర్బీఐ అధికారులు స్పష్టం చేశారు. దీనిపై స్పందించిన విశ్వజిత్ ఆర్బీఐ లిఖిత పూర్వకంగా ఈ ప్రతిపాదనను పంపిస్తే తక్షణంచర్యలు తీసుకునే విధంగా ప్రభుత్వంతో చర్చిస్తామని హామీనిచ్చారు.రూ.10 నాణేల చెలామణి పెంచే విధంగా బ్యాంకులు కూడా ప్రోత్సహించాలని ఆర్బీఐ కోరింది. అనంతరం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, హెచ్డీఎఫ్సీ బ్యాంకులు, డీమార్ట్, మోడరన్ సూపర్ బజార్, రైస్ మిల్లుల వ్యాపారులకు రూ.10 నాణేలను కమల్ పి పట్నాయక్, కుమార్ విశ్వజిత్ చేతుల మీదుగా అందజేశారు. -
రూ.10 నాణేల చెల్లుబాటుపై ఆర్బీఐ క్లారిటీ
ముంబై : కొన్ని రూ.10 నాణేలు చెల్లుబాటు కావంటూ వస్తున్న పుకార్లపై రిజర్వు బ్యాంకు ఆఫ్ ఇండియా మరోసారి స్పష్టతనిచ్చింది. 14 డిజైన్లలో ఉన్న అన్ని రూ.10 నాణేలు చెల్లుబాటు అవుతాయని, లావాదేవీలకు లీగల్ టెండర్‌గా వీటిని కొనసాగించవచ్చంటూ ఆర్బీఐ బుధవారం వెల్లడించింది. కొంతమంది ట్రేడర్లు ఈ నాణేలను తిరస్కరిస్తున్న క్రమంలో ఆర్బీఐ ఈ ప్రకటన విడుదల చేసింది. కొన్ని ప్రాంతాల్లోని ట్రేడర్లు, ప్రజలు రూ.10 నాణేలను అంగీకరించడం లేదని తమ దృష్టిలోకి వచ్చిందని ఆర్బీఐ తెలిపింది. పలు డిజైన్లలో ఉన్న అన్ని నాణేలకు చట్టబద్దమైన స్టేటస్ కొనసాగుతుందని పేర్కొంది. ఆర్థిక, సామాజిక, సాంస్కృతిక విలువలతో కూడిన పలు అంశాలను ప్రతిబింబించేలా వివిధ ఫీచర్లను ఈ నాణేలు కలిగి ఉన్నాయని, ఎప్పటికప్పుడూ వీటిని ప్రవేశపెడుతున్నామని ఆర్బీఐ తెలిపింది. ఇప్పటివరకు మొత్తం 14 డిజైన్లలో రూ.10 నాణేలను ఆర్బీఐ ప్రవేశపెట్టిందని, ఈ నాణేలన్నీ చట్టబద్ధంగానే కొనసాగుతాయని, వీటిని లావాదేవీల కోసం వినియోగించుకోవచ్చని స్పష్టం చేసింది. బ్యాంకులు కూడా ఈ నాణేలను స్వీకరించాలని, బ్రాంచుల వద్ద వీటిని మార్చుకోవచ్చని ఆర్బీఐ పేర్కొంది. -
పదిరూపాయల కాయిన్లపై తప్పుడు ప్రచారం
-
ఆర్టీసీ బస్సుల్లో రూ.10 నాణేలు చెల్లుబాటు
కర్నూలు(రాజ్‌విహార్): ఆర్టీసీ బస్సుల్లో రూ.10 నాణేలు చెల్లుబాటు అవుతాయని రీజినల్ మేనేజర్ వెంకటేశ్వరరావు ఒక ప్రకటనలో తెలిపారు. ఇటీవల రూ.10 నాణేలు చెల్లవంటూ ప్రచారం జరుగుతోందని, అయితే ఆర్టీసీ బస్సుల్లో వాటిని తీసుకోవాలని డిపో మేనేజర్లు, కండక్టర్లకు ఆదేశాలు జారీ చేశామన్నారు. అలాగే కండక్టర్ల నుంచి కూడా రూ.10 నాణేలు తీసుకుని ప్రయాణికులు సహకరించాలని కోరారు. వీటిపై ఇబ్బందులు ఎదురైతే సంబంధిత అధికారులకు ఫిర్యాదు చేయాలని సూచించారు. ఆర్టీసీ ఖాళీ స్థలాల్లో మినీ థియేటర్లు నిర్మించుకునేందుకు స్థలాలను అద్దెకు ఇస్తామని, వీటిపై సమీక్షించేందుకు ఈడీలు శశిధర్, రామారావు శనివారం కర్నూలుకు రానున్నట్లు వెల్లడించారు. -
అవన్నీ పుకార్లే
రూ.10 కాయిన్లు చెల్లుతాయి వ్యాపారులు నిరభ్యతరంగా తీసుకోవచ్చు ఎవరైనా తీసుకోకపోతే నేరంగా పరిగణిస్తాం తేల్చిచెప్పిన బ్యాంకు ఉన్నతాధికారులు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) నుంచి ఎలాంటి ఉత్తర్వులు రాలేదు. అయినా రూ. 10 కాయిన్లు మారవంటూ 10–15 రోజులుగా పెద్ద ఎత్తున ప్రచారం సాగుతోంది. ఈ ప్రభావం ప్రజలు, చిన్నచితకా వ్యాపారులపై తీవ్రంగా చూపుతోంది. చివరకు కొందరు ఉద్యోగులు, ఉపాధ్యాయులు, మేధావి వర్గాలు సైతం రూ.10 కాయిన్లు తీసుకునేందుకు వెనుకడుగు వేస్తున్నారంటే వీటిపై దుష్ర్పచారం ఎంతగా సాగుతుందో అర్థం చేసుకోవచ్చు. రూ. 10 కాయిన్ మారకంపై జనంలో అపోహలు ఎంత మేర ప్రభావం చూపుతున్నాయో పై రెండు ఉదాహరణలు అద్దం పడుతున్నాయి. - అనంతపురం/అగ్రికల్చర్ -------------------------------- అమ్మవారి ఫొటో ఉంటే చెల్లదట రూ. 10 కాయిన్లపై కొందరు పని గట్టుకుని ప్రచారం చేస్తుండడంతో ప్రజలు తీవ్ర గందరగోళానికి గురవుతున్నారు. దీనికి తోడు కొన్ని బ్యాంకుల్లో సిబ్బంది రూ. పది కాయిన్లు తీసుకునేందుకు ఆసక్తి చూపడం లేదు. ఎందుకంటే వాటిని లెక్కించడం వారికి ఇబ్బందిగా ఉంటోంది. ఇలాంటి తరుణంలోనే బ్యాంకర్లు వాటిని తిరస్కరిస్తున్నారని, అవి చెల్లవంటూ కొందరు దుష్ర్పచారం చేపట్టారు. ముఖ్యంగా అమ్మవారి ఫొటో ఉన్న కాయిన్లు, పదికి మించి లైన్లు ఉన్న కాయిన్లు చెల్లవంటూ రకరకాల ప్రచారం ఊపందుకుంది. అయితే వీటిని బ్యాంకు అధికారులు కొట్టి పడేస్తున్నారు. రూ.10 కాయిన్లపై ఎలాంటి నిషేధం లేదని స్పష్టం చేస్తున్నారు. అపోహలు నమ్మొద్దు రూ.10 కాయిన్లు తీసుకోకపోతే నేరమే అవుతుంది. వాటిని రద్దు చేస్తున్నట్లు కాని, ఇతరత్రా చెల్లుబాటు కావనే ఉత్తర్వులు ఆర్బీఐ నుంచి రాలేదు. నిరభ్యంతరంగా బ్యాంకులు, వ్యాపారులు, ప్రజలు లావాదేవీలు చేసుకోవచ్చు. అపోహలు నమ్మకుండా వాటిని పరస్పరం మార్పిడి చేసుకోవాలి. – పి. అమ్మయ్య, ఆంధ్రాబ్యాంకు చీఫ్ మేనేజర్, అనంతపురం చెల్లుబాటు అవుతాయి. రూ.10 కాయిన్స్ చెల్లుబాటు రద్దు చేస్తున్నట్లు ఆర్బీఐ నుంచి ఎలాంటి ఉత్తర్వులు రాలేదు. నిరభ్యంతరంగా చెలామణి చేసుకోవచ్చన్నారు. వ్యాపారులు కూడా వదంతులు నమ్మకుండా కాయిన్స్ తీసుకోవాలి. ఖాతాదారులు ఎవరైనా బ్యాంకుల్లో డిపాజిట్ చేసుకోవచ్చు. అయితే ఇదే అదనుగా సంచులు సంచులు తీసుకువస్తే సిబ్బంది కొరత, సమయాభావం వల్ల ఇబ్బందులు తలెత్తుతాయి. - శ్రీనివాసరావు, ఏజీఎం, ఎస్బీఐ, అనంతపురం -
రూ.10 నాణెంపై ఆర్బీఐ క్లారిటీ
హైదరాబాద్ : రూ.10 నాణెం చట్టబద్ధత గురించి సాధారణ ప్రజానీకంలో కొంతమంది వ్యక్తులు రేపుతున్న పుకార్లను రిజర్వు బ్యాంకు ఆఫ్ ఇండియా కొట్టిపారేసింది. రూ.10 నాణెలను చట్టబద్ధత కలిగినవని, ప్రజలు తమ లావాదేవీల్లో వీటిని స్వీకరించవచ్చని సెంట్రల్ బ్యాంకు స్పష్టంచేసింది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో కొందరు వ్యక్తులు, రూ.10 నాణెం చట్టబద్ధత గురించి వర్తకులు, దుకాణదారులు, సాధారణ ప్రజానీకంలో ఆందోళనలు రేపిన సంగతి తెలిసిందే. ఈ పుకార్లను కొట్టిపారేస్తూ రిజర్వు బ్యాంకు రూ.10 నాణెంపై క్లారిటీ ఇచ్చింది. ' ''భారత ప్రభుత్వ టంకశాలల్లో తయారైన రూ.10 నాణెంలను రిజర్వు బ్యాంకు చలామణిలోకి తెస్తోంది. ఈ నాణెంలు ప్రత్యేక లక్షణాలు కలిగి ఉంటాయి. ప్రజల లావాదేవీల అవసరాలను తీర్చడం కోసం, ఆర్ధిక, సామాజిక, సాంస్కృతిక విషయాలను ప్రతిబింబించేలా కొత్త డిజైన్, కొత్త డినామినేషన్లలో నాణెంలను తరచుగా ప్రవేశపెడుతుంటాం. ఎక్కువ కాలం ఇవి చలామణిలో ఉంటాయి కనుక ఒకే సమయంలో వివిధ డిజైన్లు, వివిధ ఆకృతులు కలిగిన నాణెంలు చలామణిలో ఉండొచ్చు. జూలై 2011 లో రూపాయి చిహ్నంను ప్రవేశపెట్టడం కూడా ఇలాంటి ఒక మార్పే. కొత్త రూ.10 నాణెం రూపాయి గుర్తు కలిగి ఉంటుంది. పాత రూ. 10 నాణెంలు రూపాయి గుర్తు కలిగి ఉండవు. కానీ ఈ రెండు రకాల నాణెంలు చట్టబద్దమైనవే, లావాదేవీలకు అర్హమైనవే'' అని రిజర్వు బ్యాంకు ఆఫ్ ఇండియా తెలిపింది.